Official Twitter handle of Bharat Rashtra Samithi. BRS Party, formerly known as TRS Party, is an Indian political party founded by Sri KCR.

Joined March 2014
30,272 Photos and videos
పదేండ్ల కేసీఆర్ పాలన.. దశాబ్దాల వెనుకబాటుకు గురైన తెలంగాణను ప్రగతి పథంలో నిలిపిన ఒక 'మహా తపస్సు' ✨✊
7
33
102
1,230
రూ.30 వేల కోట్ల మెట్రో ఆస్తులను రూ.15 వేల కోట్లకు తెచ్చానని రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నాడు. రూ.30 వేల కోట్ల ఆస్తిని రూ.15 వేల కోట్లకు దక్కించుకోవడానికి రేవంత్ రెడ్డి ఏమైనా ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? మెట్రో ఆస్తులను తన బినామీలకు కట్టబెట్టాలని రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి అన్ని ప్రభుత్వ వ్యవస్థల్లోనూ దందాలు చేస్తున్నాడు. మెట్రో రైల్ కొనుగోలు వ్యవహారంలో చాలా పెద్ద కుంభకోణం జరుగుతోంది. దీనిపై తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి - ఎమ్మెల్సీ @sravandasoju
7
34
109
1,723
నరేంద్ర మోదీ దగ్గర నుంచి ₹20,000 కోట్లు తెచ్చి కరీంనగర్‌కు చేసిన అభివృద్ధి ఇదేనా బండి సంజయ్? 🤡
17
106
375
5,918
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్ నగరంలో ఇప్పటివరకు ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టలేదు. 2025లో కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బోయినపల్లి మార్కెట్ పక్కన ఉన్న 8 ఎకరాల ప్రభుత్వ భూమిలో 6000 ఇందిరమ్మ ఇళ్లు కడతామని చెప్పారు. ఇప్పుడు ఆ భూమిని ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసి, చుట్టూ ప్రహారీ గోడ నిర్మించారు. దాదాపు రూ.800 కోట్ల విలువైన ప్రజల ఆస్తి ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోకి ఎలా వెళ్లింది? - బీఆర్ఎస్ నాయకులు @Krishank_BRS
6
34
102
1,240
♦️ మెట్రో రెండవ దశకి అనుమతి దక్కకపోవడం రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనం ♦️ తనపై వేలాడుతున్న ఓటుకు నోటు కేసు వల్లనే కేంద్రాన్ని ప్రశ్నించలేని అసమర్ధతలో రేవంత్ రెడ్డి ♦️ 71సార్లు ఢిల్లీకి వెళ్లినా బీజేపీ రేవంత్ రెడ్డిని దేకడం లేదు ♦️ తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రధానిని ప్రశ్నించలేని అసమర్ధుడు రేవంత్ రెడ్డి ♦️ ప్రధానిని ప్రశ్నించలేకనే ప్రతిపక్షంపై నిందలు వేసే నీచ ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ♦️ మెట్రో రెండో దశను సాధించడంలో అట్టర్ ఫ్లాప్ అయినందుకు, మొదటి దశను ఆగం చేస్తున్నందుకు సీఎం వెంటనే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలి ♦️ హైదరాబాద్ మెట్రో రైల్ పూర్తి చేసిన ఘనత ముమ్మాటికి కేసీఆర్ గారిదే ♦️ 28 శాతం మెట్రో పనులు కూడా పూర్తి చేయకుండా ప్రాజెక్టును చిక్కుల్లో వదిలేసిన నాటి కాంగ్రెస్ ♦️ 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ గారు చొరవ తీసుకుని 72 శాతం పనులను పూర్తి చేశారు ♦️ కేవలం తన స్వార్థ ప్రయోజనాలకోసం ఉనికిలో లేని ఊహ నగరానికి మెట్రో రెండో దశను రేవంత్ రెడ్డి ప్రతిపాదించాడు ♦️ కానీ గత ప్రభుత్వం ట్రాఫిక్ రద్దీ… నగర విస్తరణ… ప్రజల రోజువారీ అవసరాల కోసం మెట్రో రెండో దశను ప్రతిపాదించింది ♦️ 71 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టినప్పటికీ, తన 'బడేభాయ్'ని మెప్పించి ప్రాజెక్టును ఒప్పించలేకపోవడం రేవంత్ రెడ్డి చేతకానితనానికి, దద్దమ్మ పాలనకు నిలువెత్తు నిదర్శనం ♦️ ఎల్ అండ్ టీపై బెదిరింపులు: ఆస్తుల కొల్లగొట్టే కుట్ర వల్లనే ఎల్ అండ్ టీ పారిపోతున్నది ♦️ ఎల్ అండ్ టీపై బెదిరింపులతో మెట్రో రైల్ ఆస్తులు కొల్లగొట్టే కుట్ర - రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 👇🏻 మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టును కేంద్రం నుంచి సాధించలేక, తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రి ఇన్ని కుప్పిగంతులు తొక్కుతున్నారని, అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి తన అసమర్థతను దాచుకోవడానికి అనేక అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. యూపీ, అహ్మదాబాద్, వైజాగ్ వంటి నగరాలకు కేంద్రం మెట్రోలను మంజూరు చేస్తుంటే, హైదరాబాద్‌కు ఎందుకు తీసుకురాలేకపోయారో ముందుగా ప్రజలకు జవాబు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనం మెట్రో రెండవ దశకి అనుమతి దక్కకపోవడం అన్నారు. 71 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టినప్పటికీ, మీ 'బడేభాయ్'ని మెప్పించి ప్రాజెక్టును ఒప్పించలేక పోవడం మీ చేతకానితనానికి, దద్దమ్మ పాలనకు నిలువెత్తు నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రం ప్రతిపాదించిన మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వని కేంద్రం పైన ముఖ్యంగా ప్రధానమంత్రిని విమర్శించే సత్తా ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు అన్నారు. తనపై నమోదైన ఓటుకు నోటు కేసు ఉచ్చు బిగుస్తుందనే భయంతో బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. అందుకే కేంద్రంలోని బీజేపీని కాకుండా తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని విమర్శించి ప్రజలను తప్పుదోవ పట్టించే నీచమైన ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారన్నారు. బీజేపీతో రేవంత్ రెడ్డికి ఉన్న లోపాయికారి ఒప్పందం వల్లనే ఎన్నిసార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా.. పట్టించుకోవడం లేదన్నారు. ఈ అంశంలో రేవంత్ రెడ్డి తన చేతగానితనానికి హైదరాబాద్ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సమర్థవంతమైన నాయకుడు ఉంటే గతంలో కేసీఆర్ పాలనలో అనుమతులు, రుణాలు శరవేగంగా ఎలా వచ్చాయో, మీ దిక్కుమాలిన పాలనలో అవి ఎందుకు ఆగిపోయాయో ప్రజలకు అర్థమవుతోందని పేర్కొన్నారు. ఢిల్లీకి పోతే 'చెప్పులు ఎత్తుకుపోయే దొంగల్ని చూస్తున్నట్టుగా' చూస్తున్నారని మీరే చెప్పుకున్నప్పుడే మీ నిజ స్వరూపం బయటపడిందని, బీఆర్ఎస్ పైన, కేసీఆర్ గారి పైన పడి ఏడవడం తప్ప మీకు ఏ పని చేతకాదని నాలుగు కోట్ల