💧🌿 జల సంరక్షణలో దేశానికి ఆదర్శం – 10 లక్షలకుపైగా నీటి సంరక్షణ పనులతో దేశంలోనే రెండో స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా : జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి గారు 🌿💧
📍 పార్వతీపురం మన్యం జిల్లా: ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరం నీరు. జీవనానికి ఆధారం, వ్యవసాయానికి ప్రాణాధారం, అభివృద్ధికి మూలాధారం అయిన నీటిని సంరక్షించేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిన విస్తృత కార్యక్రమాలు నేడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి.
🔹 “జల్ సంచయ్ జన భాగీదారి 2.0” కార్యక్రమంలో భాగంగా 10 లక్షలకుపైగా నీటి సంరక్షణ పనులు
🔹 దేశవ్యాప్తంగా జిల్లాల ర్యాంకింగ్‌లో రెండో స్థానం సాధించిన ఘనత
🔹 వర్షపు నీటి ప్రతి బొట్టును ఒడిసిపట్టే దిశగా విస్తృత చర్యలు
🔹 ప్రజల భాగస్వామ్యం – ప్రభుత్వ శాఖల సమన్వయంతో విజయవంతమైన అమలు
🔹 భూగర్భ జలాల పెంపు, నేల తేమ సంరక్షణ, వ్యవసాయాభివృద్ధికి బలమైన పునాది
💧 జిల్లాలో చేపట్టిన ప్రధాన జల సంరక్షణ పనులు
🔹 ఫార్మ్ పాండ్లు
🔹 సోక్ పిట్లు & కమ్యూనిటీ సోక్ పిట్లు
🔹 రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు
🔹 బోర్‌వెల్ రీఛార్జ్ నిర్మాణాలు
🔹 సన్‌కెన్ పిట్లు
🔹 కాంటూర్ ట్రెంచ్‌లు & రింగ్ ట్రెంచ్‌లు
🔹 నీటి కాలువలు, చెరువుల అభివృద్ధి పనులు
🗣️ జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ:
🔹 నీటి సంరక్షణను ప్రజా ఉద్యమంగా మలచడం ద్వారానే సుస్థిర భవిష్యత్తు సాధ్యమవుతుందని తెలిపారు
🔹 వర్షపు నీరు వృథా కాకుండా భూమిలోకి ఇంకేలా ప్రతి గ్రామంలో చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు
🔹 భూగర్భ జలాల పునరుద్ధరణ, వ్యవసాయ స్థిరత్వం, పర్యావరణ పరిరక్షణే ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని వివరించారు
🔹 ప్రజల భాగస్వామ్యంతో జిల్లాను జల భద్రత కలిగిన జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి కొనసాగుతుందని తెలిపారు
🌟 ఒకప్పుడు వర్షాధారంగా ఉన్న అనేక ప్రాంతాలు నేడు నీటి లభ్యతతో పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి. ప్రతి ఫార్మ్ పాండ్ రైతుకు భరోసా, ప్రతి సోక్ పిట్ భూగర్భ జలాలకు జీవనాధారం, ప్రతి ట్రెంచ్ ప్రకృతి సంపదను కాపాడే రక్షణ కవచంగా మారింది.
📢 నీటి ప్రతి బొట్టును సంరక్షిద్దాం... భూగర్భ జలాలను పెంపొందిద్దాం... పర్యావరణాన్ని పరిరక్షిద్దాం... సుస్థిర భవిష్యత్తు కోసం జల సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ గారు పిలుపునిచ్చారు.
#JalSanchayJanBhagidari #WaterConservation
#Jaladhara #Jalaharathi
#GroundWaterRecharge #SaveEveryDrop
#SustainableDevelopment #WaterSecurity
#ParvathipuramManyam #Parvathipuram
#salur #Palakonda #Kurupam
#trending #environment #water #development