#MatsyakarulaSevalo
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ
@ncbn గారి నేతృత్వంలో కావలి నియోజకవర్గం, తుమ్మలపెంటలో జరిగిన "మత్స్యకారుల సేవలో" బహిరంగ సభలో పాల్గొనడం సంతోషాన్నిచ్చింది. మత్స్యకారుల సంక్షేమానికి మా ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది. గత ఐదేళ్ల విధ్వంసకర పాలన వల్ల దెబ్బతిన్న మత్స్య రంగాన్ని సరిచేసి, ఇప్పుడు విప్లవాత్మక నిర్ణయాలతో మత్స్యకారులకు అండగా నిలుస్తున్నాం.
ఈ సభ ద్వారా మత్స్యకారుల సంక్షేమం కోసం చేపట్టిన కీలక కార్యక్రమాల్లో భాగంగా వేట నిషేధ కాల భృతిని రూ.10 వేల నుండి రూ.20 వేలకు పెంచి, 1,30,796 కుటుంబాల ఖాతాల్లోకి రూ.261.50 కోట్ల ఆర్థిక సాయాన్ని నేరుగా జమ చేశాం. మత్స్యకారుల కోసం 60% సబ్సిడీతో 200 కొత్త మెకనైజ్డ్ బోట్లను మంజూరు చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా రూ.3,256 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్లు, 8 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను నిర్మిస్తున్నాం. ఇందులో భాగంగా కావలిలో రూ.288 కోట్లతో జువ్వలదిన్నె హార్బర్ నిర్మాణం చేపడుతున్నాం. మెకనైజ్డ్ బోట్లకు లీటరుకు రూ.9 డీజిల్ సబ్సిడీ ఇస్తూ, ఇందుకోసం రూ.50 కోట్లు కేటాయించాం. ఆక్వా రంగానికి రూ.1.50 కే విద్యుత్ అందిస్తున్నాం.
పొరుగు రాష్ట్రాల బోట్ల చొరబాట్లను అరికట్టేందుకు జాయింట్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, శాటిలైట్ చిత్రాలు మరియు బహుభాషా డ్రోన్ గస్తీ వ్యవస్థను ఏర్పాటు చేశాం. రక్షణ కోసం 4,550 ట్రాన్స్ పాండర్లను, జీపీఎస్ వ్యవస్థను సమకూర్చాం. మహిళల ఉపాధి కోసం సీఎస్ఎంసీఆర్ఐ (CSMCRI) సహకారంతో సముద్రపు నాచు (సీవీడ్) సాగులో శిక్షణ ఇస్తున్నాం. రిజర్వాయర్లు, చెరువులపై మత్స్యకారులకే పూర్తి హక్కులు కల్పిస్తూ ఉచితంగా ఫిష్ సీడ్ అందిస్తున్నాం. కావలి పరిసరాల్లోని 25 మత్స్యకార గ్రామాలకు మెటల్ రోడ్లు, నార్త్ బకింగ్ హామ్ కెనాల్ డీసిల్టింగ్ కోసం రూ.6.19 కోట్లు మంజూరు చేశాం. తుమ్మలపెంటను ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతాం.
తెలుగుదేశం పార్టీకి, బీసీలకు దశాబ్దాల అనుబంధం ఉంది. చేనేత, మరమగ్గాలు, నాయీ బ్రాహ్మణులు, వడ్డెర, గీత కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటోంది. రాష్ట్రంలో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు, 24 లక్షల ఉద్యోగాల సాధనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. ఇందులో భాగంగా తిరుపతిలో రాయల్ ఎన్ ఫీల్డ్ ప్లాంట్ రాబోతోంది. ‘నా దేశం - నా బాధ్యత’ అనే సూత్రంతో విదేశీ ప్రయాణాలు తగ్గించి, మన దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహిద్దాం. ఈ పర్యటనలో భాగంగా సీఎం గారితో కలిసి వ్యవసాయ, ఉద్యాన, డీఆర్డీఓ (DRDO) స్టాళ్లను సందర్శించాం.
@ysjagan ఐదేళ్ల తుగ్లక్ పాలనలో మత్స్య రంగాన్ని, సుదీర్ఘ తీరప్రాంతాన్ని దారుణంగా విధ్వంసం చేశారు. ఆ నాడు వాళ్లు వ్యవస్థలను దారుణంగా పాడు చేస్తే, వాటిని సరి చేసి లైన్ లో పెట్టడానికే మా ప్రజా ప్రభుత్వానికి 23 నెలల సమయం పట్టింది. కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు అండగా ఉంటూ సంక్షెమం చేస్తుంటే, ఓర్వలేక జగన్ అండ్ కో కావాలని అపోహలు సృష్టిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారు. బాబాయ్ హత్య నుంచి పెద్ద దస్తగిరి వరకూ కేవలం హత్యలు, కుట్రలు పన్నుతూ రాష్ట్రాన్ని వెనక్కు లాగడమే పనిగా పెట్టుకున్న ఆ గొడ్డలి పార్టీ ఫేక్ ప్రచారాలను, జగన్మోహన్ రెడ్డి మాటలను రాష్ట్రంలో ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. వేట నిషేధ భృతిని గతంలో మా టీడీపీ ప్రభుత్వం 10 వేలు ఇస్తే, వీళ్లు దాన్ని కూడా సరిగ్గా ఇవ్వకుండా మత్స్యకారులను వంచించారు.
ఈ రోజు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ భృతిని 20 వేలకు పెంచి, నేరుగా మత్స్యకారుల ఖాతాల్లో వేస్తుంటే చూసి తట్టుకోలేక జగన్ బ్యాచ్ సోషల్ మీడియాలో ఏడుస్తోంది. గత ఐదేళ్లూ దోపిడీ, దౌర్జన్యాలతో కాలక్షేపం చేసిన వీళ్లకు మత్స్యకారుల గురించి, బీసీల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదు.