Joined September 2016
1,836 Photos and videos
Pinned Tweet
22 Nov 2025
వినియోగ‌దారుల‌కు జ‌ల‌మండలి విజ్ఞ‌ప్తి ================ కొంద‌రు అజ్ఞాత వ్య‌క్తులు గుర్తు తెలియ‌ని మొబైల్‌ నెంబ‌ర్ల‌నుంచి.. జ‌ల‌మండ‌లి న‌ల్లాబిల్లు చెల్లించ‌కుంటే క‌నెక్ష‌న్ తొల‌గిస్తామ‌ని, తప్పుడు స‌మాచారాన్ని వినియోగ‌దారుల‌కు SMS ద్వారా చేర‌వేస్తున్నార‌ని జ‌ల‌మండ‌లి దృష్టికి వ‌చ్చింది. అలాంటి మెసేజ్‌ల‌కు స్పందించ‌కూడ‌దని జ‌ల‌మండ‌లి విజ్ఞ‌ప్తి చేస్తోంది. వివిధ మొబైల్ నెంబ‌ర్ల నుంచి గ‌త‌నెల బిల్లు చెల్లించ‌క‌పోతే మీ న‌ల్లా క‌నెక్ష‌న్‌లు తొల‌గిస్తామ‌ని మెసేజ్ పంపిస్తున్నారు. అలాగే మ‌రిన్ని వివ‌రాల‌కోసం మరో మొబైల్ నెంబ‌ర్ ను సంప్రదించమ‌ని పేర్కొంటున్నారు. ఆ నెంబ‌ర్‌ను సంప్ర‌దించ‌గానే ప్రాసెసింగ్ కోస‌మ‌ని APK ఫైల్‌ను వాట్సాప్‌ద్వారా పంపిస్తారు. అయితే ఈ విష‌యంపై ఇలాంటి మెసేజ్‌లు/ APK యాప్ కానీ జ‌ల‌మండ‌లి పంపించిన‌వి కావ‌ని, హైద‌రాబాద్ ప్ర‌జ‌లు ఇటువంటి సందేశాల‌కు స్పందించ‌కుండా, పై నెంబ‌ర్‌ల‌ను సంప్ర‌దించ‌కుండా, వాట్సాప్‌కు వ‌చ్చిన APK ఫైల్‌ల‌ను డౌన్‌లోడ్ చేయ‌కుండా/ఇన్‌స్టాల్ చేయ‌కుండా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జ‌ల‌మండ‌లి వినియోగ‌దారుల‌కు విజ్ఞ‌ప్తి చేస్తోంది. జ‌ల‌మండ‌లి నుంచి అన్ని అధికారిక‌ స‌మాచారాలు కేవ‌లం అధికారిక‌ మార్గాల (అన్నీ పేప‌ర్లు, వివిధ టీవీ చానెల్‌లు) ద్వారా జారీ చేస్తుంది. ఈ విష‌య‌మైనా.. ఏవైనా స‌మ‌స్య‌లు లేదా సేవా సంబంధిత సందేహాలు ఉంటే జ‌ల‌మండ‌లి క‌స్ట‌మ‌ర్ కేర్ 155313కి సంప్ర‌దించాల‌ని కోరుతుంది.
55
12
49
34,691
జంట జలాశయాలకు వరద ప్రవాహాలు ప్రారంభం =================== # అప్రమత్తంగా ఉండాలని జలమండలి సూచన # ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు ఎగువ ప్రాంతాల వర్షాల కారణంగా వరద ప్రవాహాలు ప్రారంభమయ్యాయి. # జలాశయాల్లోకి వస్తున్న ప్రవాహాల పరిమాణం, నీటి మట్టాలను జలమండలి సాంకేతిక బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. # పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. # అన్ని ప్రభుత్వ శాఖలు, విపత్తు నిర్వహణ విభాగాలు, స్థానిక సంస్థలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి సూచించింది. # జలాశయాల దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేసింది. # గేట్ల నిర్వహణ, నీటి విడుదల లేదా ఇతర అత్యవసర నిర్ణయాలపై అధికారిక ప్రకటనల ద్వారా సమాచారం అందజేస్తామని తెలిపింది. # జలమండలి ఎండీ అశోక్ రెడ్డి జంట జలాశయాల పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. # సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో అప్రమత్తంగా పనిచేయాలని ఎండీ ఆదేశించారు. # దిగువ ప్రాంతాల ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ పరిస్థితిని గమనించాలని సూచించారు. # అవసరమైతే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.
