సులభంగా డబ్బు సంపాదించవచ్చనే అత్యాశను ఆసరాగా చేసుకుని, మల్టీ లెవల్ మార్కెటింగ్ ముసుగులో అమాయకులను నిండా ముంచుతున్న ముఠాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
పరిచయస్తుల ద్వారానే నమ్మకం కలిగిస్తూ, తక్కువ సమయంలోనే రెట్టింపు ఆదాయం వస్తుందని మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే. కనీస అవగాహన లేని ప్యూన్లు, అటెండర్లను డైరెక్టర్లుగా చూపిస్తూ షెల్ కంపెనీలను సృష్టించడం ఈ మోసాల్లోని కొత్త కోణం.
విదేశీ సంస్థల పేరుతో ప్రచార ఆర్భాటం చేస్తూ, విలువైన గిఫ్ట్ ఐటమ్స్ అంటూ నాసిరకం వస్తువులను అధిక ధరకు విక్రయిస్తూ సామాన్యుల కష్టార్జితాన్ని ఈ ముఠాలు కొల్లగొడుతున్నాయి. ఇలాంటి సంస్థల మాయమాటలకు లోనై, అప్పులు చేసి మరీ పెట్టుబడి పెట్టి ఆర్థికంగా చితికిపోతున్న బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
నా విజ్ఞప్తి ఒక్కటే.. భారీ లాభాల ఆశ చూపే ఏ కంపెనీ నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించకుండా, ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు చెల్లించవద్దు. అపరిచిత వ్యక్తులు చెప్పే మాయమాటలను నమ్మి మీ భవిష్యత్తును పణంగా పెట్టవద్దు.
మీకు ఏవైనా అనుమానాస్పద లావాదేవీలు లేదా మోసపూరిత స్కీమ్‌ల గురించి సమాచారం తెలిస్తే, వెంటనే మాకు ఫిర్యాదు చేయండి.
#SayNoToMLM #FinancialFrauds #StayAlert