Joined August 2012
1,975 Photos and videos
నేపథ్య సంగీతంతో పాటుగా PRELUDE, INTERLUDE పాడుకునేలా చేసిన శ్రీ #ఇళయరాజా సర్ కి 👏 రాత్రుళ్ళు జో కొడుతూ నిద్రపుచ్చుతున్న శ్రీ "ఇళయరాజా" సర్ కి 😘 గట్టిగా కౌగిలించుకుని మనసు ఆకలి తీర్చేస్తున్న శ్రీ "ఇళయరాజా" సర్ కి 💕 రోజంతా అలసట లేకుండా చేస్తున్న శ్రీ "ఇళయరాజా" సర్ కి ప్రేమతో ♾️♾️♾️ ( ఒక చిన్న పాప కార్ లో ఈ పాట పాడుతూ ఉంటుంది, ఆ వీడియో ఎవరి దగ్గరైన ఉంటే షేర్ చేయండి).
1
9
455
తప్పు చేస్తే చంపేస్తున్న "అపరిచితుడు" మొదటిసారిగా ప్రజల మధ్యకి వస్తున్నాడు.... చూడు రవి ( D.O.P.)!!! అపరిచితుడు ఒక "ఏలియన్" లా కనిపించాలి, నువ్వెలా లైటింగ్ చేస్తావో నీ ఇష్టం కానీ ఆడియెన్స్ అలాగే ఫీల్ అవ్వాలి.... "శంకర్" సర్ కూర్చోబెట్టి చెప్తే "రవి వర్మన్" ఇచ్చిన విజువల్స్ 📽️🎥
1
17
247
30,448
"బీచ్ లో గాలి వీస్తూ ఉండగా, సుహాసిని గారు లేచి చేతులు ముడుచుకుని ఆలోచిస్తూ ఉండే మాంటెజ్ తీసిన #భారతీరాజా సర్ కి 😘😘 ఏ విధంగా చూసినా "జెన్నిఫర్"తో "పులిరాజు" సరిపోడు కానీ ప్రేమించేశాడు.....మళ్ళీ తనే ఆలోచించాడు, అసలు ఆశపడడానికి కూడా అర్హత ఉండాలి కదా?? సింపుల్ గా #ఆత్రేయ గారు రాసిన మాట "ఆశపడ్డా అందుతుందా?? అర్హతైన ఉందా??" అని పాడుకుంటే, జెన్నిఫర్ తో "ప్రేమ కంటే గొప్ప బంధం ఏముంటుంది?? ఏమో జరిగినా జరగొచ్చు, ప్రేమ తెంచుకుంటే తెగిపోదు" కదా అని పాడించారు...
1
20
219
15,819
విశ్వాన్ని పరిపాలించే దేవుడు కూడా సృష్టి కార్యం (రొమాన్స్) చేస్తాడు... దేవుడు చేసే రొమాన్స్ మీద కూడా కీర్తన రాయొచ్చు అనే ఆలోచన ఎలా వచ్చింది #అన్నమయ్య గారికి?? నిజమైన భక్తుడు పొగుడుతాడు, నిందిస్తాడు, రొమాన్స్ కూడా రాస్తాడు 🤌🤌🤌 గంధం పూసుకుని వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మ బిగుతుగా ఆలింగనం చేసుకుంటున్నప్పుడు వచ్చే చెమటలు కూడా సువాసనలు వెదజల్లుతున్నాయి 🐐🐐🐐 ఇది చూస్తున్న చెలికత్తెలు అందరూ ఇద్దరి మీద పన్నీరు జల్లుతూ ఆనందిస్తున్నారు...
2
33
218
9,114
స్త్రీ తాలూకా "ఎత్తులు", "బరువులు" చూపించింది చాలు!!! అప్పుడప్పుడు, కనీసం ఒక్కసారైనా తన "లోతు" ఏంటో చెప్పే ప్రయత్నం చేద్దాం!!!! పెళ్లి చేసుకుంటే ఎక్కడ తన మేనల్లుడికి అన్యాయం జరుగుతుందేమో??? అని భయపడే సాంబయ్య కోసం, పిల్లలు వద్దనుకుని ఆపరేషన్ చేయించుకున్న "గంగ" తాలూకా "ప్రేమలో లోతుని, త్యాగంలో లోతుని చూపించిన శ్రీ #విశ్వనాథ్ సర్ కి ప్రేమతో 😘💕🥰🙌🤌🐐
2
38
351
21,697
అంతర్యామి......అలసితి..... సొలసితి...... 33,000 కీర్తనలు #అన్నమయ్య గారు రాసారు, ఈరోజుకి 11 వ కీర్తన అర్ధం చేసుకున్నాను..... మనసులో చింతలు, మైలలు (కల్మషాన్ని, అజ్ఞానాన్ని), మణుగులు ( పాపాల బరువుని ), ఆయన అనుమతిస్తేనే తప్ప మనంతట మనం వదిలించుకోవాలని ఎంత ప్రయత్నించినా పోవు.... ఓ....వెంకటేశ్వర స్వామి!!! ఇప్పుడు నువ్వు నా ఎదురుగానే ఉన్నావ్ కదా?? ఎటువంటి ఆలోచనలు లేకుండా నన్ను ఆదుకోండి....