2
1
10
912
వర్షాకాలం నేపథ్యంలో అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేసిన జ‌ల‌మండ‌లి ఎండీ ===================== # జేఎండీ మయాంక్ మిట్టల్ తో కలిసి అధికారుల‌తో ఎండీ టెలీ కాన్ఫ‌రెన్స్ నగరంలో కురుస్తున్న వర్షాలవ‌ల్ల ప్ర‌జ‌లకు ఇబ్బంది లేకుండా అన్ని ర‌కాలుగా ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, ఈఆర్‌టీ బృందాలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జ‌ల‌మండ‌లి ఎండీ అశోక్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఈ మేర‌కు ఈ రోజు ఆయ‌న జేఎండీ మయాంక్ మిట్టల్ తో కలిసి సంబంధిత అధికారుల‌తో టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ టెలీ కాన్ఫ‌రెన్స్ లో.. వర్షంకాలం నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు త‌లెత్త‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు సూచించారు. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ లు (ఈఆర్టీ), ఎస్పీటి వాహనాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తరచూ సీవరేజీ ఓవర్ ఫ్లో అయ్యే మ్యాన్హోళ్లు గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. నీరు నిలిచే ప్రాంతాలపైన ఈ బృందాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ఈ సమయంలో కలుషిత నీరు సరఫరా కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, తాగునీటిలో తగిన మోతాదులో క్లోరీన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో నీటి సరఫరాపై అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని.. ఈ ప్రాంతాల్లో కలుషిత నీరు సరఫరా కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు త‌లెత్త‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. అధికారులు 24 గంటలు క్షేత్ర స్థాయిలో సిబ్బందితో పర్యవేక్షించుకోవాలని సూచించారు. సీవరేజి ఓవర్ ఫ్లో ను సీరియస్ గా తీసుకుని ఎక్కడా సమస్యలు తలెత్తకుండా చూడాలని చెప్పారు. వివిధ అంశాలపై వచ్చే ఫిర్యాదుల్ని అరగంటలో పరిష్కరించాలన్నారు. సీవరేజీ ఓవర్ ఫ్లో తో పాటు కలుషిత నీటి సరఫరా వంటి వాటిపై వచ్చే ఫిర్యాదులను.. అరగంటలో పరిష్కరించాలని ఆదేశించారు. వాటర్ హాట్ స్పాట్లు గుర్తించి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. మ్యాన్ హోల్స్ కు సేఫ్టీ గ్రిల్స్ బిగింపు, ప్రమాదకర మ్యాన్ హోల్స్ వద్ద రెడ్ ఫ్లాగ్స్, సూచిక బోర్డులు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని వివరించారు. వర్షాకాలంలో కలుషిత నీటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి పొల్యూషన్ ఐడెంటిఫికేషన్ యంత్రాలను సమర్థంగా ఉపయోగించుకోవాలని ఎండీ సూచించారు. జలమండలి, జీహెచ్ఎంసీ 140 వాటర్ లాగింగ్ పాయింట్లను నిత్యం పర్యవేక్షించాలని ఎండీ తెలిపారు. మ్యాన్ హోళ్ల నుంచి తీసిన వ్యర్థాలను (సిల్ట్) ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. మంచి నీటి పైపు లైను నాలా క్రాసింగ్ వద్ద చెత్త చేరకుండా సంబంధిత అధికారులు జాగ్రత్త వహించాలని సూచించారు. ముంపునకు గురైన మ్యాన్హోళ్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. రహదారుల మీద ఉన్న మ్యాన్ హోళ్లకి.. ఎరుపు రంగు వేయాలని ఎండీ ఆదేశించారు. డీప్ మ్యాన్ హోళ్ల దగ్గర సీవరేజి సూపర్వైజర్లు ఉండేలా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది యూనిఫాం ధరించి.. తప్పనిసరిగా రక్షణ పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. బోర్డు సిబ్బంది అంతా.. ఈ సీజన్ లో విమర్శలకు తావు లేకుండా పనిచేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీస్ శాఖ‌ల అధికారుల‌తో క‌లిసి స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. న‌గ‌ర ప్ర‌జ‌లు ఎలాంటి ప‌రిస్థితుల్లోనూ మ్యాన్‌హోల్ మూత‌ల‌ను తెర‌వ‌కూడ‌దని ఆయ‌న సూచించారు. ఇత‌ర వివ‌రాలకు జ‌ల‌మండ‌లి క‌స్ట‌మేర్ కేర్ 155313కి కాల్ చేయాల‌ని ఆయ‌న కోరారు.
