1983 Elections 👇
💎Actual Schedule : August 1983
💎Preponed to : January 1983
Prior to 1983 Elections, Maneka ji had an Organization with the name SVM (Sanjay Vichar Manch).
Post 1983 Elections and after RSM (Rashtriya Sanjay Manch) formation, SVM became Youth Wing of RSM 👍
1983 ఎన్నికల్లో ఎన్టీఆర్ గారు సొంతగా పోటీ చేయలేదు, పొత్తులోనే పోటీ చేసారు.
మేనకా గాంధీ గారు స్థాపించిన పార్టీ సంజయ్ విచార్ మంచ్ తో పొత్తు పెట్టుకొని 5 సీట్లు కేటాయించారు, అందులో 4 సీట్లు మేనకా గాంధీ గారు గెలిచారు.
కమ్యూనిస్ట్ పార్టీలతో చివరి దాక టీడీపీ పొత్తు ప్రయత్నం చేసింది, సీపీఐ, సీపీఎం పార్టీలు 150 సీట్లు డిమాండ్ చేయడంతో పొత్తు బెడిసికొట్టింది.
జనతా పార్టీ గడప తొక్కారు. బీజేపీలతోనూ మాట్లాడారు. కానీ ఏ పార్టీ కూడా ఒప్పుకోలేదు. భవనం వెంకట్రామిరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వంటివారిని ఎదుర్కోవాలంటే, పొత్తుల అవసరం ఉందని ఎన్టీఆర్ చేయని ప్రయత్నం లేదు.
ఇందిరా గాంధీ గారిని ఎదిరించి, ఆమె ఇంటి నుండి బయటకు వచ్చి మేనకా గారు సొంతంగా పార్టీ పెట్టడం అనేది అప్పట్లో సంచలనం, ఎన్టీఆర్ గారు తన చైతన్య రథంపై మేనకా గాంధీని వెంటబెట్టుకొని ప్రచారం చేసారు.
ఎన్టీఆర్ ఆమెను "వీరనారి" అని సంబోధించి ఆవిడా క్రేజ్ ను ఎన్నికల్లో గెలవడానికి దోహదపడింది.
మేనకా గారి వలనే టీడీపీ గెలిచిందని చెప్పి ఎన్టీఆర్ గారి విజయాన్ని తక్కువ చేయాలనే ఉద్దేశ్యం కాదు గాని, ఎన్టీఆర్ గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ చరిత్రలో సొంతగా పోటీ చేసి గెలిచినట్టు లేదు.
చరిత్రను వక్రీకరించి, సామాన్య జనాలకు తప్పుడు సమాచారం అందిస్తున్న వారి కోసం ఈ సమాచారం