తెలంగాణ సమాజానికి అర్థమైందని కేటీఆర్ అన్నారు. కేంద్రం నుంచి నిధులు రాకుండా బీఆర్ఎస్ అడ్డుకుందని చెప్పడం అంటే, మోదీ కన్నా కేసీఆర్ గారు పవర్ ఫుల్ అని పరోక్షంగా ఒప్పుకున్నట్లే కదా అని ఎద్దేవా చేశారు. మెట్రో రెండో దశను సాధించడంలో అట్టర్ ఫ్లాప్ అయినందుకు, మొదటి దశను ఆగం చేస్తున్నందుకు సీఎం వెంటనే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని, లేకపోతే 'మినీ ఇండియా' లాంటి హైదరాబాద్‌లో మీకు, మీ పార్టీకి పుట్టగతులు ఉండవని కేటీఆర్ హెచ్చరించారు. హైదరాబాద్ మెట్రో రైల్ పూర్తి చేసిన ఘనత ముమ్మాటికి కేసీఆర్ గారిదే నాడు కాంగ్రెస్ పాలనలో 28 శాతం మెట్రో పనులు కూడా పూర్తి చేయకుండా ప్రాజెక్టును చిక్కుల్లో వదిలేసిన పరిస్థితుల్లో, 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ గారు చొరవ తీసుకుని 72 శాతం పనులను పూర్తి చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. కేంద్రం సహకరించకపోయినా, రుణాలు సాధించి మెట్రోను పరుగులు పెట్టించిన ఘనత కేసీఆర్ గారికే దక్కుతుందని స్పష్టం చేశారు. మూడేళ్లలో మెట్రో నిర్మాణాన్ని పూర్తి చేసి, నిత్యం ఐదు లక్షల మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తున్నామంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వ సమర్థత అని, అటువంటి మెట్రోపై పనికిరాని చెత్త వాగుడు వాగడం సరికాదని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణ పట్ల అద్భుతమైన విజయంతో అనేక ప్రణాళికలను గత ప్రభుత్వం రూపొందించింది అన్నారు. రేవంత్ రెడ్డి మాదిరి స్వార్థ ప్రయోజనాల కోసం అసలు ఉనికిలో లేని ఊహాజనిత నగరానికి మెట్రో తీసుకువెళ్లాలన్న మాదిరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచించలేదు అన్నారు. కేవలం ప్రజల ప్రయోజనాలు సౌకర్యం కోసమే దృష్టిలో ఉంచుకొని మెట్రో ఫేజ్-2ను ఆరు కారిడార్లు, 72 స్టేషన్లతో 76.4 కిలోమీటర్ల మేర డిజైన్ చేసింది కేసీఆర్ గారేనని, నలుదిశలా ఆరు రద్దీ రూట్లలో ప్రణాళికలు రచిస్తే, వాటిని పనికిరాని రూట్లు అంటూ ప్రజల్ని అవమానిస్తారా అని రేవంత్ రెడ్డిని నిలదీశారు. రెండున్నరేళ్లలో ఫేజ్-2ను అటకెక్కించడం మీ వైఫల్యమని, అధికారంలోకి రాగానే శంషాబాద్ మెట్రోను రద్దు చేసిన ద్రోహం మీదేనని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎల్ అండ్ టీపై బెదిరింపులు - ఆస్తుల కొల్లగొట్టే కుట్ర వల్లనే ఎల్ అండ్ టి పారిపోతున్నది మెట్రో ఫేజ్-2కు ఎల్ అండ్ టీ సంస్థ అంగీకరించలేదని ఎందుకు బుకాయిస్తున్నారని ప్రశ్నించిన కేటీఆర్, ఏకంగా ఎల్ అండ్ టీ సీఎఫ్ఓనే బెదిరించి, పారిశ్రామికవేత్తల తలకు తుపాకీ పెట్టినట్లుగా భయబ్రాంతులకు గురిచేసి పారిపోయేలా చేసింది మీరే కదా అని ఆరోపించారు. రూ. 30 వేల కోట్ల మెట్రో ఆస్తులను, నడిబొడ్డున ఉన్న మెట్రో భూములను కొల్లగొట్టేందుకే సంస్థను వెళ్లగొట్టే కుట్ర చేశారని ఆయన మండిపడ్డారు. తన స్వార్ధ ప్రయోజనాల కోసం కాసుల కక్కుర్తి కోసం హైదరాబాద్ మెట్రో రైల్ భవిష్యత్తును రేవంత్ రెడ్డి పణంగా పెడుతున్నారన్నారు.