2
2
7
1,408
తాగునీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం ===================== హైద‌రాబాద్ న‌గ‌రానికి తాగునీరు స‌ర‌ఫ‌రా చేసే మంజీరా ఫేజ్-2 లోని కలబ్‌గూర్–పటాన్‌చెరు పంపింగ్ మెయిన్‌కు చెందిన 1500 మి.మీ. వ్యాసం గల ప్రధాన పైప్‌లైన్‌లో రుద్రారం గ్రామం సమీపంలో భారీ లీకేజీ ఏర్పడింది ఈ భారీ లీకేజీలను అరికట్టడానికి జలమండలి అధికారులు అత్యవసర మరమ్మత్తు పనులు చేపట్టారు. దీనికి కార‌ణంగా న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో నీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయాలు ఏర్ప‌డ‌తాయి. ప‌నులు పూర్తి కాగానే య‌ధావిధిగా నీటి స‌ర‌ఫ‌రా పున‌రుద్ధ‌ర‌ణ జ‌రుగుతుంది. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి మరమ్మతుల పనులపై తాజా పరిస్థితి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్స్‌ అండ్ మెయింటెనెన్స్‌, ట్రాన్స్‌మిషన్‌ అధికారులు సమన్వయంతో పనులు చేపట్టాలన్నారు. సాధ్యమైనంత తొందరగా పనులు పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని ఎండీ అధికారులను ఆదేశించారు. లీకేజీ వల్ల నీటి సరఫరాలో అంతరాయం కలిగిన ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగడకుండా ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని సూచించారు. సాధ్యమైనంత తొందరగా పనులు పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని ఎండీ అధికారులను ఆదేశించారు. అంత‌రాయం ఏర్ప‌డే ప్రాంతాలు: ------------------------------------- 1. ఓ అండ్ ఎం డివిజ‌న్ 17: ఆర్సీ పురం, అశోక్ న‌గ‌ర్, జ్యోతి న‌గ‌ర్, లింగంప‌ల్లి, చందాన‌గ‌ర్, గంగారం, మదీనాగూడ‌, మియాపూర్. 2. ఓ అండ్ ఎం డివిజ‌న్ 22: లాన్బీరంగూడ‌, అమీన్ పూర్, భాగ్యనగర్ కాలనీ. 3. ట్రాన్స్ మిష‌న్ డివిజ‌న్ 2: ఆఫ్ టేక్ పాయింట్స్, బల్క్ క‌నెక్ష‌న్లు. 4. ఓ అండ్ ఎం డివిజ‌న్ 6: ఎర్ర‌గ‌డ్డ‌, ఎస్.ఆర్.న‌గ‌ర్, అమీర్ పేట్. 5. ఓ అండ్ ఎం డివిజ‌న్ 9:కేపీహెచ్ బీ కాల‌నీ, కూక‌ట్ ప‌ల్లి, భాగ్యనగర్ కాలనీ ప్రగతి నగర్ కాబ‌ట్టి.. పైన పేర్కొన్న ప్రాంతాల వినియోగ‌దారులు నీటిని పొదుపుగా వాడుకోగ‌ల‌ర‌ని కోర‌డ‌మైనది.