6
94
544
10,060
ఫ్రేమ్ లో ఇద్దరు స్త్రీలు ఉన్నా కూడా!! రాజేంద్ర ప్రసాద్ గారి క్లోజ్ అప్ రియాక్షన్ ముందు తేలిపోయారు..... అద్దంలో రిఫ్లెక్షన్, టైట్ క్లోజ్ లో భామ క్లోజ్ అప్ 👏🥰😘 రాధ తాలూకా ఎర్రని పెదాలలో తేనెని తీసుకునేవాడు, ఎప్పుడూ ఆనందంగా ఉండేవాడు, మూడు లోకాలకి ప్రభువైనటువంటి, అత్యంత అందమైన శ్రీ కృష్ణ పరమాత్ముడిని దర్శించు. #బాపు గారి సినిమా 🎥📽️
2
9
127
9,841
"The most personal is the most creative" : sir MARTIN CHARLES SCORSESE రవి పరిగెత్తడానికి రెడీ అయినప్పుడు "వీడెంట్రా బాబు"!!?? అన్నట్టుగా చూసే "సత్యం రాజేష్" గారి ఎక్స్ప్రెషన్ 🤌🤌🙌
21
293
19,569
డియర్ "భారతీరాజా" సర్, ఈరోజు మీరు వెళ్ళిపోయాక ఇంకొక్కసారి "ఎర్ర గులాబీలు" చూసాను..... మ్యాచ్ కట్ లు, సాంగ్ టేకాఫ్ లు, బ్యాక్ స్టోరీ, షాట్ కంపోజింగ్ లు, ఎడిట్ ప్యాట్రన్ లు 🤞🫰👏🥰🤌🐐 50 ఏళ్ల క్రితం ఇలాంటి ఆలోచన, ఒకవేళ ఇప్పుడు తీస్తే కోట్లమంది మనోభావాలు దెబ్బతినేస్తాయి. "ఫిల్మ్ మేకర్ కి ధైర్యం, పొగరు ఉండాలని నేర్పించి వెళ్ళిపోయినందుకు ఇంకొక్కసారి థాంక్స్ #భారతీరాజా సర్ 😘♾️
3
37
281
24,216
ఈ తరానికి శ్రీ "భారతీరాజా" సర్ గొప్పతనాన్ని అర్థమయ్యేలా చెప్పడం కష్టం అనుభవిస్తేనే తెలుస్తుంది... "పదహారేళ్ళ వయసు" చూసి దర్శకుడు అయిన #మణిరత్నం సర్, ఆయన సినిమాలు చూసి రిలియలిస్టిక్ సినిమాలు తీసిన "RGV" సర్, "ఎర్ర గులాబీలు" సినిమా చూసి అటువంటివే పది సినిమాలు తీసిన సౌత్ ఇండియన్ సినిమా, తెలుగులో మొదటి టీనేజ్ లవ్ స్టోరీ, సందీప్ రెడ్డి వంగ ఎంతో ఇష్టంగా ఆఫీస్ లో పెట్టుకున్న చిరంజీవి గారి ఎక్స్ప్రెషన్ కూడా ఈయన సినిమాలోదే.... "క్లోజ్ అప్" కి ఎంత విలువ ఉందో చెప్పడానికి ఉదాహరణ ఈ సన్నివేశం. థాంక్స్ #భారతీరాజా సర్ బోలెడన్ని జ్ఞాపకాలు ఇచ్చేసి వెళ్ళిపోయినందుకు 🙏🙏🙏🥹📽️🎥
9
80
775
64,088
ఎప్పటికీ జవాబు దొరకని ప్రశ్న!!! "సందీప్" గారి లాంటి మనిషితో 10 నిముషాలు మాట్లాడినా క్రాఫ్ట్ మీద పట్టు ఉందని అర్థమవుతుంది కానీ!!! 6 సంవత్సరాలు కథ పట్టుకుని తిరిగినా ఇండస్ట్రీ లో ఎవ్వరికీ అర్థం కాలేదు ఎందుకని?? వందల కోట్లు ఖర్చుపెట్టే ప్రొడ్యూసర్ లకి కేవలం 3 కోట్లతో సినిమా తీస్తానని చెప్పినా నమ్మలేదు ఎందుకని?? "ఆఖరికి తన ఆస్తులు అమ్మేసి సినిమా తీశారు, ఒకవేళ అవి లేకపోతే?? @imvangasandeep గారి లాంటి క్రాఫ్ట్ ఉన్న ఫిలిం మేకర్ ఎప్పటికీ బయటపడేవాడు కాదు....అలా కాకుండా మిగిలిపోయిన అందరికీ ప్రేమతో 💕
