ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం
•అధికార గర్వానికి ప్రజలు నేర్పిన గుణపాఠమే 2024 తీర్పు
•ప్రజలు మనకు ఇచ్చింది అధికారం కాదు.. రాష్ట్రాన్ని కాపాడే గొప్ప బాధ్యత
•మహాత్మా గాంధీ, అంబేద్కర్, దీనదయాళ్ ఉపాధ్యాయ ఆశయాల సమాహారమే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ పాలన
•నవ భారత నిర్మాణంలో పంచాయతీల పాత్రే కీలకం
• స్థానిక సంస్థలను బలహీనపరిచి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయలేం
•కుల, ప్రాంతీయ పరిమితులు దాటి భారతీయత వైపు అడుగులు వేద్దాం
•వ్యవస్థలపై నమ్మకం తగ్గితే సమాజం ముక్కలవుతుంది
•రెండేళ్లలో మేము నిర్మించింది రోడ్లు, భవనాలు కాదు.. వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం
•అథారిటీ, రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ విడిపోతే వ్యవస్థలు కుప్పకూలతాయి
•సమస్య నిధుల కొరత మాత్రమే కాదు.. బాధ్యతలపై స్పష్టత లేకపోవడమే
•గ్రామసభ బలపడితేనే పంచాయతీ బలం.. పంచాయతీ బలపడితేనే ప్రజాస్వామ్యం పదిలం
•ఆఫీసుల్లో కాదు, ప్రజల సమక్షంలోనే నిర్ణయాలు జరగాలి
•పంచాయతీరాజ్ వ్యవస్థ నాయకులను తయారు చేసే ప్రజాస్వామ్య పాఠశాల
•డిజిటలైజేషన్‌తో పల్లెల ముఖచిత్రాలు మారుతున్నాయి
•వచ్చే ఎన్నికల కోసం కాదు.. వచ్చే తరాల కోసం నిర్ణయాలు తీసుకుందాం
•రాబోయే తరాలు గర్వించే సమాజాన్ని నిర్మించడమే కూటమి ప్రభుత్వ సమష్టి బాధ్యత
•తిరుపతి బహిరంగ సభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ
@PawanKalyan గారు
‘సరిగ్గా రెండేళ్ల క్రితం 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక చారిత్రక తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు కేవలం ఒక గెలుపు కాదు... అహంకారంపై సామాన్యుడు సంధించిన ఒక బలమైన సందేశం. ఒక తిరుగులేని హెచ్చరిక. భయాన్ని, అహంకారాన్ని, అధికారమే అంతా అనే అనాగరిక రాజకీయ సంస్కృతిని ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల కంటే ఎవరూ ఎక్కువ కాదని నిరూపించారు. ఆ నాడు ఓటర్లు ఇచ్చిన తీర్పు ఆంధ్రప్రదేశ్ సమాజానికి కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడమే కాకుండా, రాబోయే తరాల భవిష్యత్తుకు గట్టి నమ్మకాన్ని కల్పించింది. ప్రజలు మనకిచ్చింది కేవలం అధికారం కాదు, రాష్ట్రాన్ని కాపాడి ప్రగతిపథంలో నడిపించే ఒక గొప్ప బాధ్యత’ అని జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. ఈ చారిత్రక విజయానికి కారణమైన ప్రతి ఓటరుకీ, రైతుకు, నాయకుడికి, కార్యకర్తకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం కూటమిలోని ఏ ఒక్క పార్టీదో కాదు, ఇది ప్రజా విజయమని అన్నారు. రెండేళ్ల క్రితం ప్రజలు ఇచ్చింది అధికారం కాదు బాధ్యత అని తెలిపారు. దేశానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి దూరదృష్టి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం.. ప్రజల ఆకాంక్షలను ప్రతిబించించే జనసేన పార్టీ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి బలమైన పునాది పడినట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం 21 సీట్లకు పరిమితమై జనసేన చేసిన త్యాగానికి ప్రజలు 100 శాతం స్ట్రయిక్ రేట్ తో సమాధానమిచ్చారని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతి వేదికగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరిట నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సభను ఉద్దేశించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ “ప్రధాన మంత్రిగా సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్వర్తించి శ్రీ నెహ్రూ గారి రికార్డును అధిగమించిన గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి కూటమి ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రెండేళ్ల క్రితం జనసేన 21 సీట్లకు సరిపెట్టుకున్న సందర్భంలో చాలా మంది విమర్శలు చేశారు. మేము రాజీపడలేదు.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం 21 సీట్లకు పరిమితమయ్యాం. ఆ త్యాగం ఫలితంగా ఈ రోజన రెండేళ్ల క్రితం మేమిచ్చిన హామీలు ఒక్కొక్కటిగా ఆచరణలో కనబడుతున్నాయి. పెరిగిన వృద్ధాప్య పింఛన్లు, మహిళలకి ఆర్థిక భరోసా, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకి అండగా అన్నదాత సుఖీభవ, అన్నా క్యాంటీన్లు, విద్యకి ఇస్తున్న ప్రాధాన్యత, యువతకి ఉపాధి అవకాశాలు ఇలా ప్రతి అంశంలో మేము ఇచ్చిన మాట తూచా తప్పకుండా ఆచరణలోపెడుతున్నాం. (1/4)