నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటిన తెలంగాణ రచయిత దాశరధి కృష్ణమాచార్యులు గారు జనసేనకు స్ఫూర్తి. ఆయన వేదాలు చదివారు, విప్లవ స్ఫూర్తిని రేకెత్తించే రచనలు రచించారు. ఆయన భక్తిని, సనాతన ధర్మాన్ని అర్థం చేసుకున్నారు. సామాజిక సమస్యలపై పోరాడారు. విప్లవం, సనాతనం రెండింటిని తనలో నింపుకున్నారు. అదే స్ఫూర్తితో జనసేన పార్టీ సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేస్తుంది, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ విప్లవస్ఫూర్తిని నింపుకొని రాజకీయ ప్రస్థానం సాగిస్తుంది.
విప్లవం, సనాతనం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. ఇదే జనసేన విధానం