రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులతో అధిక లాభాలు సాధించాలి
పంటల మార్పిడి, సేంద్రియ సాగుపై దృష్టి సారించాలి
గోవిందరావుపేట మండలం సోమలగడ్డ క్రాస్ వద్ద పీఎస్‌ఆర్ గార్డెన్‌లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో, ఆత్మ సౌజన్యంతో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళా కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క
@seethakkaMLA గారు , ఆయిల్ ఫెడ్ చైర్మన్ రాఘవరెడ్డి గారు, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు గారులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సులో వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు పంటల మార్పిడి విధానం, నూతన వంగడాల వినియోగం, ఎరువుల వినియోగాన్ని తగ్గించే పద్ధతులు, సేంద్రియ వ్యవసాయం, ఆధునిక వ్యవసాయ యంత్రాల వినియోగం, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే శాస్త్రీయ సాగు విధానాలు, వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్ గారు,మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి గారు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యవసాయ శాస్త్రవేత్తలు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేష్,ఉద్యానవన శాఖ అధికారి సంజీవరావు,జిల్లా అధికారులు,ములుగు,ఏటూరు నాగారం ఆత్మ కమిటీ చైమెన్లు రవీందర్ రెడ్డి,కర్ల అరుణ, చల్వాయి,గోవిందరావు పేట గ్రామాల సర్పంచ్ లు,సంబధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
@TelanganaCMO @revanth_anumula @TelanganaCS @Tummala_INC
#AgricultureDevelopment #AgriculturalGrowth
#SustainableAgriculture #FarmDevelopment
#RuralDevelopment #AgricultureInnovation
#AgriDevelopment #FarmersFirst
#FarmerWelfare #EmpoweringFarmers
#RuralProsperity #RuralTransformation
#FarmerSupport #CommunityDevelopment