18
4
63
13,503
తొలి వర్షాల నేపథ్యంలో తాగునీటి నాణ్యత పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి =================== # క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి.. # ఆదేశించిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి నైరుతి రుతుపవనాల ఆగమనంతో నగరంలో వర్షాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తాగునీటి నాణ్యతను పరిరక్షించేందుకు జలమండలి అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. వర్షా కాలంలో తాగు నీరు కలుషితం అవకాశం ఉండటంతో పంపిణీ వ్యవస్థలో అన్ని స్థాయిలలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తొలి వర్షాల సమయంలో స్లూయిస్ వాల్వ్ ఛాంబర్లలో వర్షపు నీరు చేరే అవకాశం ఉన్నందున నీటి సరఫరా ప్రారంభించే ముందు తప్పనిసరిగా స్కవర్ వాల్వ్‌లను నిర్వహించి లైన్లను శుభ్రపరచాలని ఎండీ ఆదేశించారు. జలమండలి పరిధిలోని అన్ని వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, రిజర్వాయర్లు, పంపిణీ నెట్‌వర్క్ శాంప్లింగ్ పాయింట్ల వద్ద నీటి నాణ్యత పరీక్షలను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. అలాగే క్లోరిన్ పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించడంతో పాటు రా వాటర్.. శుద్ధి చేసిన నీటిలో టర్బిడిటీ స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. వినియోగదారుల వద్ద కనీసం 0.2 పిపిఎం ఉండేలా చర్యలు తీసుకోవాలని, కలుషిత నీరు సరఫరా అవకాశం ఉన్న ప్రాంతాల్లో క్లోరినేషన్ మోతాదును అవసరానికి అనుగుణంగా పెంచాలని తెలిపారు. క్లోరినేషన్ పరికరాలు సక్రమంగా పనిచేసేలా చూడటంతో పాటు బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ నిల్వలు తగిన మోతాదులో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కాలువలు, నాలాలు, నీరు నిలిచే ప్రాంతాల సమీపంలో ఉన్న పైప్‌లైన్‌లను ప్రత్యేకంగా తనిఖీ చేయాలని, లీకేజీలు, దెబ్బతిన్న పైపులు, లోపభూయిష్ట వాల్వ్‌లను వెంటనే మరమ్మతు చేయాలని సూచించారు. ఎయిర్ వాల్వ్‌లు, స్కవర్ వాల్వ్‌లు, ఛాంబర్లలో వర్షపు నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రిజర్వాయర్లు, సర్వీస్ ట్యాంకుల మూతలు, వెంటిలేటర్లు, మ్యాన్‌హోల్‌లను పూర్తిగా సీలింగ్ చేసి వర్షపు నీరు, కీటకాలు, ఇతర కాలుష్య కారకాలు లోనికి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని ఎండీ సూచించారు. లో ప్రెషర్ ఉన్న ప్రాంతాలను గుర్తించి పొల్యూషన్ జరగకుండా పంపిణీ వ్యవస్థలో ఎల్లప్పుడూ తగిన ఒత్తిడిని కొనసాగించాలని ఆదేశించారు. నీరు నిలిచే కీలక ప్రాంతాల్లో ప్రత్యేక ఫీల్డ్ బృందాలను మోహరించాలని, ముంపు ప్రాంతాల గుండా వెళ్లే పైప్‌లైన్‌లను నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. సివరేజ్ పనుల్లో సమన్వయంగా పనిచేస్తూ నీటి పైప్‌లైన్‌లు, సీవరేజ్ లైన్లు సమాంతరంగా ఉన్న ప్రాంతాలను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని, సీవరేజ్ ఓవర్‌ఫ్లోలు, లీకేజీలను అత్యవసర ప్రాధాన్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మురుగునీరు తాగునీటి వ్యవస్థలోకి ప్రవేశించకుండా చూడాలని పేర్కొన్నారు. కలుషిత నీరు సరఫరా ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైతే ప్రజలు నీటిని మరిగించి వినియోగించేలా అవగాహన కల్పించాలని సూచించారు. పైప్‌లైన్ ధ్వంసం అయినా, పొల్యూషన్ ఘటనలు ఎదురైనప్పుడు స్పందించేందుకు ఏఏంఎస్ బృందాలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని, అవసరమైతే ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నాయ తాగునీటి సరఫరా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వర్షాల ప్రభావం వల్ల నీటి నాణ్యత, లీకేజీలు, ప్రజా ఫిర్యాదులపై ప్రతిరోజూ సమీక్ష నిర్వహించి సంబంధిత నివేదికలను ఉన్నతాధికారులకు సమర్పించాలని ఎండీ తెలిపారు. అలాగే అధికారులు, సిబ్బంది చివరి స్థాయి క్షేత్ర సిబ్బంది వరకు ఈ సూచనలను కచ్చితంగా అమలు చేయాలని, అదే విధంగా స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ సంక్షేమ సంఘాలు, సమాజంలోని వివిధ వర్గాలతో సమన్వయం చేసుకుంటూ ప్రజల్లో అవగాహన పెంపొందించాలని అశోక్ రెడ్డి స్పష్టం చేశారు.
10
4
6
1,264
జలమండలి కూకట్‌పల్లి జోన్‌లో రైన్‌వాటర్ హార్వెస్టింగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించిన జలమండలి # కేపీహెచ్.బీ కాలనీ వాసులు నూతనంగా నిర్మించిన 40 ఇంకుడు గుంతలను ప్రారంభించిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి # నీటి సంరక్షణ ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత: ఎండీ అశోక్ రెడ్డి # వర్షపు నీటిని భూమిలోకి ఇంకించడం ద్వారా భూగర్భ జలాల పెంపు సాధ్యమని సూచన # ప్రతి ఇల్లు, అపార్ట్‌మెంట్‌లో ఇంకుడు గుంతలను నిర్మించాలని చేయాలని పిలుపు # వర్షపు నీటి ప్రతి బొట్టు భవిష్యత్తు తరాలకు అమూల్యమైన సంపద : ఎండీ # నీటి వృథాను అరికట్టి నీటి వనరులను పరిరక్షించాలని ప్రజలకు విజ్ఞప్తి # ఇంటింటా ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రజలు ముందుకు రావాలని పిలుపు # ప్రజల భాగస్వామ్యంతోనే నీటి సంరక్షణ ఉద్యమం విజయవంతమవుతుందని ఎండీ వ్యాఖ్య # భవిష్యత్తులో నీటి కొరతను నివారించేందుకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అత్యవసరమని సూచన # నగరవ్యాప్తంగా నీటి సంరక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న జలమండలి # నీటిని పొదుపుగా వినియోగించి భవిష్యత్ తరాలకు భద్రపరచాలని ప్రజలకు పిలుపు.
7
5
10
1,668
Replying to @akbar561
Good morning Sir can you please share with us the complaint no details ?
3
880
Sir, this is to inform you that complaint no 1395 has been escalated to the concerned officials BANDLAGUDA JAGIR Section Manager. We appreciate your patience and will keep you updated on the progress. Thank you."
