Joined December 2016
2,786 Photos and videos
ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలకు శుభవార్త... ఎన్నో ఏళ్లుగా బుడగట్లపాలెం ప్రాంత మత్స్యకారుల కలగా ఉన్న ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.444 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్టు ఆమోదం కోసం నేను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తూ ప్రత్యేక చొరవ చూపడం జరిగింది. ఈరోజు ఈ చారిత్రాత్మక నిర్ణయం వెలువడింది. బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తయిన తర్వాత వేలాది మంది మత్స్యకారులకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. సముద్ర ఆధారిత ఆర్థిక కార్యకలాపాలు మరింత విస్తరించి, ఎచ్చెర్ల నియోజకవర్గ అభివృద్ధికి కొత్త దిశను చూపనున్నాయి. మత్స్యకార కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు యువతకు కూడా ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. మత్స్యకారుల సంక్షేమం, వారి ఆర్థికాభివృద్ధి కోసం నేను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాను. ఎచ్చెర్ల అభివృద్ధే నా లక్ష్యం... ప్రజల ఆకాంక్షల సాధనే నా బాధ్యత. ఈ మహత్తర నిర్ణయానికి సహకరించి, బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్‌కు పరిపాలన అనుమతులు మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. #NER #NadukuditiEswararao #Etcherla #BudagatlapalemFishingHarbour #FishermenWelfare #AndhraPradesh
1
1
35
రణస్థలం మండలం ఉపాధి వేతనాల చెల్లింపులో రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించడం ఎంతో గర్వకారణం. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే నెలల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) ద్వారా రణస్థలం మండలంలో 5,65,564 పని దినాలు కల్పించి, కార్మికులకు రూ.13.15 కోట్ల ఉపాధి వేతనాలు సకాలంలో చెల్లించడం ద్వారా రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవడం అభినందనీయమైన విషయం. ఈ విజయానికి కృషి చేసిన ఉపాధి హామీ పథకం సిబ్బంది, క్షేత్ర సహాయకులు, టెక్నికల్ అసిస్టెంట్లు, సంబంధిత అధికారులు, అలాగే కష్టపడి పనిచేసిన కార్మికులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా పారదర్శకతతో పథకాన్ని అమలు చేస్తూ, కార్మికులకు సకాలంలో వేతనాలు అందించడం, మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించడం వంటి అంశాల్లో రణస్థలం మండలం ఆదర్శంగా నిలవడం సంతోషకరం. ఇదే స్ఫూర్తితో మరింత సమర్థవంతంగా పనిచేస్తూ గ్రామీణాభివృద్ధికి, పేద ప్రజల సంక్షేమానికి తోడ్పడాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రజల జీవనోపాధి మెరుగుదలే మన ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఆ దిశగా ప్రతి ఒక్కరి సహకారంతో మరిన్ని విజయాలు సాధిద్దాం. రణస్థలం సాధించిన ఈ ఘనత ఎచ్చెర్ల నియోజకవర్గానికే గర్వకారణం. #MGNREGS #Ranasthalam #Etcherla #MLANER #RuralDevelopment #EmploymentGuarantee #TeamWork
1
1
27
Within 1,581 days of taking office, PM Modi launched Ayushman Bharat, the world’s largest government-funded health assurance programme. Within 1,930 days, the initial target of 8 crore LPG connections under Ujjwala Yojana was achieved, improving the lives of millions of women. #12YearsOfSeva
20
PM Modi combined structural reforms with grassroots delivery. Within 1,132 days, GST replaced a complex tax regime with a unified system, while within 1,433 days, the Saubhagya Scheme ensured 100% village electrification. #12YearsOfSeva
14
PM Modi delivered on two long-standing national aspirations. After 1,897 days, Article 370 was abrogated, fully integrating J&K and Ladakh. After 2,081 days of determined effort, the foundation stone for the grand Ram Mandir was laid on 5 February 2020... #12YearsOfSeva
13
Within 856 days of PM Modi taking office, India reshaped its national security doctrine through the 2016 Surgical Strikes, signalling a decisive shift in the country’s response to cross-border terrorism... #12YearsOfSeva
11
PM Modi’s focus on last-mile healthcare delivery has helped transform public health outcomes. Universal Immunisation Coverage rising from 62% to 98.4% is not just a government achievement, but a national accomplishment... #12YearsOfSeva
5
