📌 ప్రధానిగా 12 సంవత్సరాల సేవా ప్రస్థానం పూర్తి చేసుకున్న గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి అభినందనలు
భారతదేశ అభివృద్ధి, ప్రపంచ వేదికపై దేశ ప్రతిష్టను మరింతగా పెంచే దిశగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నిరంతరం కృషి చేస్తున్నారని కామారెడ్డి ఎమ్మెల్యే శ్రీ కాటిపల్లి వెంకట రమణారెడ్డి గారు పేర్కొన్నారు.
ప్రధానిగా 12 సంవత్సరాల పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మోదీ గారి నాయకత్వంలో దేశం అనేక రంగాల్లో ముందడుగు వేసిందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, సుశాసనం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.
అలాగే దేశవ్యాప్తంగా బీజేపీ ప్రజాదరణ మరింత పెరుగుతోందని, తెలంగాణలో కూడా పార్టీ బలోపేతమవుతూ ప్రజల విశ్వాసాన్ని పొందుతోందని పేర్కొన్నారు.
#NarendraModi#ModiAt12#12YearsOfService#ViksitBharat#BJP4India#BJP4Telangana#KVReddy#KTRReddy#Kamareddy#NewIndia#SabkaSaathSabkaVikas#ModiLeadership#BharatFirst#DevelopedIndia#TelanganaWithBJP