MCRHRD లోని బోధి పెవిలియన్ లో పోలీసు, అగ్నిమాపక, హైడ్రా, మున్సిపల్ కార్పొరేషన్ల ఉన్నతాధికారులతో సమావేశమయ్యాను.
డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైం నియంత్రణ, ప్రకృతి విపత్తులకు సంబంధించి ఆయా శాఖల్లో తీసుకోవాల్సిన చర్యలు, వ్యవస్థల నవీకరణ - ఉన్నతీకరణకు సంబంధించి అధ్యయనం చేసి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించాను.
డ్రగ్స్ బాధితుల కోసం ప్రత్యేక డి అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించాను.
సైబర్ క్రైమ్ నియంత్రణ పైన అధ్యయనం చేసి సమగ్ర నివేదిక తయారు చేయాలని,
పోలీస్ ట్రైనింగ్ లోనే సైబర్ క్రైమ్ విభాగం లో పని చేయడం కోసం సెలక్షన్ జరగాలని,
అన్ని విభాగాలు, ఉన్నతాధికారుల మధ్య సమన్వయం బాగా పెరగాలని సూచించాను.
విజిలెన్స్ విభాగం లో సాంకేతికతను మరింతగా పెంచాలని చెప్పాను. డేటా అనాలసిస్ ఆధారంగా వ్యవస్థీకృత నేరాల పైన విజిలెన్స్ విభాగం దృష్టి సారించాలని,
విజిలెన్స్ కు మరిన్ని అధికారాలు ఇచ్చే అంశం పైన అధ్యయనం చేయాలని సూచించాను.
అగ్ని ప్రమాదాలు జరిగాక చర్యలు తీసుకోవడం కాక, ప్రమాదాల నివారణ కోసం ఫైర్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలని, మునిసిపల్ శాఖ, హైడ్రా తో సమన్వయం చేసుకొని ఫైర్ డిపార్ట్ మెంట్ కు సంబంధించిన కార్యచరణ ప్రణాళికను జూన్ 15 లోగా సిద్ధం చేయాలని ఆదేశించాను.
నాలాల నిర్వహణలో మెట్రో వాటర్ వర్క్స్ విభాగం తో సమన్వయం చేసుకోవాలని, మ్యాన్ హోల్స్ నిర్వహణ పైన పోలీస్, ట్రాఫిక్ పోలీస్, హైడ్రా, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలతో సమన్వయం చేసుకోవాలని దిశానిర్దేశం చేశాను.
నగరంలో అడ్డగోలుగా ఫ్లెక్సీలు కడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, ఫెక్సీలను నియంత్రించాల్సిందేనని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను.
#MCRHRD
#TelanganaPolice
#CyberCrimeControl
#DrugFreeTelangana
#CyberSecurity
#VigilanceReforms
#FireSafety
#DisasterManagement
#PublicSafety
#HYDRAA