Just 100 days after assuming office, PM Modi launched a financial inclusion revolution. Jan Dhan Yojana opened a record 1.8 crore bank accounts in a single week, earning a Guinness World Record and bringing millions into the formal banking system... #12YearsOfSeva
1
2
69
1.Under PM Modi’s leadership, development has been guided by the principle of saturation and inclusion. The Tribal Welfare Budget rising from ₹24,598 crore to ₹1.39 lakh crore reflects a commitment to ensuring that progress reaches every section of society. #12YearsOfSeva
63
2014 మే 26న భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ నరేంద్ర మోదీ గారు, దేశ సేవలో విజయవంతంగా నేటితో 4,399 రోజులు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నాయకత్వం మరింత వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ, లావేరు మండల కేంద్రంలోని శ్రీ చంద్రశేఖరస్వామి వారి దేవస్థానంలో కూటమి నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించాను. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, గత 12 ఏళ్ల నిరంతరాయ పాలన దేశంలో సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపిందని పేర్కొన్నాను. ఆర్థిక సంస్కరణలు, డిజిటల్ విప్లవం, మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా భారతదేశాన్ని ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడంలో ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వం కీలక పాత్ర పోషించిందని వివరించాను. ప్రత్యేకంగా యూపీఐ (UPI) వంటి డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపిందని, మౌలిక వసతుల అభివృద్ధిని ప్రభుత్వం ప్రధాన ఆర్థిక వ్యూహంగా మలిచిందని తెలియజేశాను. అలాగే, ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నాను. తదుపరి సుబద్రాపురం జంక్షన్‌లో నిర్వహించిన "స్వచ్ఛ పథం" కార్యక్రమంలో పాల్గొని పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించాను. ఈ కార్యక్రమాల్లో నాలుగు మండలాల కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. #NarendraModi #PMModi #4399DaysOfModi #12YearsOfModiGovernment
1
14
లావేరు మండలం అదపాక కూడలి నుంచి గుర్రాలపాలెం–పొందూరు దారిలో మడ్డువలస కాలువపై నిర్మించిన కల్వర్టు సుమారు 30 అడుగుల మేర కోతకు గురై ఒకవైపంతా కూలిపోయిన విషయం నా దృష్టికి స్థానిక ప్రజాప్రతినిధులు తీసుకువచ్చారు. దీనిపై నేడు నేను స్వయంగా సంఘటన స్థలాన్ని సందర్శించి, మండల కూటమి నాయకులు, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు మరియు మండల అధికారులతో కలిసి పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించాను. అనంతరం జిల్లా కలెక్టర్ గారితో, ఇరిగేషన్ ఎస్.ఈ గారితో మాట్లాడి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అత్యవసర చర్యలు చేపట్టి, మరమ్మతు పనులు త్వరితగతిన ప్రారంభించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరాను. ఈ సందర్భంగా మార్గమధ్యంలో నిర్మాణంలో ఉన్న అదపాక కల్వర్టును కూడా పరిశీలించాను. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ, తక్షణమే మరమ్మతు పనులు చేపట్టాలని మడ్డువలస ప్రాజెక్టు, పంచాయతీరాజ్ మరియు ఆర్ అండ్ బీ శాఖ అధికారులను ఆదేశించాను. ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు కొనసాగిస్తాం. ప్రజల భద్రత విషయంలో రాజీ ఉండదు. #MLANER #NadukuditiEswararao #Etcherla #Laveru #Adapaka #Gurralapalem #Madduvalasa
1
1
29
ఆబోతులపేట గ్రామ పర్యటన సందర్భంగా గ్రామస్తులు ఏళ్లుగా ఎదుర్కొంటున్న పారిశుధ్య సమస్యలు, తాగునీటి ఇబ్బందులను నా దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించి సంబంధిత అధికారులను ప్రశ్నించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించాను. ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యం సహించేది లేదు. నా ఆదేశాల మేరకు అధికారులు స్పందించి కాలువల శుభ్రత పనులు, పారిశుధ్య నిర్వహణ చర్యలు మరియు మంచి నీటి సరఫరా మెరుగుదల కోసం పనులను ప్రారంభించడం జరిగింది. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందించడం మనందరి బాధ్యత. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కారం, పరిశుభ్రమైన వాతావరణం, మెరుగైన తాగునీటి సౌకర్యాల కోసం నిరంతరం కృషి చేస్తాను. ప్రజల సమస్యలపై స్పందించడం కాదు... వాటికి శాశ్వత పరిష్కారం చూపించడమే నా లక్ష్యం. #NER #Etcherla #Abothulapeta #GramaAbhivruddhi #PublicService
1
1
43
