Official Twitter handle of The Collector & District Magistrate of Bapatla District, Andhra Pradesh

Joined January 2024
591 Photos and videos
* *Repairs Completed on Machavaram–Alluru Road* * *Improved Transportation Facilities for Local Residents* *Bapatla:* * Repair works on the *Machavaram–Alluru Road in Pittalavanipalem (M)* have been completed. The Roads & Buildings Department restored the damaged road, which had developed several potholes, making travel more comfortable for motorists. * As part of the *Mission Pothole (Mission Pot Hole Free Road)* programme, officials carried out repair works on the damaged stretches. Potholes were filled, & the road was restored to a motorable condition. * The road is extensively used by residents, farmers, students & commuters from Machavaram, Alluru & nearby villages. Following the completion of repairs, transportation has become safer & smoother. The movement of agricultural produce has also become easier. * The improved road is expected to facilitate safer travel & provide better transportation facilities to the public, benefiting residents of the surrounding rural areas. #TwoyearsofgovernanceinAP #2YrsOfTrustDevelopmentWelfare #Bapatla #MissionPotHoleFreeRoad #RoadDevelopment #RoadSafety
1
4
బాపట్ల, తేది: 13-06-2026: - గ్రామీణ ప్రజలకు నాణ్యమైన ఆయుష్ వైద్య సేవలను విస్తృతంగా అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి., ఐ.ఏ.ఎస్. గారు తెలిపారు. పర్చూరు మండలం ఉప్పుటూరు గ్రామంలోని ఆయుష్ ప్రాథమిక వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, ప్రస్తుతం చిన్న గదిలో నడుస్తున్న వైద్యశాలకు తగిన భవనం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని సూచిస్తూ, ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా వైద్య సేవలు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. #AYUSH #Bapatla #Healthcare #RuralHealth #AndhraPradesh
2
బాపట్ల, తేది: 13-06-2026: - ప్రజలు మానసిక ఒత్తిడిని అధిగమించి ఆరోగ్యవంతమైన జీవనం గడపాలంటే యోగా ఉత్తమ మార్గమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి., ఐ.ఏ.ఎస్. గారు తెలిపారు. పర్చూరు మండలం అద్దంకి నాంచారమ్మ దేవస్థానం ఆవరణలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని యోగాసనాలు చేసి ప్రజలకు స్ఫూర్తినిచ్చారు. యోగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఏకాగ్రత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. #YogaAndhra2026 #YogaForHealth #Bapatla #HealthyLifestyle #AndhraPradesh
* *Jaladhara–Jalaharathi Brings Life Back to Fallow Lands* * *Canal Restoration Creates New Hope for Farmers* * *Village: Vemuru | Mandal: Vemuru | District: Bapatla* *Bapatla:* * The *Jaladhara–Jalaharathi* programme, launched by the Govt. to restore vital water resources that support rural agriculture, is yielding positive results in *Vemuru (V) of Bapatla district* . An irrigation canal that had remained silted up and unusable for several years is being revived, helping conserve rainwater and improve water availability for agriculture. * Under the *Jaladhara–Jalaharathi* initiative, restoration works are being carried out on the canal with a length of about *1,570 metres, a width of 4.5 metres & a depth of 1.5 metres.