3
33
83
1,263
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుపై ఇంకెన్ని అబద్ధాలు ఆడుతావ్ రేవంత్❓ నాడు ఉమ్మడి రాష్ట్రంలో నత్తనడకన నడిచిన మెట్రో పనులను, కేసీఆర్ గారు పూర్తి చేస్తే.. ఆ క్రెడిట్‌ను మీ ఖాతాలో వేసుకోవాలని చూడటం కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనం!
8
66
245
7,405
పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యను 5 వేల నుండి 20 వేలకు పెంచాలని ఓయూలో నిరుద్యోగుల ధర్నా! కేవలం 5 వేల ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులు కాదు, ఖాళీగా ఉన్న 20 వేల పోస్టులను భర్తీ చేయాలని.. మెగా డీఎస్సీ ద్వారా 25 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. ఉస్మానియా యూనివర్సిటీలోని అంబేద్కర్ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగ యువత భారీ ర్యాలీ నిర్వహించి, ధర్నా చేపట్టారు. నిరుద్యోగులకు అలవిగాని హామీలిచ్చి, నమ్మించి నయవంచన చేసిన కాంగ్రెస్ సర్కార్!
2
38
139
1,835
రాష్ట్రంలో కుప్పకూలిన రిజిస్ట్రేషన్లు.. నయా హిట్లర్ రేవంత్ పాలనకు ఇదే నిదర్శనం 📉 తన తుగ్లక్ నిర్ణయాలతో భూముల మార్కెట్ ధరలను భారీగా పెంచి, రిజిస్ట్రేషన్లను మరింత కుప్పకూల్చిన రేవంత్. మే నెల మొదటి రెండు వారాల రిజిస్ట్రేషన్లతో పోలిస్తే... జూన్ నెలలో ఏకంగా 37 శాతం రిజిస్ట్రేషన్ల తగ్గుదల. తన జేబులు నింపుకోవడం కోసం ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న రేవంత్! #CongressFailedTelangana
4
23
75
1,096
Identity Crisis❗ గద్దెనెక్కి రెండున్నరేళ్లయినా గుంపు మేస్త్రీని ఎవ్వరూ దేక్తలేరు, గుర్తుపడ్తలేరు😂
58
160
530
13,592
గురుకులాల్లో పేద విద్యార్థులకు అందించే భోజన సామాగ్రిని వదలని కాంగ్రెస్ అవినీతి తిమింగలాలు🤮 నిబంధనలు మార్చి, కిరాణా సామాగ్రికి సంబంధించిన 93 వస్తువులను హోల్‌సేల్ ధర కంటే ఎక్కువ ధరలకు కొనుగోలుచేసి ఏకంగా రూ. 200 కోట్లు దోచుకున్న కాంగ్రెస్ దొంగల ముఠా! #SCAMgress #CongressLootingTelangana
23
36
74
1,291
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను ప్రైవేటుకు అప్పజెప్పేందుకు రేవంత్ కుట్ర! ప్లాంట్లను ప్రైవేటుకు అప్పగించొద్దని ఇంజనీరింగ్ అధికారులు విన్నవించినా.. పవర్ ప్లాంట్ లోని కోల్, యాష్ ప్లాంట్లను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పజెప్పేందుకు రూ. 225 కోట్లతో టెండర్లు పిలిచిన కాంగ్రెస్ సర్కార్. కేసీఆర్ గారిపై కక్షతో విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ.. రాష్ట్రాన్ని మళ్లీ చీకట్లోకి నెడుతున్నది కాంగ్రెస్. #CongressFailedTelangana
42
48
115
2,974
👎రేవంత్‌ పాలన అట్టర్‌ ఫ్లాప్‌.! ఖైరతాబాద్‌లో మళ్లీ గులాబీ జెండా ఎగరేద్దాం✌️ 🎯ప్రజలు శుభం కార్డు వేసి.. కాంగ్రెస్ ను ఇంటికి సాగనంపడమే తరువాయి 🎯హైదరాబాద్‌లో ఒక్క ఇటుక పెట్టలేదు..