రాజ్యసభకు జనసేన పార్టీ అభ్యర్థిగా శ్రీ లింగమనేని రమేష్ గారు నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా, ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ నామినేషన్ పత్రాలపై సంతకం చేయడం జరిగింది. సమాజ సేవ, పారిశ్రామిక రంగంలో విశేష అనుభవం కలిగిన లింగమనేని రమేష్ గారు రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను సమర్థవంతంగా వినిపిస్తారనే నమ్మకం ఉంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర గారు, ఎమ్మెల్సీ శ్రీ నాగబాబు గారు, శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, ఎమ్మెల్యేలు శ్రీ నక్కా ఆనందబాబు గారు, శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు, శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, శ్రీ బొమ్మిడి నాయకర్ గారు, శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, దేవ వరప్రసాద్ గారు, శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు ప్రతిపాదించారు. #JanaSena #RajyaSabha #LingamaneniRamesh #NER #Etcherla
1
3
79
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 12 సంవత్సరాల సుపరిపాలనలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, చిట్టినగర్ మండలంలో నిర్వహించిన “అమ్మ పేరుతో ఒక మొక్క” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాము. భావితరాలకు స్వచ్ఛమైన, హరితమయమైన భారతదేశాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించి పాల్గొనే అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN మాధవ్ గారికి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ Y. సుజనా చౌదరి గారికి, NTR జిల్లా అధ్యక్షులు శ్రీ అడ్డూరి శ్రీరామ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. "ఒక మొక్క నాటుదాం... ప్రకృతిని కాపాడుదాం" "హరితాంధ్ర – స్వచ్ఛాంధ్ర నిర్మాణానికి ప్రతి ఒక్కరం భాగస్వాములం కావాలి." 🇮🇳 #WorldEnvironmentDay #EkPedMaaKeNaam #PlantATree #GreenIndia #BJP #NER #Etcherla #HarithaAndhra 🌱🇮🇳
1
2
31
ప్రజలతో కలిసి స్వచ్ఛతకు శ్రీకారం చుట్టాం.. 🧹 ఈరోజు రణస్థలం మండలంలోని కమ్మ సిగడాం జంక్షన్‌లో నిర్వహించిన 'స్వచ్ఛ పథం' బృహత్తర పారిశుద్ధ్య కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలతో కలిసి పాల్గొని రహదారుల పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించాను. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకత్వంలో "స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర" లక్ష్యంతో పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం గ్రామాలను పరిశుభ్రంగా, ప్రజలను ఆరోగ్యవంతంగా ఉంచేందుకు దోహదపడుతుంది. పరిశుభ్రమైన పరిసరాలు ప్రతి ఒక్కరి బాధ్యత. మన ఇల్లు, మన వీధి, మన గ్రామం శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణం సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరూ స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇస్తూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. స్వచ్ఛతే సేవ... స్వచ్ఛాంధ్రే లక్ష్యం🇮🇳 #SwachhaPatham #SwarnaAndhraSwachhaAndhra #NER #Etcherla #Ranasthalam #CleanAndhra #PublicService #TeamNER
1
2
34
🏏 ఎమ్మెల్యే NER గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఎలైట్ కప్ టోర్నమెంట్ 🏏 ఎచ్చెర్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాల కూటమి నాయకులు, కార్యకర్తల కోసం ఈ రోజు (02-06-2026) ప్రత్యేక క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించబడనున్నాయి. 📍 స్థలం: NER School of Excellence Ground 🎥 లైవ్ వీక్షించడానికి క్రింది లింక్‌పై క్లిక్ చేయండి. youtube.com/live/DqexxFF4TMo… ఆటలో ఉత్సాహం... నాయకుల్లో ఐక్యత... క్రీడాస్ఫూర్తికి మరో వేదిక✨
1
50
ఈరోజు జి.సిగడం మండలం ఆనందపురం పంచాయతీ పరిధిలోని ఆబోతులపేట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలను నా దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణం సక్రమంగా లేకపోవడంతో చిన్నపాటి వర్షాలకే నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని వివరించారు. ప్రజల సమస్యలను విన్న వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిస్థితిని పరిశీలించి అవసరమైన చర్యలు తక్షణమే చేపట్టాలని ఆదేశించాను. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజాప్రతినిధిగా నా మొదటి బాధ్యత. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి, ప్రజల అవసరాల తీర్చడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటాను. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి, సంక్షేమం అనే రెండు చక్రాలతో ముందుకు సాగుదాం. #Etcherla #NER #NadukuditiEswararao #PublicService #Development #Anandapuram #Abothulapeta #PrajaSeva
1
26