Observed the ground reality across 10 constituencies, From a party built by ground-level workers to one run by paid performers.This shift toward the arrogance of capital is exactly why the base is alienated.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
సంచలన పోస్టులు పెట్టిన బీఆర్ఎస్ పార్టీ కోసం జైలుకు వెళ్లొచ్చిన కార్యకర్త సాల్వజి మాధవ్
పార్టీ కోసం సర్వం కోల్పోయి అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలను బీఆర్ఎస్ పార్టీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గతంలో చేసిన తప్పులే మళ్లీ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు భరోసా లేదు. ఎవరికి నచ్చినా నచ్చకున్నా ఇదే పచ్చి నిజం. ఓ బాధితుడిగా నేనే ఉదాహరణ. వేరే దారిలేక చనిపోదాం అనుకున్నా. వేరే వాళ్లకు ఏ సమస్య వచ్చినా అది పార్టీ సమస్య అంట. నాది మాత్రం పర్సనల్ సమస్య అంట. పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టకు అని చెప్తున్నారు. ఒకరికి ఒక న్యాయం? మరొకరికి ఇంకో న్యాయమా? అయినా నిద్రాహారాలు మాని పార్టీ కోసం నిరంతరం పని చేయడం నా తప్పే. ఎవరెక్కడ పోతే ఏంటి? నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. ఇదే చివరగా నేను నేర్చుకున్న గుణపాఠం - సాల్వజి మాధవ్