గత కొద్ది రోజులుగా డిఎస్సీ 2025 నియామకాలపై ఒక పద్ధతి ప్రకారం తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు ప్రతి అంశంపైనా పూర్తి స్థాయిలో వివరణలు ఇచ్చినా మళ్లీ మళ్లీ అవే తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తాజాగా కమ్మకులానికి చెందిన వారు టెట్ రాయకపోయినా స్పోర్ట్స్ కోటాలో డిఎస్సీ పోస్టులు ఇచ్చారనే తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. బాధ్యతగల పదవులు నిర్వహించిన వ్యక్తులే తప్పుడు ప్రచారానికి పాల్పడటం దురదృష్టకరం. డిఎస్సీ 2025లో మొత్తం నియామకాలు 15,941 కాగా అందులో మహిళలు 7,955 మంది. మాజీ సైనికులు 112 మంది, PwBD (దివ్యాంగులు)లలో OH కోటా కింద 190 మంది, VH కోటా కింద 158 మంది, HI కోటా కింద 119 మంది, MI కోటా కింద 24 మంది నియమితులయ్యారు. స్పోర్ట్స్ కోటా కింద 372 మంది మాత్రమే నియమితులయ్యారు. స్పోర్ట్స్ కోటా కింద నియమితులయిన వారిలో బీసీలు 50%, ఎస్ సిలు 30 %, ఎస్ టిలు 8%, ఓసీలు 12% మంది ఉన్నారు. ఓసీ 12% మంది లో కమ్మ కులానికి చెందిన వారు కేవలం 9 మంది మాత్రమే ఉన్నారు. ఇదే కోటా లో కాపు కులస్థులు 16 మంది, రెడ్డి కులస్థులు 10 మంది ఉన్నారు. వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ కులాల నుంచి ఇద్దరు చొప్పున, ముస్లిం వర్గం నుంచి ఒకరు ఉన్నారు. BC Aకు చెందిన 2,088 మంది అభ్యర్ధులు నియమితులయ్యారు. BC Bలో 2,680 మంది, BC C లో248 మంది, BC Dలో 2,610 మంది, BC Eలో 1,067 మంది నియమితులయ్యారు. OC లో 3,192 మంది నియమితులయ్యారు. SC GR1 లో 145 మంది, SC GR 2లో 1,345 మంది, SC GR 3లో 1,555 మంది నియమితులు కాగా STలో 1,011 మంది నియమితులయ్యారు. పూర్తి అర్హతతో, నియమ నిబంధనలకు అనుగుణంగా ఎంపిక అయి, వృత్తిలో తమ ప్రతిభను చూపిస్తున్న టీచర్ల పట్ల ఇలా తప్పుడు ప్రచారం చేసి వారి మానసిక స్థితిని దెబ్బతీయాలని చూడటం సబబు కాదు. తప్పుడు ఆరోపణలు చేసి సమాజంలో కల్లోలం రేపే ప్రయత్నం చేయడం క్షంతవ్యం కాదు. దయచేసి ఈ తప్పుడు ఆరోపణలను ఎవరూ నమ్మవద్దు. తప్పుడు సమాచారం పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
#FactCheck
#AndhraPradesh