పాపం.. అమాయకుడు ఇంతకంటే ఏమి చేయగలడు?
ఒడిశాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన సోదరి బ్యాంక్ ఖాతా నుంచి రూ.20,000 తీసుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తికి, ఆమె స్వయంగా రావాలని అధికారులు చెప్పడంతో..
ఆమె మరణించిందని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో, తీవ్ర నిరాశకు లోనైన ఆ వ్యక్తి షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.
సోదరి సమాధిని తవ్వి, ఆమె అస్థిపంజరాన్ని బ్యాంక్‌కు తీసుకెళ్లి మరణాన్ని నిరూపించే ప్రయత్నం చేశాడు.
ఈ ఘటన వ్యవస్థలో అవగాహన లోపం, మానవత్వం కొరవడిన తీరుపై తీవ్ర చర్చకు దారితీసింది.
కాగా, ఎవరు క్లెయిమ్ చేయని బ్యాంక్ ఖాతాల్లో కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బు ఉందని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బ్యాంక్ రూల్స్, అధికారుల నిర్లక్ష్యం వల్ల అవి అలాగే ఉండిపోతున్నాయి.