ఖమ్మం నగరంలో 12 సంవత్సరాల బాలికపై జరిగిన అమానుష ఘటనపై జనసేన పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలికను, ఆమె తల్లిదండ్రులను జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్, శనివారం పరామర్శించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
RK సాగర్ గారు మీడియాతో మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని మెరుగైన ఉచిత వైద్యం అందించాలని, బాధితురాలి కుటుంబానికి ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలవాలని డిమాండ్ చేశారు. నిందితుడికి కఠిన శిక్ష విధించడమే ఆ కుటుంబానికి నిజమైన న్యాయం అని పేర్కొన్నారు.
బాధిత కుటుంబానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా నేతలు హామీ ఇచ్చారు. ఈ మీడియా సమావేశంలో శేరిలింగంపల్లి ఇంచార్జి మాధవరెడ్డి, జనసేన నాయకులు మాధవరావు, కొల్లా శంకర్, మహేష్, పుష్ప, ప్రవీణ్, అనుపమ తదితరులు పాల్గొన్నారు.
#JusticeForKhammamGirl #JanaSenaTelangana