837
జలమండలిలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ===================== జలమండలిలో తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం ఖైరతాబాద్ లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలకు ఎండీ అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన జలమండలి అధికారులు, ఉద్యోగులు, వినియోగదారులకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జలమండలి రీజియన్ ఈడీలు పంకజ, సామ్రాట్ అశోక్, సంతోష్, డైరెక్టర్లు, మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, వాస సత్యనారాయణ, ప్రభు, సీజీఎంలు, జీఎంలు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని వివిధ జలమండలి డివిజన్, సెక్షన్ కార్యాలయాల్లోనూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జలమండలి అధికారులు, ఉద్యోగులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
5
2
7
1,241
నీటి వృధాపై జలమండలి చర్యలు* ==================== # రూ.10 వేల జరిమానా విధింపు బంజారాహిల్స్ పరిధిలో నీటి దుర్వినియోగంపై అందిన ఫిర్యాదును జలమండలి అధికారులు పరిశీలించి జరిమానా విధించారు. బంజారాహిల్స్‌లోని ఆనంద్ నగర్ కాలనీలో ఉన్న శ్రీ సాయిరామ్స్ వెస్ట్‌ఎండ్ అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన CAN నంబర్ 619347736 వద్ద నీరు రోడ్డుపైకి వదులుతున్నట్లు ఫిర్యాదు అందింది. ఈ మేరకు బంజారాహిల్స్ వార్డు, జూబ్లీహిల్స్ సర్కిల్, ఓ అండ్ ఎం డివిజన్–XV అధికారులు స్థలాన్ని పరిశీలించారు. పరిశీలనలో ఆ అపార్ట్‌మెంట్‌కు నీటి సరఫరా రేపటికి షెడ్యూల్‌లో ఉన్నట్లు, అయితే ఓవర్‌హెడ్ ట్యాంకుల శుభ్రపరిచే ప్రక్రియలో భాగంగా నీటిని రోడ్డుపైకి వదిలినట్లు గుర్తించారు. విలువైన తాగునీటిని వృథా చేయడం, రోడ్డుపైకి నీటిని వదలడం అనేది నిబంధనలకు విరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సంబంధిత వినియోగదారునికి రూ.10,000 జరిమానా విధించారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతమైతే, సంబంధిత వినియోగదారుడి నీటి సరఫరా సేవలను నిలిపివేయాల్సి వస్తుందని అధికారులు హెచ్చరించారు. జలమండలి పరిధిలోని వినియోగదారులు నీటిని బాధ్యతాయుతంగా వినియోగించాలని, ట్యాంకులు శుభ్రపరిచే సమయంలో నీటిని రోడ్లపైకి వదలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జలమండలి విజ్ఞప్తి చేసింది. నీటి వృధా, అక్రమ వినియోగం, రోడ్లపైకి నీరు వదలడం వంటి అంశాలపై ఫిర్యాదులు అందిన వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
8
2
18
2,406
Good Afternoon Sir/Madam, We regret the inconvenience caused due to sewerage overflow and polluted water supply. Kindly share any one CAN (Consumer Account Number) or house number of the affected premises receiving polluted water.
1
1,036
Sir/Madam we're sorry to hear about the experience you've had. Complaint with token no 8728 has been escalated and notified to the concerned officials @hmwssbgmom6 @hmwssbdgmbnjhil @hmwssbmgrjbhls JUBILEE HILLS Section Manager. Will be rectifying it asap. Thank You.
