మీకు ప్రజల ప్రాణాలంటే లెక్క లేదా చంద్రబాబు? గతంలో గోదావరి పుష్కరాల సమయంలో 26 మంది చనిపోతే అది భక్తుల అత్యుత్సాహం వల్లే అని నివేదికలు ఇచ్చారు. ప్రభుత్వ వైఫల్యాన్ని తప్పించుకోవడానికి ప్రజలపై నెపం మోపారు. మిల్క్ ప్రొక్యూర్‌మెంట్ యాక్ట్‌లో పిరియాడిక్ చెకప్ జరగాలని వైయస్ జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసినా ఈ ప్రభుత్వం అమలు చేయలేదు. కల్తీ పాల ఘటనలో బాధిత కుటుంబాలకు ఇచ్చిన రూ.10 లక్షల పరిహారం తక్కువ, వెంటనే దాన్ని రూ.20 లక్షలకు పెంచాలి. భవిష్యత్తులో చికిత్స ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరించాలి. ఈ ఘటనలో బాధితులకు వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుంది, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం.
-మార్గాని భరత్ గారు, వైయస్ఆర్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి