శ్రీ రమణ గోగులకు జన్మదిన శుభాకాంక్షలు
సంగీత దర్శకుడు, మిత్రుడు శ్రీ
@RamanaGogula కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నేను నటించిన ‘తమ్ముడు’, ‘బద్రి’ సినిమాలకు శ్రీ రమణ అందించిన బాణీలు ప్రేక్షకులను మెప్పించాయి. ఆ బాణీలలోని కొత్తదనం యువతను ఆకట్టుకొంది. గానంలోని విభిన్న శైలి ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. ఐ.ఐ.టి. ఖరగ్ పూర్ లో ఎం.టెక్ చదివి, అమెరికాలో ఎమ్మెస్ చేసిన విద్యావంతుడు శ్రీ రమణ గోగుల. ఓ వైపు సినీ రంగంలో తన సృజనాత్మకతను చాటుతూనే వెంచర్ క్యాపటలిస్టుగా, టెక్నాలజీ సంస్థల నిర్వాహకుడిగా రాణిస్తున్న శ్రీ రమణ గోగులకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సంతోషాలు అందించాలని భగవంతుణ్ణి కోరుకొంటున్నాను.
-
@PawanKalyan