ప్రజాప్రభుత్వంలో మా ప్రతి అడుగు ప్రజల కోసమే..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ సంకల్పానికి ప్రత్యక్ష సాక్ష్యం.
ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, శాసనసభ్యులు మట్టా రాగమయి దయానంద గారు, రాందాసు నాయక్ గారు, జిల్లా కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులతో కలిసి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడం జరిగింది.
అందులో భాగంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో కల్లూరులో రూ. 10.50 కోట్లతో నిర్మించిన 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ప్రారంభించడంతో పాటు, విద్యుత్ సరఫరాను మరింత మెరుగుపరుచి నిరంతర సరఫరా చేయడం కోసం నారాయణపురంలో రూ. 2.75 కోట్లతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దీంతో పాటు పెనుబల్లిలో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవం, SPM షెడ్లు, రేజర్లలో 33/11 KV విద్యుత్ సబ్-స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశాము.
అనంతరం సత్తుపల్లిలో 100 పడకల ఏరియా ఆసుపత్రి ప్రారంభోత్సవం చేయడం జరిగింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్య, వైద్యంకు ఎక్కడ లోటు రావద్దని చిత్తశుద్ధితో పనిచేస్తోంది. గత ప్రభుత్వం సత్తుపల్లిలో మూడు హాస్పిటల్స్ నిర్మాణం మధ్యలో వదిలేస్తే ఈ ప్రభుత్వం వాటిని పూర్తిచేసి ఈ రోజు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజాప్రభుత్వం మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా ఉస్మానియా, వరంగల్ ఎంజీఎం హాస్పిటల్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఆసుపత్రులు వందలాది కోట్ల రూపాయలతో నిర్మిస్తూ గిరిజన, అర్బన్ ప్రాంతాల్లో అద్భుతమైన వైద్యం అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది. సిబ్బంది కొరత అనేది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండొద్దని, మెరుగైన వైద్యం కోసం సిబ్బందిని రిక్రూట్ చేసుకోవాలని అధికారులను ఆదేశించాం.
@TelanganaCMO @Bhatti_Mallu
#HealthcareForAll #CommunityHealthCenter #KVPowerSubstation #RejerlaSubstation #Sattupalli #Kalluru #Penuballi #Narayanapuram #Khammam