ధర్మవరం పట్టణంలోని సంజయ్ నగర్లో రిసోర్స్ పర్సన్లకు(ఆర్పీ) డిజిటల్ ట్యాబ్లెట్స్ పంపిణీ చేశాను. క్షేత్ర స్థాయిలో డిజిటల్ ఎంపవర్మెంట్, సమర్థవంతంగా సేవలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ ట్యాబ్‌ల పంపిణీ జరుగుతోంది.
ఫీల్డ్ లెవల్ లో డాటాను కలెక్ట్ చేయడంలో ఆర్పీలకు ఈ ట్యాబ్లెట్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ప్రభుత్వ శాఖలు, ప్రజలకు మధ్య సమన్వయానికి దోహదపడతాయి.
రాష్ట్రంలో సెల్ఫ్ హెల్త్ గ్రూపులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వారికి పారదర్శకంగా సేవలను అందజేయడం కోసం మహిళా ఆకాశం యాప్ను తీసుకొచ్చాము. టెక్నాలజీలో వచ్చిన మార్పులను ఉపయోగించుకుని ప్రజలకు మరింత మెరుగ్గా సేవలు అందజేయడానికి ఆర్పీలు కృషి చేయాలి.
#Dharmavaram #TabDistribution #DigitalEmpowerment #ResourcePersons #SmartGovernance @BJP4Andhra