Reviewed the beta version of the My Employee App being developed by
@IndiaPostOffice, a significant step towards strengthening postal services and improving the experience of citizens who rely on our network every day.
It enables transparent performance tracking to identify training needs, recognize excellence and support better workforce management while also bringing leave management, transfers, reimbursements and real-time circulars onto a single digital platform.
By streamlining employee workflows, reducing delays and enabling faster grievance resolution, the app helps our workforce focus more on service delivery.
A digitally empowered and accountable workforce is key to building a stronger India Post and delivering better services to every doorstep.
నేడు ఇండియా పోస్ట్ అభివృద్ధి చేస్తున్న My Employee App బీటా వెర్షన్ పై సమీక్షించాము. పోస్టల్ సేవలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడంతో పాటు, దేశవ్యాప్తంగా ఇండియా పోస్ట్ సేవలపై ఆధారపడుతున్న కోట్లాది మంది పౌరులకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా ఇది ఒక కీలక ముందడుగు.
ఈ యాప్ ద్వారా ఉద్యోగుల పనితీరును పారదర్శకంగా అంచనా వేయడం, శిక్షణ అవసరాలను గుర్తించడం, ప్రతిభను ప్రోత్సహించడం, అలాగే సెలవులు, బదిలీలు, రీయింబర్స్‌మెంట్లు, అధికారిక సర్క్యులర్లను ఒకే డిజిటల్ వేదికపై అందుబాటులోకి తీసుకురావడం సాధ్యమవుతుంది.
ఉద్యోగుల పనితీరును మరింత సులభతరం చేసి, ఆలస్యాలను తగ్గించి, ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయడం ద్వారా ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందించడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుంది.
డిజిటల్ సామర్థ్యాలు, జవాబుదారీతనం కలిగిన సిబ్బందే బలమైన ఇండియా పోస్ట్‌కు పునాది. ప్రతి ఇంటి గుమ్మానికి మరింత మెరుగైన సేవలు అందించడమే మా లక్ష్యం.