❇️ కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఫస్ట్ హాఫ్’ పూర్తిగా విఫలం
❇️ అన్ని రంగాల్లో రేవంత్ పాలనా వైఫల్యం
❇️ రైతుబంధును బలహీనపరిచి ‘రాహుల్ బంధు’
❇️ కరెంటు కోతలు, ఎరువుల తిప్పలు… పంట కొనుగోలు సంక్షేభాలతో ఆనాటి రోజులను కాంగ్రెస్ తెచ్చింది
❇️ మళ్లీ కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి అవసరం
❇️ ప్రజలు, కార్యకర్తలే బీఆర్ఎస్ బలం
❇️ వేములవాడ, సిరిసిల్లలో జరిగిన పార్టీ సమావేశాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 👇
✳️ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మరియు సిరిసిల్ల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విస్తృతంగా పర్యటించారు.
✳️ ఈ సందర్భంగా నిర్వహించిన డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో ఆయన పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
✳️ ఈ పర్యటనలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
✳️ ప్రస్తుతం ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఈ ప్రభుత్వం మొదటి అంకం (ఫస్ట్ హాఫ్) పూర్తిగా విఫలమైందని కేటీఆర్ విమర్శించారు.
✳️ సినిమా ఫస్ట్ హాఫ్ డిజాస్టర్ అయినప్పుడు సెకండ్ హాఫ్ పట్ల ఎలాంటి ఆశలు ఉండవో, ఈ ప్రభుత్వ పనితీరు కూడా అలాగే ఉందన్నారు.
✳️ అమ్మ విలువ, అన్నం విలువ అవి లేనప్పుడే తెలుస్తాయని, ఇప్పుడు ప్రజలు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
✳️ ప్రభుత్వం ‘తరుగు’ పేరుతో రైతులను నిలువునా మోసం చేస్తోందని, ఎరువుల దుకాణాల వద్ద రైతులు మళ్లీ పాత రోజుల మాదిరిగా క్యూల్లో నిలబడే దుస్థితి వచ్చిందని మండిపడ్డారు.
✳️ ధాన్యం కొనుగోలుకు సంచులు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే, రాహుల్ గాంధీకి మాత్రం సంచుల సంచులు డబ్బులు వెళ్తున్నాయని ఆరోపించారు.
✳️ రైతుబంధును బలహీనపరిచి ‘రాహుల్ బంధు’ మొదలుపెట్టారని, తెలంగాణ డబ్బును దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
✳️ రాష్ట్రాన్ని భారీ అప్పుల్లోకి నెట్టారని, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎన్నికల ముందు బాండ్ పేపర్ రాసిస్తానన్న హామీలను ఇప్పటికీ అమలు చేయలేదని, దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
✳️ రేవంత్ రెడ్డి రాజకీయ తీరుపై కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
✳️ హిట్లర్ తనకు స్ఫూర్తి అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి నుంచి ప్రజలు ఇంకేం ఆశించలేరని, ఆయనకు డైలాగులు ఎక్కువ-పని తక్కువ అని ఎద్దేవా చేశారు.
✳️ మీనాక్షి నటరాజన్‌కు అవమానం జరిగేలా వ్యవహరించిన వ్యక్తి రేవంత్ రెడ్డేనని ఆరోపించారు.
✳️ ప్రజలు పాలు ఇచ్చే బర్రెను వదిలి, తన్నే దున్నపోతును తెచ్చుకున్నట్లుగా కాంగ్రెస్‌ను ఎన్నుకున్నారని వ్యాఖ్యానించారు.
✳️ తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆరేనని, మళ్లీ కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి అవసరమని స్పష్టం చేశారు.
✳️ చీకట్లో చిరుదీపంలా కేసీఆర్ పార్టీని ప్రారంభించారని, ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో టీడీపీ, టీఆర్ఎస్ మాత్రమే నిలబడి గెలిచాయని కేటీఆర్ గుర్తుచేశారు.
✳️ కేసీఆర్ 15 లక్షల పెళ్లిళ్లు, మెడికల్ కాలేజీలు, గురుకులాలు, కాళేశ్వరం వంటి అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, రేవంత్ రెడ్డి తెలంగాణకు చేసిందేమిటో చెప్పాలని సవాల్ విసిరారు.
✳️ రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ ఉన్నప్పటికీ, ఇటీవల సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటిందని, అధికారం లేకపోయినా ప్రజల ఆదరణ బీఆర్ఎస్‌పై ఏమాత్రం తగ్గలేదని పేర్కొన్నారు
✳️ "నాకు జన్మనిచ్చింది శోభమ్మ అయితే, రాజకీయంగా పునర్జన్మనిచ్చింది సిరిసిల్ల ప్రజలే" అని కేటీఆర్ భావోద్వేగంతో చెప్పారు.
✳️ ఒక్క రూపాయి పంచకుండా, ఒక్క చుక్క మద్యం పంచకుండా ప్రజల ఆశీర్వాదంతో గెలిచినందుకు సిరిసిల్ల ఎమ్మెల్యేగా గర్వపడుతున్నానని తెలిపారు.
✳️ తన శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు సిరిసిల్ల అభివృద్ధే తన లక్ష్యమని, కార్మిక, ధార్మిక క్షేత్రమైన సిరిసిల్లను కేసీఆర్ నాయకత్వంలో జిల్లాగా మార్చి రూపురేఖలు మార్చామని చెప్పారు.
✳️ బతుకమ్మ చీరల పథకం వెనుక ఉన్న సామాజిక, ఆర్థిక కోణాన్ని రేవంత్ రెడ్డి అర్థం చేసుకోలేదని, తంగళ్లపల్లికి సముద్రం లాంటి సాగునీరు తెచ్చింది కేసీఆర్ అని గుర్తుచేశారు.
✳️ తిరిగే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కార్యకర్తకి అన్ని రకాలుగా అండగా ఉండి వారి జీవితంలో మరిన్ని సానుకూలమైన మార్పులు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. అధికారం పోయిన తర్వాత కూడా లక్షల మంది పార్టీ కార్యకర్తలు పార్టీ వెంట నిలబడ్డారని.. కార్యకర్తలే పార్టీకి అసలైన బలం అన్నారు.
✳️ "మన బలం – మన బలగం" కార్యక్రమంలో పాల్గొన్నారు. డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.