రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ఈరోజు 'ఆంధ్రప్రదేశ్ పాఠశాల శాసన సభ' కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చట్ట సభలపై విద్యార్థులకు ఉన్న అవగాహన నిజంగా అద్భుతం. అధికార పార్టీ సభ్యులుగా, ప్రతిపక్ష నేతలుగా, సభాపతిగా విద్యార్థులు చక్కటి వాక్చాతుర్యంతో ఆకట్టుకున్నారు. మాక్ అసెంబ్లీలో MLAగా ఆకట్టుకున్న కె.కొత్తవలస MJP స్కూల్ పదో తరగతి విద్యార్థి జమ్ము పవన్ కుమార్ ని అభినందించడం జరిగింది.
#ConstitutionDay
#StudentAssembly