1
602
HMWSSB retweeted
#Hyderabad: @HMWSSBOnline MD Ashok Reddy conducted surprise inspections at the #Tattikhana and #JubileeHills #tankefillingstations today. He reviewed #tankersupply operations, delivery timelines, and service quality in command areas, directing officials to ensure strict adherence to schedules with zero delays or negligence. Officials have been instructed to monitor operations in three shifts over the next week amid rising #summer #waterdemand. #Citizens are also urged to use #water judiciously and avoid wastage until the #monsoon arrives. #Hyderabad #WaterSupply @GHMCOnline
4
3
24
4,991
జలమండలిలో ఉద్యోగాలు అంటూ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం # ప్రస్తుతం జలమండలిలో ఎలాంటి ఉద్యోగ నియామకాలు లేవు # సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న సమాచారం పూర్తిగా అసత్యం # ఉద్యోగ నియామకాలు ఉంటే TGPSC ద్వారానే ప్రకటనలు విడుదల # ఫేక్ పోస్టర్లు, తప్పుడు ప్రకటనలను నమ్మవద్దు
4
4
12
3,542
HMWSSB retweeted
A commendable step by Hyderabad towards responsible and resilient urban development. 💧 Through #recharge, #reuse, and #conservation efforts, the city is setting an inspiring example in sustainable urban water management #RainwaterHarvesting #Catchtherain #JalSanchayJanBhagidari
4
18
18
2,241
సింగూర్ 1200 ఎంఎం గ్రావిటీ మెయిన్ లీకేజీ మరమ్మతులు పూర్తి # యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసిన జలమండలి అధికారులు # లైన్ ఛార్జింగ్ ప్రారంభం.. సాధారణ నీటి సరఫరా పునరుద్ధరణ చర్యలు కొనసాగింపు # రెండు షిఫ్ట్‌లలో పనిచేసిన ట్రాన్స్‌మిషన్, ఇంజినీరింగ్ సిబ్బంది
8
3
28
2,788
(తేది:12.05.2026)HMWS&SB పరిధిలోని సింగూరు పైప్‌లైన్‌కు లీకేజీ ఏర్పడటంతో ప‌లు ప్రాంతాల్లో నీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయాలు ఏర్ప‌డ‌తాయి. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి మరమ్మతుల పనులపై తాజాపరిస్థితి వివరాలను అడిగి తెలుసుకున్నారు.O&M,Transmission అధికారులు సమన్వయంతో పనులు చేపట్టాలన్నారు. (1/2)
7
1
16
3,092
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు: గండిపేట్, కొకాపేట్, నార్సింగి, మంచిరేవుల, పుప్పాలగూడ, ఖానాపూర్, మణికొండ, షేక్‌పేట్ రిజర్వాయర్ కమాండ్ పరిధిలోని కొన్ని ప్రాంతాలు.. బోజగుట్ట రిజర్వాయర్ కమాండ్ పరిధిలోని ప్రాంతాలలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
4
5
1,800
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు: గండిపేట్, కొకాపేట్, నార్సింగి, మణికొండ తదితర ప్రాంతాల్లో తాత్కాలికంగా తాగునీటి సరఫరా అంతరాయం ఏర్పడింది. మరమ్మత్తు పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయని, అవసరమైన చోట్ల ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తామని అధికారులు తెలిపారు. (2/2)
1
7
2,020
పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ================== హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు ప్రాజెక్టులో సింగాపూర్–ఖానాపూర్ వరకు ఉన్న 1200 ఎంఎం డయా గ్రావిటీ మెయిన్ పైప్‌లైన్‌కు లీకేజీ ఏర్పడింది. ఈ భారీ లీకేజీలను అరికట్టడానికి అత్యవసర మరమ్మత్తు పనులు చేపట్టారు.
7
2
15
3,353
జలమండలి ఎండీ అశోక్ రెడ్డి మరమ్మతుల పనులపై తాజా పరిస్థితి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు సమన్వయంతో పనులు చేపట్టాలన్నారు. సాధ్యమైనంత తొందరగా పనులు పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని ఎండీ అధికారులను ఆదేశించారు.
3
1,207
దీనికి కార‌ణంగా ప‌లు ప్రాంతాల్లో నీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయాలు ఏర్ప‌డ‌తాయి. ప్ర‌స్తుతం మ‌ర‌మ్మ‌త్తు పనులు జ‌రుగుతున్నాయి. ప‌నులు పూర్తి కాగానే నీటి స‌ర‌ఫ‌రా పున‌రుద్ధ‌ర‌ణ జ‌రుగుతుంది. కావున అంతరాయం ఏర్పడనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని కోరడమైనది.
1
964
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు: గండిపేట్, కొకాపేట్, నార్సింగి, మంచిరేవుల, పుప్పాలగూడ, ఖానాపూర్, మణికొండ, షేక్‌పేట్ రిజర్వాయర్ కమాండ్ పరిధిలోని కొన్ని ప్రాంతాలు.. బోజగుట్ట రిజర్వాయర్ కమాండ్ పరిధిలోని ప్రాంతాలలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
1,058