ఆర్చరీ వరల్డ్ కప్‌లో రెండు స్వర్ణ పతకాలు సాధించి, భారత కీర్తిని దశదిశలా చాటిన విజయవాడ నగరానికి చెందిన యువ కెరటం ధీరజ్ బొమ్మదేవరకు నా హృదయపూర్వక అభినందనలు. అచంచలమైన కృషి, పట్టుదలతో అతడు సాధించిన ఈ విజయం మన యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం. భవిష్యత్తులో అతడు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నాను.