🚨 తిరంగాతో దుకాణం శుభ్రం.. దుకాణదారుడు అరెస్ట్
🔸 ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో మహమ్మద్ తాహిర్ అనే వ్యక్తి జాతీయ పతాకాన్ని దుకాణం శుభ్రం చేయడానికి ఉపయోగించిన ఘటన కలకలం రేపింది.
🔸 వైరల్ అయిన వీడియోలో తిరంగాను డస్టర్‌లా ఉపయోగిస్తూ దుకాణంలోని దుమ్ము తుడుస్తూ కనిపించాడు.
🔸 జాతీయ పతాకాన్ని అవమానించారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి తాహిర్‌ను అరెస్ట్ చేశారు.
🔸 జాతీయ జెండా గౌరవానికి విరుద్ధంగా వ్యవహరించిన ఘటనపై స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది.
#NationalFlag#Tiranga#Firozabad#ViralVideo#FIFA2026#Brazil#Muchatlu
🚨 కార్యాలయంలో ఉద్రిక్తత...అధికారిని చెప్పులతో చితకబాదిన రైతు
🔸 కర్ణాటకలోని బాగల్‌కోట్ బీడీటీఏ కార్యాలయంలో ఓ రైతు అధికారిపై చెప్పులతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది.
🔸 తన సమస్యలు ఎన్నిసార్లు చెప్పినా పరిష్కరించకపోవడంతో రైతు తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది.
🔸 వైరల్ అవుతున్న వీడియోలో రైతు అధికారిని నెట్టేస్తూ, చెప్పులతో కొడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
🔸 ప్రభుత్వ సేవల ఆలస్యంపై రైతుల్లో పెరుగుతున్న అసంతృప్తికి ఈ ఘటన నిదర్శనంగా మారిందనే చర్చ సాగుతోంది.
#Karnataka#Bagalkot#FarmerProtest#ViralVideo#FIFA2026#Brazil#Muchatlu
⚡ జీరో సివిల్ సెన్స్... 100% ప్రైవసీ !
🔸 హిల్ స్టేషన్‌లో రోడ్డు పక్కన ఇద్దరు యువకులు బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తూ కనిపించారు.
🔸 ఈ దృశ్యాలను స్థానిక యువకుడు వీడియో తీయగా, వారు కారు నంబర్ ప్లేట్‌ను చేతులతో కప్పేసేందుకు ప్రయత్నించారు.
🔸 వీడియోలో కనిపించకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించినా, ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
🔸 "నేచర్ కాల్" పేరుతో పబ్లిక్ ప్రదేశాల్లో ఇలాంటి చర్యలు చేయడం సివిక్ సెన్స్ లోపాన్ని చూపిస్తోందంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.
#CivicSense#HillStation#ViralVideo#PublicBehavior#FIFA2026#Brazil#Muchatlu
🚨 బంజీ జంప్ విషాదం.. తాడు లేకుండానే కిందకు నెట్టారు
🔸 బ్రెజిల్‌లోని లిమెయిరాలో 21 ఏళ్ల మరియా ఎడువార్డా రోడ్రిగ్స్ డి ఫ్రెయిటాస్ బంజీ జంప్ చేస్తానని భావించి వంతెనపైకి వెళ్లింది.
🔸 "స్కెలెటన్ బ్రిడ్జ్" నుంచి దూకే ముందు భద్రతా తాడు అమర్చాల్సి ఉండగా, అది అసలు అమర్చలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
🔸 సుమారు 40 మీటర్ల ఎత్తు నుంచి కిందపడిన యువతి ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదం నెలకొంది.
#Brazil#BungeeJump#Limeira#SafetyFailure#FIFA2026#Muchatlu
⚡ గుట్కా ప్రకటనలపై యువకుడి ఆగ్రహం"
🔸 బస్సుపై ఉన్న గుట్కా ప్రకటనలను ఓ యువకుడు చించి పడేస్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి.
🔸 ప్రజారోగ్యానికి హానికరమైన ఉత్పత్తుల ప్రచారంపై యువకుడు నిరసన వ్యక్తం చేసినట్లు కనిపిస్తోంది.