6
34
424
57,151
వినేవారికి, చదివేవారికి, చూసేవారికి ఆనందంతోనో!! బాధతోనో!! రెండు కన్నీటి చుక్కలు వచ్చేలా చేసేదే నిజమైన "ఆర్ట్"...... తల్లి వెళ్ళిపోతూ కొడుక్కి చెప్పిన మాటలు 🤌🤌🤌 1. మనుషులు అన్నం పెట్టరు కాబట్టి చెట్టుకి కాసే పండ్లని నీకు ఇమ్మని ఆ చెట్టుకు చెప్పాను... 2.బాధలో ఉన్నప్పుడు నిద్ర రాదు కాబట్టి మేఘాలకి జోలపాట పాడమని చెప్పాను.... 3. స్కూల్ లో మ్యాథ్స్, ఫిజిక్స్ చెప్తారు కానీ బ్రతకడం ఎలానో నేర్పించరు అది కూడా నీకు చెప్పాను.... 4. వినయంతో ఉండు, ఓర్పుతో ఉండు, జాగ్రత్తగా ఉండు... థాంక్స్ థాంక్స్ థాంక్స్ @ThisIsDSP సర్.... ( సాహిత్యానికి నేషనల్ అవార్డ్ వస్తే బాగుణ్ణు అనిపిస్తుంది)
2
33
190
10,342
షాట్ కంపోజ్ చేయడం ఒక కళ 🫰🤞🐐 స్టడీ కెమెరా పట్టుకుని @dop007 లెన్స్ తో #మణిరత్నం సర్ కంపోజ్ చేసిన 2 నిముషాల సుదీర్ఘమైన షాట్ 📸 కిచెన్ లోకి వెళ్ళే సమయంలో "అమృత" కాస్ట్యూమ్ చేంజ్ చేసి, విక్కీ కాస్ట్యూమ్ కూడా మార్చేసి మళ్ళీ ఫ్రేమ్ లోకి కరెక్ట్ టైమ్ లో తీసుకొచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్ లు. "ఎవరు ఎంత నేర్చుకున్నా ఇంకా విశ్వమంత నేర్చుకోవడానికి మిగిలి ఉన్న ఆర్ట్ సినిమా"....
3
4
104
10,348
మంచి సినిమాని రివ్యూ రైటర్ లు, సోషల మీడియా ఆపలేదు.... నిజానికి రేపటినుండి #Peddi సత్తా ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది.... "హీరో క్యారెక్టరైజేషన్" : మా పార్వతీపురం (మన్యం) ఏజెన్సీ జిల్లాలో పెద్ది లాంటి క్యారెక్టర్ లు ఊరికి వందమంది ఉంటారు. వాళ్ళు చదువుకోరు, ప్రపంచ జ్ఞానం ఉండదు, అచ్చంగా "పెద్ది"లాగే ప్రవర్తిస్తూ ఉంటారు. 2026 లో ఇలా ఉంటే 1996 ఎలా ఉంటారు అనేది మనం ఊహించలేం..... మరి ఇక్కడ మాట్లాడే చదువుకునే మేధావులు పోర్న్ చూస్తారు, హీరోయిన్ ఫోటో ను జూమ్ చేసి పార్ట్ పార్ట్ లు క్లోజ్ లో చూస్తారు, లేచిన దగ్గరనుండి అమ్మని, అక్కని, చెల్లిని, భార్యని తిడుతూ ఉంటారు కదా??? "నిజానికి చదువు లేని పెద్ది కంటే?? చదువుకున్న ఈ మేధావులు ఏ విధంగా గొప్పోళ్ళు"??? వాడు కొండమనిషి అలాగే ఉంటాడు, నీకు ప్రూఫ్ కావాలంటే ఒకసారి సరదాగా ఉత్తరాంధ్ర తిరగేసి రా అప్పుడు ఎలాంటి సందేహాలు ఉండవు.... ఒక్కసారి ఆలోచించు "ఇంత పెద్ద కమర్షియల్ హీరో, ఇలాంటి కథ తెలుగులో చేసి ఎన్ని దశాబ్దాలు అయిందో కనీసం గుర్తుందా??"
