విజయవాడలోని ఏపీఐఐసీ కాలనీవాసులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకుంటు.
ఈరోజు విజయవాడలోని సిఎస్ క్యాంప్ కార్యాలయంలో సీఎస్ శ్రీ సాయి ప్రసాద్ గారితో నిర్వహించిన సమావేశంలో మంత్రి శ్రీ అనగాని సత్య ప్రసాద్ గారు, ఎమ్మెల్యే శ్రీ గద్దె రామ్మోహన్ గారు, ఏపీఐఐసీ చైర్మన్ శ్రీ మంతెన రామరాజు గార్లతో పాల్గొని ఈ అంశంపై సమగ్రంగా చర్చించి, రీ-సర్వే నిర్వహించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
గతంలో ఆటోనగర్ కార్మికుల కోసం నిర్మించిన క్వార్టర్స్‌కు కేవలం ప్లింత్ ఏరియా మాత్రమే రిజిస్ట్రేషన్ జరగగా, ముందూ వెనుకా ఉన్న స్థలాలు రిజిస్ట్రేషన్ కాకుండా మిగిలిపోయాయి. దీంతో వందలాది కార్మిక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్య పరిష్కారమైతే ఈడబ్ల్యూఎస్, ఎంఐజీ కుటుంబాలకు పెద్ద ఊరట లభించనుంది.
దాదాపు 500 కార్మిక కుటుంబాలకు న్యాయం జరిగేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోంది. ప్రజల సమస్యల పరిష్కారమే మా ప్రాధాన్యత.
#APIICColony#Vijayawada#AutoNagar#CoalitionGovernment#WorkersWelfare#HousingForWorkers#APIIC#AndhraPradesh#NaraChandrababuNaidu#RegistrationIssue#PeopleFirst#TDPForPeople#Development#VijayawadaDevelopment#AndhraDevelopment#PublicWelfare