Whatsapp, Instagram, Facebook & UPI ద్వారా జాతీయంగా అంతర్జాతీయంగా నా వంతుగా కనీసంలో కనీసం $3000 పైనే గత సంవత్సరం కాలంగా కొనడం జరిగింది .
అమెజాన్‌కు చుక్కలు చూపిస్తున్న టిక్‌టాక్... ఇండియా మిస్ అయిందా?
అమెరికాలో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. అక్కడ పిల్లకాయలు (Gen Z), యువత వస్తువులు కొనడానికి అమెజాన్‌కి వెళ్లడం లేదట! రీల్స్ చూస్తూ, స్క్రోల్ చేస్తూ టిక్‌టాక్ షాప్' (TikTok Shop)లోనే ఆర్డర్లు పెట్టేస్తున్నారు.
వీడియో చూస్తూ, నచ్చిన వస్తువును యాప్ దాటకుండా అక్కడికక్కడే కొనేసే ఈ 'సోషల్ కామర్స్' ట్రెండ్ ఇప్పుడు అమెరికా ఈ-కామర్స్ మార్కెట్‌ను షేక్ చేస్తోంది.
ఇండియాలో టిక్‌టాక్ ఉండి ఉంటే? 🤔
2020లో మోదీ ప్రభుత్వం డేటా సెక్యూరిటీ, దేశ భద్రత కారణాల వల్ల టిక్‌టాక్‌ను నిషేధించకుంటే... ఈపాటికే ఇండియాలో కూడా ఈ-కామర్స్ ముఖచిత్రం మారిపోయేది.
* ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లకు గట్టి పోటీ వచ్చేది.
* మన ఊర్లలోని చిన్న వ్యాపారస్తులు, క్రియేటర్లు టిక్‌టాక్ వీడియోల ద్వారానే కోట్లలో బిజినెస్ చేసేవారు.
* మీషో, ఇన్‌స్టాగ్రామ్ కంటే ముందే ఇండియాలో వీడియో షాపింగ్ విప్లవం వచ్చేది.
కట్ చేస్తే..
అక్కడ అమెరికాలో టిక్‌టాక్ షాపింగ్ దుమ్ములేపుతున్నా, డేటా భద్రత కారణాల వల్ల ఆ యాప్‌ను బ్యాన్ చేయాలనే డిమాండ్ అక్కడ కూడా గట్టిగా వినిపిస్తోంది. ఆ రకంగా చూస్తే ఇండియా ముందే అలర్ట్ అయి సరైన నిర్ణయం తీసుకుందని చెప్పాలి.
బిజినెస్ పరంగా ఇండియా ఒక పెద్ద మార్కెట్ చాన్స్ మిస్ అయిందా? లేక దేశ భద్రతే ముఖ్యం అంటారా?