విశాఖపట్నం లో కైలాసగిరి వద్ద గల అనకాపల్లి జిల్లా డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్డ్ మైదానం నందు 5 వ రోజు ప్రారంభం అయిన పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల దేహధారుడ్య (PMT, PET) పరీక్షలు.-జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపిఎస్., గారు.
ఈ రోజు మహిళా అభ్యర్థులకు పి.ఎం.టి. మరియు పి.ఈ.టి. పరీక్షలను నిర్వహణ
విశాఖపట్నం , జనవరి 04 :
ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు( APSLRB) పోలీసు నియామక పక్రియలో భాగంగా ఉమ్మడి విశాఖపట్నం సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులకు విశాఖపట్నం లో కైలాసగిరి వద్ద గల అనకాపల్లి జిల్లా డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్డ్ మైదానం 5 వ రోజు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (APSLPRB) యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పారదర్శకంగా దేహధారుడ్య పరీక్షల నిర్వహణ.
ఈ రోజు అనగా 04.01.2025 తెల్లవారుఝాము నుండి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపిఎస్., వారి ఆధ్వర్యంలో ప్రారంభం అయిన పోలీస్ రిక్రూట్మెంట్ 5 వ రోజు ప్రక్రియ.
ఈ జనవరి 4 న నిర్వహించిన 5 వ రోజు పి.ఎం.టి. మరియు పి.ఈ.టి. పరీక్షలకు 718 మంది మహిళా అభ్యర్థులు
హాజరుకావాల్సి ఉండగా, 307 మహిళా అభ్యర్థులు మాత్రమే పి.ఎం.టి./పి.ఈ.టి. పరీక్షలకు హాజరయ్యారు. తదుపరి పరీక్షకు 186 మంది మహిళా అభ్యర్థులు అర్హత సాధించారు..
మహిళా అభ్యర్థులకు పి.ఎం.టి. మరియు పి.ఈ.టి. పరీక్షలను నిర్వహణను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా మహిళా పోలీసు సిబ్బందిని నియమించడం జరిగిందని జిల్లా ఎస్పీ గారు.
అభ్యర్ధులకు మొదటగా సర్టిఫికెట్స్ పరిశీలించారు. ఆతర్వాత... బయోమెట్రిక్ తీసుకున్నారు.
తదనంతరం పి.ఎం.టి./పి.ఈ.టి. పరీక్షలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీ ఎల్.మోహన్ రావు ,ఎస్బీ డిఎస్పీ శ్రీ బి.అప్పా రావు ఎఆర్ డిఎస్పీ శ్రీ పి.నాగేశ్వర రావు, శ్రీ ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీమతి టి.లక్ష్మీ ,సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీమతి టి.కళ్యాణి , ఆర్ ఐ లు శ్రీ ఎల్. మన్మధరావు, శ్రీ బి.రామకృష్ణారావు, ఐటి కోర్ ఎస్సై శ్రీ బి. సురేష్ బాబు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
@APPOLICE100