డాక్టర్ గారూ కష్టంగా ఉందండి.
ఎంత కష్టం?
చాలా?
ఏం చేసినా?
లేదు సార్,
అస్సలు నిలబడట్లేదా?
కొంచెమే, కానీ అది సరిపోవట్లేదు.
అయ్యో?
మీరే ఏదో ఒకటి చెయ్యాలి, నా కాపురం నిలబెట్టాలి.
సరే, డాప్లర్ పరీక్ష అని ఉంటది, అది చేసుకుని రా!
ఇదిగో సార్ రిపోర్టు.
అక్కడికి రక్తం వెళ్లట్లేదోయ్, నువ్వేమన్నా సిగరెట్లు కాలుస్తావా?
అవునుసార్ రోజుకి పెట్టె, ఇరవయ్యేళ్లనుంచి.
ఇంకేముంది పైన మంటకి కింద ఫ్యూజు కాలిపోయింది.
ఆ!
ఆ సిగరెట్ మానేసి, ఈమాత్ర వేసుకొని చూడు, ఫలితం ఉంటుందేమో.
అంటే!
అంటే అంటే అంతే, నేను చేయగలిగింది ఏమీ లేదు. దానికి కాలేయ మార్పిడిలా శిశ్నంమార్పిడి చేసినా పనిచెయ్యదు.
(అందుకే మాష్టారు నేను చెప్పేది ఏంటంటే, రనౌట్ అవ్వటానికి ముందు బ్యాట్ పట్టుకుని నిలబడాలి కదా!, ఆలోచిందండి, డైమండ్ డక్ కావద్దు.)