#GutkaAds#BusIncident#YouthAction#FIFA2026#PublicHealth#Muchatlu
👮 ఉప్పల్‌లో డ్రగ్స్ కలకలం
🔸 మల్కాజిగిరి డీపీఈఓ ఆదేశాలతో ఉప్పల్ నల్లచెరువు ప్రాంతంలో పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించారు.
🔸 ఈ దాడుల్లో షంషీర్ అలీ ఖాన్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
🔸 నిందితుడి వద్ద నుంచి రూ.300 చొప్పున విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన 4.2 కిలోల గంజాయి (1,014 ప్యాకెట్లు), ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
🔸 కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, కోర్టు రిమాండ్‌కు తరలించింది.
#UppalPolice#GanjaSeized#FIFA2026#HyderabadCrime#DrugBust#Muchatlu
🔴 ఇంట్లోకి దూసుకెళ్లిన కారు
🔸 సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడలో ఘోర ప్రమాదం
🔸 అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన కారు
🔸 ప్రమాదంలో ఇంట్లో ఉన్న ముగ్గురు దుర్మరణం
🔸 ఘటనాస్థలాన్ని పరిశీలించిన సీపీ రష్మీ పెరుమాళ్.. క్రేన్‌తో కారును బయటకు తీసిన పోలీసులు
#Siddipet#Kondapak#Duddeda#CarAccident#Muchatlu
📢 మోదీ-మ్యాక్రోన్ కీలక భేటీ
🔸 ప్రధానమంత్రి మోదీ నేడు ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రోన్‌తో సమావేశం కానున్నారు.
🔸 ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరగనున్నాయి.
🔸 ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో నిర్వహిస్తున్న ‘భారత్ ఇన్నోవేట్స్’ కార్యక్రమాన్ని ఇద్దరు నేతలు సంయుక్తంగా ప్రారంభించనున్నారు.
🔸 భారత్-ఫ్రాన్స్ సహకారానికి ఈ కార్యక్రమం మరింత ఊతమివ్వనుంది.
#Modi#Macron#BharatInnovates#FIFA2026#IndiaFrance#Muchatlu
🚨 లండన్‌లో భారత సంతతి యువకుడి హత్య
🔸 పశ్చిమ లండన్‌లోని సౌతాల్ ప్రాంతంలో భారత సంతతికి చెందిన 26 ఏళ్ల యువకుడు కత్తిపోట్లకు గురై మృతి చెందాడు.
🔸 జూన్ 10 అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనపై మెట్రోపాలిటన్ పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
🔸 మృతుడిని గుర్భేజ్ సింగ్‌గా గుర్తించారు. ఘటనలో మరో వ్యక్తికి గాయాలు కాగా, ఆస్పత్రిలో చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు.
🔸 హత్య అనుమానంతో ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు, ప్రత్యక్ష సాక్షుల సమాచారాన్ని కోరుతున్నారు.
#London#UKNews#IndianOrigin#FIFA2026#CrimeNews#Muchatlu
🚨 గిట్టుబాటు ధరలు లేక మామిడి రైతుల నిరసన
🔸 గిట్టుబాటు ధరలు లేక కృష్ణగిరిలో రైతులు టన్నుల కొద్దీ మామిడి పండ్లను రహదారి పక్కన పారబోశారు.
🔸 సరైన ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు.
#Krishnagiri#MangoFarmers#FarmerProtest#TamilNadu#Muchatlu
🚨 పాట్లిపుత్ర స్టేషన్‌లో విద్యార్థుల ఆందోళన
🔸 బీహార్ పోలీస్ ప్రొహిబిషన్ కానిస్టేబుల్ పరీక్షకు వెళ్తున్న అభ్యర్థులతో వచ్చిన పలు రైళ్లు ఆలస్యంగా చేరడంతో పాట్లిపుత్ర రైల్వే స్టేషన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
🔸 పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకునేలా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తూ ఆగ్రహించిన అభ్యర్థులు రైల్వే పట్టాలపైకి దిగారు.
🔸 విద్యార్థుల నిరసనతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పలురైళ్లు గంటల తరబడి నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
🔸 పలుగంటల చర్చల తర్వాత అధికారులు విద్యార్థులను ఒప్పించగా, క్రమంగా రైలు సేవలు పునరుద్ధరించారు.
#PatliputraStation#BiharPoliceExam#TrainDelay#AspirantsProtest#FIFA2026#Muchatlu