చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి పులివెందుల నియోజకవర్గంలోని గ్రామాలకు తాగునీరు అందించే వాటర్ గ్రిడ్‌కు సంబంధించిన పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు సంబంధిత నీటిపారుదల ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో, పులివెందుల వాటర్ గ్రిడ్ పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు రెవెన్యూ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, సంబంధిత ఇంజినీరింగ్ కాంట్రాక్ట్ ప్రాజెక్టు మేనేజర్ లతో కలిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
#CollectorKadapa #DrinkingWaterSupply #WaterGridProject #Kadapa #YsrKadapaDistrict