*గోదావరిఖనిలో గోపు ఐలయ్య యాదవ్ కుటుంబాన్ని పరామర్శించిన వ్యాల్ల హరీష్ రెడ్డి*
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్ ఇటీవల మృతిచెందిన నేపథ్యంలో, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డి గారు గోదావరిఖని గౌతమ్‌నగర్‌లోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గోపు ఐలయ్య యాదవ్ మరణం పార్టీకి, ప్రాంతానికి తీరని లోటని హరీష్ రెడ్డి పేర్కొన్నారు. గోపు ఐలయ్య యాదవ్ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన నాయకుడని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఐలయ్య యాదవ్ కుటుంబ సభ్యులను ఓదార్చిన హరీష్ రెడ్డి, పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని గోపు ఐలయ్య యాదవ్ సేవలను స్మరించుకున్నారు. రామగుండం నియోజకవర్గంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు నాయకులు పేర్కొన్నారు.