25
296
1,460
79,480
10% చెడు ఉండొచ్చు కానీ 90% మంచిని చెప్పే సినిమా 🎥📽️ నువ్వు ఆ 10% మాత్రమే చూస్తే!! అది నీ వ్యక్తిగతం, అదే నీ వ్యక్తిత్వం....... బహుశా మా ఊరికి దగ్గరలో కథ జరగడం వలన ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యానేమో #Peddi లాంటి రైటింగ్ వచ్చి ఎన్నేళ్లు అయిందో కనీసం ఆలోచించావా?? నీ ప్రతిభని చూడకుండా కులాన్ని, డబ్బుని అడ్డుపెట్టుకుని నిన్ను ఎవరైనా అవమానించారా?? కనీసం సౌకర్యాలు లేవని ఎప్పుడైనా ఏడ్చావా?? నిన్ను మనిషిగా ఎవ్వరూ పట్టించుకోలేదని ఎప్పుడైనా బాధపడ్డావా?? ఇప్పటికీ ఉత్తరాంధ్ర లాంటి ఎన్నో గ్రామాలకు కనీస సౌకర్యాలు లేవో తెలుసా?? నీ ఉనికి కోసం, నీ గుర్తింపు కోసం, నీ లక్ష్యం కోసం నువ్వు నిల్చుంటే!!! పెద్దిలో ఉండే భావోద్వేగాలు కనిపిస్తాయి... చాలా చాలా గొప్ప సినిమా ఇచ్చారు అన్న @BuchiBabuSana థాంక్యూ 🫰🤞🫂
13
469
2,090
32,895
వదిలేద్దామని అనుకున్న ప్రతిసారీ ఇలాంటిది ఒకటి కనిపించి మళ్ళీ చెడకొడుతుంది ........ B.......Y......E......
3
70
368
15,010
అసిస్టెంట్ డైరెక్టర్ నుండి డైరెక్టర్ అయ్యే ప్రోసెస్ లో ఉండే దుఃఖాన్ని, కష్టాన్ని 1% మాత్రమే చూపించిన "పూరీ" సర్ అంటే ఎప్పటికీ ద్వేషమే!!!! కానీ "రవి" లాంటి క్యారెక్టర్ ను ఇచ్చినందుకు ప్రేమ కూడా అలాగే ఉంటుంది. "తను ఎంత దుఃఖంలో ఉన్నా కూడా తల్లిని, గర్ల్ ఫ్రెండ్ ను, స్నేహితులను, ఆఖరికి ప్రొడ్యూసర్ ను కూడా ఓదార్చే రవి" 🤞🫰💕
2
10
115
8,304
8000 పాటల్లో ఫలానా పాట బాగుందని చెప్పే జ్ఞానం లేదు, 1500 సినిమాల్లో ఫలానా నేపథ్య సంగీతం బాగుందని చెప్పే అర్హత లేదు, మూడు పదులు దాటినా టీనేజ్ లో ఉంచినందుకు, శవంగా మారే ముందు కూడా టీనేజ్ భావాలని ఉంచబోతున్నందుకు, ఎన్నో ఉదయాలు ఆహ్లాదంగా నిద్రలేపినందుకు, లెక్కలేనన్ని రాత్రుళ్లు కలత లేకుండా నిద్రపుచ్చినందుకు, ఎప్పుడూ తోడుగా, ధైర్యంగా, రొమాంటిక్ గా ఉండే సంగీతాన్ని ఇచ్చినందుకు, భారతదేశంలో పుట్టినందుకు #ఇళయరాజా సర్ కి నమస్కరిస్తూ ♾️♾️ ♾️ తొందర్లోనే "భారతరత్న" రావాలని కోరుకుంటూ #HappyBirthdayIlaiyaraja సర్
2
24
198
12,426
ఆయన దర్శకత్వం చేసిన సినిమాలు లాగే నా జీవితం కూడా ఉండాలని కోరుకుంటూ!!! అది ఎంత పెద్ద డిజాస్టర్ అయినా సంతోషంగా ఉంటుందని బలంగా నమ్ముతూ #మణిరత్నం సర్ కి ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు🫰 బస్ లో, ట్రైన్ లో, వర్షంలో మాట్లాడుతూ రొమాన్స్ చేయాలని నేర్పించిన "మణి రత్నం" కి, అద్దాన్ని చూస్తూ ప్రేయసిని ముద్దు పెట్టుకోమని చెప్పిన "మణి రత్నం" కి, స్త్రీని గౌరవంగా స్క్రీన్ మీద చూపించాలని నేర్పించిన "మణిరత్నం" కి, పరిగెత్తుకుంటూ వెళ్ళి గాల్లో తిప్పుతూ ప్రేయసిని కౌగిలించుకోవాలని నేర్పించిన "మణి రత్నం"కి ❤️💕😘🙏🎥🤌🥹🫣🙌📽️👏🥰🤗🥵🤞🐐🐐🐐
3
24
149
5,418