ఇల్లు కట్టలేదు వీకెండ్‌ వస్తే గరీబోళ్ల కొంపలు కూల్చడమే కాంగ్రెస్‌ పని 🎯గరీబోళ్లకు పట్టాలిచ్చిన మహా నాయకుడు కేసీఆర్‌ 🎯దానంని చూసి కాదు.. కేసీఆర్‌ని చూసి ఓటేశారు 🎯దానం నాగేందర్‌ ప్రజలను మోసం చేసి.. రేవంత్‌ పక్కన కూర్చున్నాడు. - ఖైరతాబాద్‌ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ @KTRBRS రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి పాలన పూర్తిగా అట్టర్‌ ఫ్లాప్‌.. డిజాస్టర్‌ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వ గడువులో ఇప్పటికే 50 శాతం సమయం (ఇంటర్‌వెల్‌) అయిపోయిందని, ఇక ప్రజలు శుభం కార్డు వేసి ఇంటికి సాగనంపడమే తరువాయి.. అని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన ఖైరతాబాద్‌ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ఎస్‌ఐఆర్‌, పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఖైరతాబాద్‌లో రెండు సార్లు గులాబీ జెండా ఎగురవేశామని, మూడోసారి కూడా సిద్ధం కావాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. దానం నాగేందర్‌ నియోజకవర్గ ప్రజలను మోసం చేసి.. రేవంత్‌రెడ్డి పక్కన కూర్చున్నారని మండిపడ్డారు. దానం నాగేందర్‌ను చూసి ఓటు వేయలేదని, కేసీఆర్‌ని చూసి ఓటేశారన్నారు. 2018, 2023లో గెలిచినట్టు.. మళ్లీ 2028లో కూడా గులాబీ జెండా ఎగరేద్దామని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.. ntnews.com/hyderabad/brs-wor…
42
39
110
1,532
🚨 కాంగ్రెస్ డేంజర్‌ గేమ్‌ 🆘 ⛔ తమ్మిడిహట్టిలో రెండు బరాజ్‌లకు ప్రభుత్వం మొగ్గు ❌ ⚠️ వార్ధా మీద ఒకటి. ప్రాణహితపై మరొకటి నిర్మాణం 🏞️ 2.1 కిలోమీటర్ల కాంక్రీట్ తో అసహజ నదీ సంగమం. మొత్తంగా నదిపై 6.5 కిలో మీటర్ల మేర నిర్మాణాలు 📢 సాంకేతికంగా సంక్లిష్టం.. పైగా అత్యంత ప్రమాదకరం 📣 నిర్దేశిత లక్ష్యం మేరకు నీటి మళ్లింపు అసాధ్యం ❌ నిపుణుల సూచనలను పెడచెవిన పెడ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం మీద కోపం.. కేసీఆర్‌ మీద కడుపునిండా కసి.. మేడిగడ్డ బరాజ్‌ రెండు పిల్లర్లకు రెండున్నరేండ్లుగా రిపేర్ చేయించడానికి చేతులు రాని కాంగ్రెస్‌ ప్రభుత్వం.. తమ్మిడిహట్టిపై తలకిందులుగా తపస్సు చేస్తున్నది. మొదట్లో తమ్మిడిహట్టిపై తొడగొట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. అక్కడ సాంకేతికంగా ప్రాజెక్టు సాధ్యంకాదని ఒక నిర్ణయానికి వచ్చింది. సాంకేతిక సమస్యలు, మహారాష్ట్ర అభ్యంతరాలు, పర్యావరణ ప్రతిబంధకాల నేపథ్యంలో ప్రతిపాదనలను మార్చుతూపోతున్నది. రెండు పిల్లర్లకు మరమ్మతులు చేయించి, కాళేశ్వరం ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాల్సిందిపోయి.. ఇప్పుడు రెండు బరాజ్‌లు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నది. సాధారణంగా రెండు నదులు సహజంగా కలిసిన సంగమ స్థానం తర్వాత బరాజ్‌లు, ప్రాజెక్టులు నిర్మిస్తుంటారు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం రెండు నదులకు అడ్డంగా బరాజ్‌లు నిర్మించి, వాటిని మరో కాంక్రీట్‌ నిర్మాణంతో అనుసంధానించి, అసహజంగా నదీ సంగమం చేయాలని భావిస్తున్నది. భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదాలపై అంచనా లేదు! రెండు నదుల్లోని వేర్వేరు ప్రవాహ ఉధృతిని ఏకకాలంలో ఎలా మేనేజ్‌ చేస్తారనే స్పష్టత లేదు! ముంపు సమస్యపై అధ్యయనం లేదు! ఇంజినీర్లతో విస్తృతంగా చర్చించిందీ లేదు! అయినా సరే.. తాననుకున్నదే జరగాలన్న మొండిపట్టుతో ఎక్కడా లేని వింతైన నిర్మాణానికి సర్కార్‌ సిద్ధమైంది.
54
33
89
2,062