* The works include desilting, removal of weeds, clearing of waste materials & restoration of clogged sluices. Villagers, under the guidance of Water Users Associations, are actively participating in the programme. Convergence with the *VB-G RAMG* scheme has further strengthened community involvement. * Once completed, the restored canal will enable smooth flow of rainwater and enhance groundwater recharge. This is expected to benefit nearby wells and agricultural lands. The project is likely to bring about *42 acres* of land under cultivation and provide direct benefits to *25 farmers.* Farmers who have long struggled with water scarcity are now looking forward to improved irrigation facilities and better agricultural prospects. #TwoyearsofgovernanceinAP #2YrsOfTrustDevelopmentWelfare #JaladharaJalaharathi #WaterConservation #Bapatla #FarmerWelfare #SustainableAgriculture
1
* *Repairs Completed on Machavaram–Alluru Road* * *Improved Transportation Facilities for Local Residents* *Bapatla:* * Repair works on the *Machavaram–Alluru Road in Pittalavanipalem (M)* have been completed. The Roads & Buildings Department restored the damaged road, which had developed several potholes, making travel more comfortable for motorists. * As part of the *Mission Pothole (Mission Pot Hole Free Road)* programme, officials carried out repair works on the damaged stretches. Potholes were filled, & the road was restored to a motorable condition. * The road is extensively used by residents, farmers, students & commuters from Machavaram, Alluru & nearby villages. Following the completion of repairs, transportation has become safer & smoother. The movement of agricultural produce has also become easier. * The improved road is expected to facilitate safer travel & provide better transportation facilities to the public, benefiting residents of the surrounding rural areas. #TwoyearsofgovernanceinAP #2YrsOfTrustDevelopmentWelfare #Bapatla #MissionPotHoleFreeRoad #RoadDevelopment #RoadSafety
1
* *జలధార–జలహారతితో బీడు భూములకు జీవం* * *పంట కాల్వ పునరుద్ధరణతో రైతుల్లో కొత్త ఆశలు* * *గ్రామం: వేమూరు | మండలం: వేమూరు | జిల్లా: బాపట్ల* *బాపట్ల:* * గ్రామీణ వ్యవసాయానికి ప్రాణాధారమైన నీటి వనరులను పునరుద్ధరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన *జలధార–జలహారతి* కార్యక్రమం బాపట్ల జిల్లా వేమూరులో సత్ఫలితాలను అందిస్తోంది. ఎన్నో ఏళ్లుగా పూడిపోయి నిరుపయోగంగా మారిన పంట కాల్వకు పునర్జీవం కల్పిస్తూ వర్షపు నీటి సంరక్షణకు చర్యలు చేపట్టింది. * *జలధార–జలహారతి* కింద సుమారు 1,570 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల వెడల్పు, 1.5 మీటర్ల లోతుతో పంట కాల్వ పునరుద్ధరణ పనులు చేపట్టారు. కాల్వలో పేరుకుపోయిన పూడిక తొలగింపు, పిచ్చిమొక్కల నిర్మూలన, చెత్తాచెదారం శుభ్రపరిచే పనులు , పూడిపోయిన తూముల పునరుద్ధరణను గ్రామస్తులు నీటి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టారు. ఉపాధి హామీ పథకం (*VB-G RAMG*) అనుసంధానంతో ప్రజల భాగస్వామ్యం మరింత పెరిగింది. * ఈ పనులు పూర్తయితే వర్షపు నీరు సాఫీగా ప్రవహించి భూగర్భ జలాల పెరుగుదలకు దోహదపడనుంది. ఫలితంగా సమీప ప్రాంతాల్లోని బావులు, వ్యవసాయ భూములకు ప్రయోజనం చేకూరనుంది. ఈ కాల్వ పునరుద్ధరణతో సుమారు 42 ఎకరాల భూమి సాగులోకి రానుండగా, 25 మంది రైతులకు ప్రత్యక్ష లబ్ధి కలగనుంది. సాగునీటి కొరతతో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు ఈ కార్యక్రమం కొత్త ఆశలను నింపుతోంది. * #TwoyearsofgovernanceinAP #2YrsOfTrustDevelopmentWelfare #JaladharaJalaharathi #WaterConservation #Bapatla #FarmerWelfare #SustainableAgriculture
2
