గ్రామీణ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న చిన్నబోయినపల్లి గ్రంథాలయం.
గ్రంథాలయాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు గారు.
చిన్నబోయినపల్లి గ్రామ యువతకు పోటీ పరీక్షల సన్నద్ధతలో అండగా నిలుస్తున్న గ్రంథాలయాన్ని
జిల్లా కలెక్టర్ గారు పరిశీలించారు.
గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న పుస్తకాలు, యువత వినియోగం, సాధించిన ఫలితాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
చిన్నబోయినపల్లి గ్రామానికి చెందిన కానిస్టేబుల్ ధూపాటి సతీష్ 2024 సంవత్సరంలో గ్రామీణ యువతకు నాణ్యమైన అధ్యయన వనరులు అందించాలనే లక్ష్యంతో స్వచ్ఛందంగా ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి వేలాది రూపాయలు వెచ్చించి కోచింగ్ తీసుకోలేని నిరుద్యోగ యువతకు గ్రామంలోనే పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు.
గ్రంథాలయంలో సుమారు రూ.1.50 లక్షల విలువైన పోటీ పరీక్షల పుస్తకాలను అందుబాటులో ఉంచారు. గ్రూప్స్, పోలీస్, రైల్వే, బ్యాంకింగ్, ఉపాధ్యాయ నియామకాలు తదితర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన అధ్యయన సామగ్రిని యువత ఉచితంగా వినియోగించుకుంటున్నారు.
ఈ గ్రంథాలయం ద్వారా చదువుకున్న యువతలో ఇద్దరు ఉపాధ్యాయులు, ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. అలాగే చిన్నబోయినపల్లి గ్రామానికి చెందిన హజారుద్దీన్ ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై గ్రామ యువతకు ఆదర్శంగా నిలిచారు.
@TelanganaCMO @revanth_anumula @seethakkaMLA @TelanganaCS #LibraryLife
#LibraryLove #LibraryBooks #BookLovers
#ReadingCommunity #Bookworm #Literacy
#PublicLibrary #SchoolLibrary #Education
#Learning #EducationMatters #Teaching
#StudentLife #ReadingForLearning