తుమ్మిడిహట్టి ప్రాజెక్టును అడ్డుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే!
తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణంపై అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
152 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మిస్తే మహారాష్ట్రలోని పలు గ్రామాలు ముంపునకు గురవుతాయని హెచ్చరించింది.
ఈ మేరకు అప్పటి మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు.
ప్రాజెక్టు నిర్మాణం అనవసరమని, ప్రజాధనం వృథా అవుతుందని లేఖలో పేర్కొన్నారు.
నిర్మాణాన్ని కొనసాగిస్తే భవిష్యత్తులో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.
తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిలిచిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వాల వైఖరే కారణమని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు.
#TummidihattiProject#BoyinapalliVinodKumar#Congress#PrithvirajChavan#KiranKumarReddy#Telangana#IrrigationProjects#BRS#CongressGovernment#ProjectControversy#telanganacongress#cmrevanthreddy