* *మాచవరం–అల్లూరు రోడ్డుకు మరమ్మతులు పూర్తి* * *ప్రజలకు మెరుగైన రాకపోకల సౌకర్యం* *బాపట్ల:* * పిట్టలవానిపాలెం మండలంలోని *మాచవరం–అల్లూరు* రహదారిపై మరమ్మతు పనులు పూర్తయ్యాయి. గుంతలతో దెబ్బతిన్న ఈ రహదారిని రోడ్లు & భవనాల శాఖ పునరుద్ధరించింది. దీంతో వాహనదారులకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారింది. * రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ పోత్ హోల్ *(Mission Pot Hole Free Road)* కార్యక్రమంలో భాగంగా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దెబ్బతిన్న ప్రాంతాల్లో గుంతలను పూడ్చి రహదారిని ప్రయాణానికి అనుకూలంగా తీర్చిదిద్దారు. * మాచవరం, అల్లూరు & పరిసర గ్రామాల ప్రజలు, రైతులు, విద్యార్థులు ఈ రహదారిని అధికంగా వినియోగిస్తుంటారు. మరమ్మతుల అనంతరం రవాణా మరింత సురక్షితంగా, సాఫీగా సాగుతోంది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కూడా సులభతరమైంది. మరమ్మతుల అనంతరం ఈ రహదారిపై ప్రయాణం మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మారి ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. #TwoyearsofgovernanceinAP #2YrsOfTrustDevelopmentWelfare #Bapatla #MissionPotHoleFreeRoad #RoadDevelopment #RoadSafety #BetterConnectivity
1
బాపట్ల, తేది: 13-06-2026: - గ్రామీణ ప్రజలకు నాణ్యమైన ఆయుష్ వైద్య సేవలను విస్తృతంగా అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి., ఐ.ఏ.ఎస్. గారు తెలిపారు. పర్చూరు మండలం ఉప్పుటూరు గ్రామంలోని ఆయుష్ ప్రాథమిక వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, ప్రస్తుతం చిన్న గదిలో నడుస్తున్న వైద్యశాలకు తగిన భవనం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని సూచిస్తూ, ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా వైద్య సేవలు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. #AYUSH #Bapatla #Healthcare #RuralHealth #AndhraPradesh
1
బాపట్ల, తేది: 13-06-2026: - ప్రజలు మానసిక ఒత్తిడిని అధిగమించి ఆరోగ్యవంతమైన జీవనం గడపాలంటే యోగా ఉత్తమ మార్గమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి., ఐ.ఏ.ఎస్. గారు తెలిపారు. పర్చూరు మండలం అద్దంకి నాంచారమ్మ దేవస్థానం ఆవరణలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని యోగాసనాలు చేసి ప్రజలకు స్ఫూర్తినిచ్చారు. యోగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఏకాగ్రత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. #YogaAndhra2026 #YogaForHealth #Bapatla #HealthyLifestyle #AndhraPradesh
* *Jaladhara–Jalaharathi Revives Irrigation Canal in Mutthayapalem* * *Irrigation Support for 100 Acres & Direct Benefit to 80 Farmers* * *Village : Mutthayapalem | Mandal: Bapatla | District : Bapatla* *Bapatla:* * With a vision to conserve water resources for future generations, the State Govt. is implementing the *Jaladhara–Jalaharathi* programme across rural areas. As part of this initiative, restoration works of an irrigation canal have been taken up in *Mutthayapalem (V) of Bapatla (M)*. The programme aims to conserve every drop of rainwater, improve groundwater recharge, revive neglected water channels & bring fallow lands back under cultivation. * The local community has actively joined hands in the restoration effort. Villagers, farmers & workers are carrying out desilting, removal of weeds & clearance of obstructions along the canal. The restoration covers a canal stretch of about *10,000 metres in length & 4 metres in width* . Under VB-G RAMG, 45 men & women are participating in the works, earning wages while contributing to water conservation. Scientific measures are being adopted to ensure smooth flow of rainwater & enhanced groundwater recharge. * Once completed, the restored canal is expected to provide irrigation water to nearly *100 acres* of ayacut land, directly benefiting *80 farmers.