📍 యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో....
ప్రెస్ నోట్: 16-06-2026
యాదాద్రి భువనగిరి జిల్లాలో మేధావుల సదస్సు విజయవంతం
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన మేధావుల సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. బూర నర్సయ్య గౌడ్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేధావులు, వివిధ రంగాల ప్రముఖులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సదస్సులో మాట్లాడిన డా. బూర నర్సయ్య గౌడ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశం సాధించిన అభివృద్ధి, సంక్షేమం మరియు అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిష్ఠ పెరిగిన విధానాన్ని వివరించారు.
గత 12 సంవత్సరాల్లో పేదలు, రైతులు, మహిళలు, యువత, మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం అమలు చేసిన అనేక పథకాలు దేశ సామాజిక, ఆర్థిక అభివృద్ధికి బలమైన పునాది వేశాయని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, జల్ జీవన్ మిషన్, పీఎం కిసాన్ వంటి పథకాల ద్వారా కోట్లాది మంది ప్రజలు ప్రత్యక్షంగా లబ్ధి పొందారని పేర్కొన్నారు.
అలాగే దేశవ్యాప్తంగా రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, డిజిటల్ మౌలిక వసతులు, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి ద్వారా భారత్ వేగవంతమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందని అన్నారు. ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడం మోదీ ప్రభుత్వ సమర్థ నాయకత్వానికి నిదర్శనమని చెప్పారు.
అంతర్జాతీయ వేదికలపై భారతదేశ గౌరవాన్ని పెంచడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారని, జీ-20 సదస్సు విజయవంత నిర్వహణ, ప్రపంచ దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు, విదేశాంగ విధానంలో సాధించిన విజయాల ద్వారా భారత్‌ను ప్రపంచ అగ్రదేశాల సరసన నిలబెట్టారని పేర్కొన్నారు.
దేశ ప్రయోజనాల పరిరక్షణతో పాటు ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్య సాధన దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఈ అభివృద్ధి ప్రయాణంలో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు.
#YadadriBhuvanagiri
#BJP4Telangana
#ViksitBharat2047
#ModiGovernment12Years
#NarendraModi
#SevaSushasanGaribKalyan
#SabkaSaathSabkaVikas
#BuraNarsaiahGoud
#BJPForDevelopment
#NewIndia
#TelanganaBJP
#IndiaGrowthStory @BJP4Telangana @BJP4India @chshekharbjp @iamabhaypatil @tarunchughbjp @blsanthosh @sunilbansalbjp @JPNadda @AmitShah @NitinNabin @narendramodi