ఓట్ల వేటలో ‘కేంద్రం’ దొంగదారి!
కాంగ్రెస్ బలంగా ఉన్న చోట ఓట్ల తొలగింపునకు కుట్ర
బీహార్, బెంగాల్ ఫార్ములాను దేశం అంతటా ప్రయోగిస్తున్నారు
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రతిపక్ష పార్టీలను, ప్రతిపక్ష ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ ప్రజాస్వామ్య విరుద్ధమైన కుట్రలకు తెరలేపింది.
ఈరోజు టీపీసీసీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)పై, పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల (బి.ఎల్.ఏ)అవగాహన శిక్షణ శిబిరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కార్యకర్తలకు, ఏంజెట్లకు కేంద్ర ప్రభుత్వ వైఖరిని, బీజేపీ రాజకీయ వ్యూహాలను పసిగట్టి ఏ విధంగా తిప్పికోట్టాలో మార్గనిర్దేశనం చేయడం జరిగింది.
కేంద్ర ప్రభుత్వం చట్టం రూపంలో తీసుకువచ్చిన ‘ఎస్‌ఐఆర్’ ఒక పెద్ద భూతం లాంటిది, ఇది ముమ్మాటికీ దొంగదారి చర్యే అని నేను భావిస్తున్నాను.
కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో, ఎక్కడైతే మనకు ఓట్లు ఎక్కువగా ఉన్నాయో.. అక్కడ ఒక పద్ధతి ప్రకారం దాదాపు 30 నుంచి 35 శాతం ఓట్లను ‘ఫేక్ ఓట్లు’గా చిత్రీకరించి, వాటిని జాబితా నుంచి తొలగించేందుకు కేంద్రం పెద్ద కుట్ర చేస్తోంది. బీజేపి వాళ్లు గెలవలేని చోట ప్రత్యర్థి ఓటును కూడ గల్లంతు చేస్తుంది.
ఓటరు వయస్సులో స్వల్ప తేడాలున్నా, పేర్లలో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా.. వాటన్నింటినీ వంకగా చూపి ఓట్లను లేపేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే బీహార్, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఈ పద్ధతిని ప్రయోగించి సక్సెస్ అయ్యారు. అదే ఫార్ములాను ఇప్పుడు తెలంగాణలోనూ ప్రయోగించాలని చూస్తున్నారు. దీన్ని కాంగ్రెస్ సైనికులు గట్టిగా తిప్పికొట్టాలని సూచించడం జరిగింది.
ఓట్లతో పాటు..ఏకంగా సీట్లే దొంగిలిస్తున్నారు!
రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ఉదంతమే సాక్ష్యం..మీనాక్షి నటరాజన్ గారికి కావలసిన ఓట్ల కంటే 11 ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ కేవలం ఒక పాత ఎఫ్‌ఐఆర్ కాగితాన్ని సాకుగా చూపి, ఎన్నికల అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అక్రమంగా ఆమె నామినేషన్‌ను తిరస్కరింపజేశారు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీకి దక్కాల్సిన ఒక రాజ్యసభ స్థానాన్ని వాళ్ళు దొంగిలించారు. ఓట్లనే కాదు ఏకంగా సీట్లనే దొంగిలించే దుస్థితికి కేంద్రంలో బీజేపి ప్రభుత్వం దిగజారింది.
కేంద్ర ప్రభుత్వ చేతుల్లో ఉన్న సీబీఐ , ఈడీ , ఇన్‌కమ్ టాక్స్ సంస్థలను అడ్డం పెట్టుకుని, వేరే పార్టీల తరఫున గెలిచిన ప్రజాప్రతినిధులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలను కూల్చేందుకు కుట్రలు పన్నుతున్నారు.
ప్రతి ఓటూ కాంక్రీట్ గోడ కావాలి..
జూన్ 25 నుంచి జూలై 24 వరకు నెల రోజుల పాటు బూత్ లెవెల్ అధికారులు నిర్వహించే ‘ఓట్ మ్యాపింగ్’ ప్రక్రియపై కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించడం జరిగింది. ఉద్యోగాలు, చదువుల రీత్యా ఖమ్మం, హైదరాబాద్‌లలో ఉండే మన వాళ్ళు అధికారులు వచ్చినప్పుడు ఊర్లో లేరనే సాకుతో ఓట్లు తొలగించే ప్రమాదం ఉంది. అధికారులు వచ్చే ముందే గ్రామంలో చాటింపు వేయించి వేరే ఊర్లలో ఉన్న మన ఓటర్లను రప్పించి ఓటు కాపాడుకోవాలి. మనకు దొంగ ఓట్లు అవసరం లేదు.. మనకున్న జనాదరణతో ప్రతి ఓటునూ ఒక కాంక్రీట్ గోడ లాగా కాపాడుకోవాలి.
దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కాబోయే ప్రధానమంత్రి, మన నాయకుడు రాహుల్ గాంధీకి కార్యకర్తలంతా సైనికుల్లా అండగా నిలబడాలని, ఈ అక్రమ ఎస్ఐఆర్ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లి సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునివ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, పీసీసీ ప్రతినిధి సుధాకర్, ఖమ్మం టౌన్ ప్రెసిడెంట్, ఏదులాపురం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, 291 బూత్‌ల బి.ఎల్.ఏలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#SaveDemocracy #StopVoteDeletion #EveryVoteMatters #SIR
@TelanganaCMO @revanth_anumula