* The project will also help improve groundwater levels in surrounding areas & ensure water reaches even the tail-end fields. Farmers have expressed happiness that lands which remained uncultivated due to lack of water can now be brought under cultivation. The *Jaladhara–Jalaharathi* programme is emerging as a successful example of partnership between the Govt. & local communities in conserving water resources & strengthening agriculture. #JaladharaJalaharathi #WaterConservation #Bapatla #FarmerWelfare #GroundwaterRecharge
2
* *కూచిపూడి–ముల్పూరు రోడ్డుకు మరమ్మతులు పూర్తి* * *గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రాకపోకలు* *బాపట్ల:* * అమర్తలూరు మండలంలోని *కూచిపూడి–ముల్పూరు* రహదారిపై మరమ్మతు పనులు పూర్తయ్యాయి. గుంతలతో దెబ్బతిన్న ఈ రహదారిని రోడ్లు & భవనాల శాఖ పునరుద్ధరించింది. దీంతో వాహనదారులకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారింది. * రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన *మిషన్ పోత్ హోల్ (Mission Pot Hole Free Road)* కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ *డాక్టర్ వినోద్ కుమార్ వి., ఐ.ఏ.ఎస్.* గారి పర్యవేక్షణలో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దెబ్బతిన్న ప్రాంతాల్లో గుంతలను పూడ్చి రహదారిని ప్రయాణానికి అనుకూలంగా తీర్చిదిద్దారు. * కూచిపూడి, ముల్పూరు , పరిసర గ్రామాల ప్రజలు, రైతులు, విద్యార్థులు ఈ రహదారిని అధికంగా వినియోగిస్తుంటారు. మరమ్మతుల అనంతరం రవాణా మరింత సురక్షితంగా, సాఫీగా సాగుతోంది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కూడా సులభతరమైంది. * మరమ్మతుల అనంతరం ఈ రహదారిపై ప్రయాణం మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మారి ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. #KuchipudiMulpuruRoad #MissionPotHole #RoadDevelopment #BapatlaDistrict #BetterConnectivity
24
* *గోరంట్లవారిపాలెంకు మెరుగైన తాగునీటి సౌకర్యం* * *ఎంపీ ల్యాడ్స్ రూ.9 లక్షలతో పంపింగ్ మెయిన్ ఏర్పాటు పూర్తి* బాపట్ల: * పర్చూరు మండలం గర్నేపూడి గ్రామపంచాయతీ పరిధిలోని గోరంట్లవారిపాలెంకు ఎంపీ ల్యాడ్స్ నిధులతో *రూ.9 లక్షల* వ్యయంతో పంపింగ్ మెయిన్ ఏర్పాటు పని పూర్తయింది. దీంతో గ్రామ ప్రజలకు తాగునీటి సరఫరా మరింత మెరుగుపడనుంది. * గ్రామంలో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పనిని చేపట్టారు. పంపింగ్ మెయిన్ ఏర్పాటు పూర్తికావడంతో నీటి సరఫరా వ్యవస్థ బలోపేతమై, ప్రజలకు సకాలంలో తాగునీరు అందించే అవకాశం ఏర్పడింది. * గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం ఎంపీ ల్యాడ్స్ నిధులను సమర్థవంతంగా వినియోగిస్తోంది. గోరంట్లవారిపాలెంలో పూర్తయిన ఈ ప్రాజెక్టు గ్రామ ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించడంతో పాటు జీవన ప్రమాణాల మెరుగుదలకు దోహదపడనుంది. #MPLADS #DrinkingWater #RuralDevelopment #BapatlaDistrict #Parchur
19
* *జలధార–జలహారతితో పర్చూరు ఫీడర్ కాల్వకు పునర్జీవం* * *78 ఎకరాలకు సాగునీరు.. 56 మంది రైతులకు ప్రత్యక్ష లబ్ధి* * *గ్రామం: పర్చూరు | మండలం: పర్చూరు | జిల్లా: బాపట్ల* *బాపట్ల:* * రైతాంగ సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన *జలధార–జలహారతి* కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి వనరులకు కొత్త ఊపిరి పోస్తోంది. బాపట్ల జిల్లా పర్చూరు మండలంలోని *పర్చూరు సామాజిక ఫీడర్ కాల్వ* పునరుద్ధరణ పనులు ఈ కార్యక్రమానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా పూడికతో మూసుకుపోయిన కాల్వ మళ్లీ వినియోగంలోకి వస్తుండటంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. * ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గ్రామస్తులు, రైతులు కలిసి శ్రమదానం ప్రారంభించారు. సాగు నీటి సంఘాల సమన్వయంతో కాల్వ మరమ్మతులు, పూడికతీత పనులు వేగంగా కొనసాగుతున్నాయి. *సుమారు 1.5 కిలోమీటర్ల మేర* చేపడుతున్న పనుల్లో కాల్వను *2 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల లోతుతో* శాస్త్రీయ పద్ధతిలో అభివృద్ధి చేస్తున్నారు. ఈ పనుల్లో గ్రామానికి చెందిన *89 మంది* ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. * *జలధార–జలహారతి కార్యక్రమం* ద్వారా పునరుద్ధరించబడుతున్న ఈ ఫీడర్ కాల్వకు *1,024 క్యూబిక్ మీటర్ల అదనపు నిల్వ సామర్థ్యం* ఏర్పడనుంది. వర్షాకాలంలో నీరు నిల్వ కావడంతో కాల్వ కింద ఉన్న *8 చెరువులు పునర్జీవం పొందనున్నాయి*. దీని ద్వారా *78 ఎకరాల భూమి సాగులోకి రానుండగా, 56 మంది రైతులకు ప్రత్యక్షంగా ప్రయోజనం కలగనుంది*. సమీప ప్రాంతాల్లోని బోర్లు రీఛార్జ్ కావడంతో భూగర్భ జలాల స్థాయి కూడా మెరుగుపడే అవకాశం ఉంది. * వర్షపు నీటిని వృథా కాకుండా నిల్వ చేసుకోవాలనే లక్ష్యంతో గ్రామస్తులు చేపడుతున్న ఈ పనులు పూర్తయిన తర్వాత దిగువ ప్రాంత భూములకు కూడా సమృద్ధిగా సాగునీరు అందనుంది. ఎండిన భూములు తిరిగి సాగులోకి రావడంతో పాటు రైతుల వ్యవసాయ వ్యయాలు తగ్గి, దిగుబడులు పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. జల సంరక్షణతో పాటు వ్యవసాయాభివృద్ధికి ఈ కార్యక్రమం దోహదపడుతోంది. #JaladharaJalaharathi #ParchurFeederCanal #WaterConservation #FarmerWelfare #BapatlaDistrict
15
బాపట్ల, తేది: 10-06-2026 - ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా తయారీని అత్యంత ప్రాధాన్యతగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి., ఐ.ఏ.ఎస్. గారు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీక్షణ సమావేశంలో కలెక్టర్ గారు మాట్లాడుతూ 2002 ఓటర్ల జాబితాను 2019 జాబితాతో సరిపోల్చి క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. - బీఎల్ఓలు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా వేగంగా ధృవీకరణ పూర్తి చేయాలని హెచ్చరించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ప్రతి ఫిర్యాదును సకాలంలో పరిష్కరించి, ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే జనగణన నమోదులో సవరణలను ఈ నెల 15లోపు పూర్తి చేసి ఖచ్చితమైన వివరాలు నమోదు చేయాలని సూచించారు. #VoterListRevision #ElectoralRoll #ElectionAwareness #DemocracyMatters #BapatlaDistrict
31
- పరిశుభ్రమైన బీచ్‌లు పర్యావరణానికి, పర్యాటకానికి అమూల్యమైన సంపద. ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించి, చెత్తను నిర్దేశిత ప్రదేశాల్లో వేయడం, సముద్ర జీవాలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత. మన చిన్న ప్రయత్నమే భావితరాలకు స్వచ్ఛమైన తీరాలను అందిస్తుంది. “తీరాలను కాపాడుదాం… బీచ్‌లను రక్షిద్దాం” అనే సంకల్పంతో అందరం ముందుకు సాగుదాం.. #SaveOurShores #CleanBeach #ProtectOurOceans #GoGreen #BeachCleanup
7
బాపట్ల, తేది: 10-06-2026 - జిల్లాలో ఎరువుల విక్రయాలను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి., ఐ.ఏ.ఎస్. గారు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో 14,896 టన్నుల ఎరువుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేయాలని తెలిపారు. ఎరువుల పంపిణీ కోసం రైతుల పేర్లను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, ఇప్పటికే 91,115 మంది నమోదు కాగా ప్రక్రియ 82 శాతం పూర్తైందన్నారు. మండల స్థాయిలో అధికారులు అవగాహన సమావేశాలు నిర్వహించి గ్రామస్థాయిలో ప్రచారం చేయాలని సూచించారు. ఆన్‌లైన్ నిల్వలు, భౌతిక నిల్వలు ఒకే విధంగా ఉండాలని, వ్యత్యాసాలు ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. #FertilizerDistribution #FarmerWelfare #APAgriculture #UreaSupply #BapatlaDistrict
6