నవంబర్ 14, 15తేదీల్లో విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ -2025 కు గ్లోబల్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికేందుకు లండన్ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరక్టర్స్, పాల్ మాల్ కన్వెన్షన్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - యుకె బిజినెస్ ఫోరం నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నాను. ఈ కార్యక్రమానికి టెక్ మహీంద్ర యూరప్ బిజినెస్ హెడ్ హర్షుల్ అస్నానీ సంధానకర్తగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు గల అవకాశాలు, ప్రభుత్వం అమలుచేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాలను వివరించాను. ఈ రోడ్ షోలో యుకె డిప్యూటీ హై కమిషనర్ సుజిత్ ఘోష్, టెక్ మహీంద్రా యూరప్ విభాగం ప్రెసిడెంట్ హర్షూల్ అస్నానీ, ఐసిఐసిఐ బ్యాంకు యుకె విభాగం సిఇఓ రాఘవ్ సింఘాల్, ఎపిఐఐసి వైస్ చైర్మన్ & ఎండి అభిషిక్త్ కిషోర్, గ్లోబల్ ఫండ్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలకు చెందిన 150మంది సిఇఓలు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు పాల్గొన్నారు.