🚨 AT. JUSTIN | INDIA 🇮🇳 | ANDHRA PRADESH | AMARAVATI
A.P Cabinet sanctioned ₹798 Crore to complete the Andhra Pradesh Assembly — the democratic heart of Amaravati.
✨ Iconic Central Spire set to redefine India’s legislative architecture
🚗 Multi-level parking & elevated access bridges to handle future capital scale
🏗️ Focus now shifts to finishing, façade, and interior excellence as structural works advance
A symbol not just of governance — but of people’s voice, pride, and identity.
#APAssembly#Amaravati#BuildAP#AndhraPradesh#NewCapital
అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా స్థిరపరుస్తూ, చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడంపై నందిగామ నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు కూటమి నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి ఘనంగా సంబరాలు నిర్వహించారు.
తంగిరాల సౌమ్య గారు తన కార్యాలయంలో కూటమి నేతలతో కలిసి కొవ్వొత్తులు వెలిగించి అమరావతి విజయానికి సంఘీభావం తెలిపారు. అనంతరం ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం అనేది ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు దక్కిన గొప్ప విజయమని, ఇది నిజమైన "ప్రజా విజయం" అని కొనియాడారు.
గత కొన్నేళ్లుగా అమరావతి కోసం రైతులు, ప్రజలు చేసిన పోరాటానికి ఈ నిర్ణయం తార్కాణమని ఆమె పేర్కొన్నారు. ఈ బిల్లు ఆమోదంతో అమరావతి అభివృద్ధికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయని, రాష్ట్రానికి మళ్ళీ పూర్వ వైభవం రాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధిలో ఇది ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని, నవ్యాంధ్ర నిర్మాణంలో అమరావతి మళ్ళీ తన విశిష్టతను చాటుకుంటుందని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
#Amaravati#AndhraPradesh#TangiralaSowmya#Nandigama#APAssembly#AmaravatiCapital#TDP#APGovernment#NandigamaNews#CapitalCity#Development#APPolitics#AmaravatiFarmers#VictoryCelebrations#CBN#AmaravatiOfficial#StateCapital
మన రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ - మన రాజధాని అమరావతి!!!
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన అమరావతి చట్టబద్దత బిల్లును ఈరోజు లోక్ సభ ఆమోదించిన శుభ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా శుభాకాంక్షలు.
ఈ అమరావతి చట్టబద్దత బిల్లు ఆమోదించేందుకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, మద్దతుగా నిలిచిన అన్ని పార్టీల సభ్యులకు నా కృతజ్ఞతలు.
న్యాయం కోసం అమరావతి రైతులు, ఆ ప్రాంత మహిళలు మరియు ప్రజలు శాంతియుతంగా చేసిన పోరాటానికి దక్కిన విజయం ఇది. ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నేతృత్వంలో అమరావతి దేశంలోనే గొప్ప రాజధానిగా నిలుస్తుంది.
#HistoricAmaravatiResolution#APAssembly#Amaravati