మళ్లీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించి, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు రాష్ట్ర ప్రజలంతా ముక్తకంఠంతో ఎదురుచూస్తున్నారు!
2
43
181
2,286
గద్దెనెక్కిన ఈ రెండున్నరేండ్ల సంది కాంగ్రెసోళ్లు ఏ పని చేసినా... దాని వెనుక ఒక పెద్ద స్కామ్‌ ఉంటది! ​చిన్న పిల్లల యూనిఫామ్‌ల కాంట్రాక్టుల దగ్గరి నుండి సింగరేణి బొగ్గు గనుల దాకా... ప్రతి దాంట్లోనూ స్కామ్‌లు చేసిండ్రు, అడ్డగోలుగా ప్రజాసొమ్మును దోచుకుంటుండ్రు. ​- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish.
79
46
145
1,816
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ఈ సమావేశంలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సి. లక్ష్మా రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామ్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే విజేయుడు, మాజీ ఎంపీలు మన్నె శ్రీనివాస్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డిలు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేటీఆర్ గారి కామెంట్స్ 👇 🔹 మహబూబ్‌నగర్ ప్రజలు కాంగ్రెస్‌ను, రేవంత్ రెడ్డిని తరిమికొడతారు 🔹 పాలమూరు ప్రాజెక్టును పక్కనపెట్టి, పాలమూరు ప్రజలకు రేవంత్ రెడ్డి ద్రోహం చేస్తున్నారు 🔹 వచ్చే ఎన్నికల్లో కొడంగల్‌లో రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదు 🔹 2028 ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ ఖాయం 🔹 కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలి.. బీఆర్ఎస్ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చేస్తున్న అన్యాయం ప్రతి ఒక్కరికీ అర్థమైందని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మహబూబ్‌నగర్ ప్రజలు సంపూర్ణంగా తిరస్కరిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని మహబూబ్‌నగర్ ప్రజలు జిల్లా నుంచి తరిమికొడతారని ఆయన హెచ్చరించారు. దాదాపుగా పూర్తయిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కనపెట్టి, కమిషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం లక్షల ఎకరాల పంటలకు నీరందకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహం ప్రతి ఒక్కరికీ అర్థమైందన్నారు. మహబూబ్‌నగర్ బిడ్డనని పదేపదే చెప్పుకుంటూ జిల్లా ప్రజలను మోసం చేస్తూ, అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధికి ద్రోహం చేస్తున్న రేవంత్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి కూడా తరిమికొడతారని కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పక్కనపెట్టి తీవ్రమైన ద్రోహం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో మాదిరిగానే మరోసారి కొడంగల్ నియోజకవర్గంలోనూ రేవంత్ రెడ్డికి ప్రజలు ఎన్నికల్లో గుణపాఠం చెబుతారన్నారు. కేవలం మాటలు చెప్పి, ప్రకటనలకు పరిమితమైతే జిల్లా ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని ఇప్పటికే అందరికీ తెలిసిపోయిందన్నారు. జిల్లా ప్రజలకు చేయాల్సిన అభివృద్ధిని, పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులను పక్కనపెట్టి కేవలం రాజకీయాలు చేస్తున్న రేవంత్ రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా తెలంగాణ ఏర్పాటుకు ముందు వలసల జిల్లాగా, కరువు జిల్లాగా ఉండేదని, అలాంటి జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపి కరువును, వలసలను తరిమికొట్టిన ఘనత ముమ్మాటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని కేటీఆర్ గుర్తు చేశారు. ఇంత గొప్పగా జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించడంలో గత ఎన్నికల్లో పార్టీ విఫలమైందని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలన చూసిన తర్వాత ప్రజలకు గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి అర్థమవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఒకవైపు ప్రజల్లోకి తీసుకెళ్తూనే, గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని మరోసారి ప్రజలకు గుర్తుచేయాలని కేటీఆర్ సూచించారు. ముఖ్యంగా పాలమూరు జిల్లాకు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాన్ని ఎత్తిచూపాలన్నారు. 60 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు తాగునీరు అందకుండా, ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందకుండా వెనుకబడిన జిల్లాగా చేసిన ద్రోహాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందన్నారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారి నివాసంలో జరిగిన ఈ సమావేశానికి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని క్షేత్రస్థాయి పరిస్థితులపై కేటీఆర్ నాయకుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ ప్రస్తుతం నిర్వహిస్తున్న సమావేశాలు, నియోజకవర్గ స్థాయి సమావేశాల తీరును ఆయన సమీక్షించారు. త్వరలో ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం, పార్టీ చేపట్టనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై నియోజకవర్గాల వారీగా చర్చించారు. కేటీఆర్ పార్టీ నేతలకు రానున్న ఎన్నికలు, పార్టీ బలోపేతానికి సంబంధించిన పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలోని బూత్ వారీగా పార్టీని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా కలిసికట్టుగా పక్కా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు.
2
32
122
6,649
కాంగ్రెస్ నేతల మాటలు విని... పోలీసులు మా కార్యకర్తలను వేధిస్తే అస్సలు సహించే ప్రసక్తే లేదు మళ్లీ వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే 🔥 చట్టాన్ని ఉల్లంఘించి ఏకపక్షంగా వ్యవహరించే అధికారులపై భవిష్యత్తులో చట్టపరమైన చర్యలు తప్పవు. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish.
77
59
202
2,798
ఈట్ కా జవాబ్... పత్తర్ సే దేంగే 🔥✊ బిడ్డా రేవంత్... బీఆర్ఎస్ గద్దెలను కూలుస్తామంటే చూస్తూ ఊరికే ఉండం నీకు ఎలా బుద్ధి చెప్పాలో.. ఏ భాషలో సమాధానం ఇవ్వాలో.. మాకు బాగా తెలుసు! - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish 🔥
63
72
330
5,351
BRS Party retweeted
భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన SIR బూత్ లెవెల్ ఏజెంట్ల అవగాహన సదస్సులో ముఖ్య అతిథి గా పాల్గొని కార్యకర్తలు, బూత్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేయడం జరిగింది
11
80
1,146