ఎన్నికల ముందు మీ సేవకులమంటూ నీటిమూటల్లాంటి వాగ్దానాలు చేసి ఎన్నికల తర్వాత ఏమాత్రం జవాబుదారీతనం లేకుండా అంతా మీ మంచికే అంతా మాఇష్టం అంటూ అధికారదర్పంతో వ్యవహరించే ప్రభుత్వాల్ని నిలదీసినా కీటకాలతోపోల్చే పరిస్థితుల్లో సమూలమార్పు అసాధ్యమైతే కాదు కాని ప్రజాధృక్పథంలో మార్పు సంభవమే.
మనం రుసుము చెల్లించేది సేవ లేదా వస్తువు కోసం, అయితే ఆ విధంగా ఒక ఫుడ్ డెలివరీ యాప్ వాళ్ళు మనకి నాసిరకం వంటకం ఇస్తే దానిపైన రివ్యూలు రాసి, ఫిర్యాదు చేసి డబ్బు రాబట్టుకుంటాం, మరి పన్నులు కట్టాక పనిచెయ్యని ప్రభుత్వాన్ని ఎందుకు అదేవిధంగా నిలదీయం!?