#AdminPost
గుడ్లవల్లేరు శ్రీ సత్యనారాయణ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాము గారు.
ప్రజల శ్రేయస్సు కోసం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే రాము గారు.
శ్రీ సత్య దేవుని ఆశీస్సులు, చల్లని దీవెనలు కూటమి ప్రభుత్వం మరియు ప్రజలందరిపై ఉండాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు ఆకాంక్షించారు.
మండల కేంద్రమైన గుడ్లవల్లేరు గ్రామంలో రెండో అన్నవరంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో.. 72వ వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలు గురువారంతో అత్యంత వైభవంగా జరిగాయి.
ముగింపు వేడుకల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు పాల్గొన్నారు. ముందుగా పూర్ణకుంభంతో ఎమ్మెల్యే రాముకు వేద పండితులు స్వాగతం పలికారు. అనంతరం ప్రజా శ్రేయస్సు కాంక్షిస్తూ ఎమ్మెల్యే రాము గారు స్వామివారికి ప్రత్యేక పూజలు చేయగా... వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనాలు అందజేశారు.
బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని భక్తులతో కలిసి ఎమ్మెల్యే రాము గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము గారు మాట్లాడుతూ... రెండో అన్నవరంగ ప్రసిద్ధిగాంచిన శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఎంతో వైభవంగా జరుగుతున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. స్వామి వారి ఆశీస్సులతో ఎంతో వైభవంగా ఉత్సవాలు ముగిశాయన్నారు. మహిమాన్వితమైన శ్రీ సత్య దేవుని దీవెనలతో యావత్ ప్రజానీకం సుఖ సంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గుడ్లవల్లేరు మండల టిడిపి అధ్యక్షుడు కొసరాజు బాపయ్య చౌదరి, మండల టిడిపి నాయకులు వల్లభనేని వెంకటరావు, వల్లభనేని సుబ్బారావు, చాపరాల రాజా, చాపరాల బాలాజీ, పొట్లూరి రవి, పోలవరపు వెంకటరావు,రావూరి రవి, మురాల నరేష్, బొర్రా నాగేశ్వరరావు, మరియు శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థాన కమిటీ సభ్యులు, వేలాదిగా భక్తులు పాల్గొన్నారు.
#gudlavalleru #gudulavada #IdhiManchiPrabhutvam #NaraChandrababuNaidu #PawanKalyan #NaraLokesh #VenigandlaRamu #Gudivada #BetterFutureForGudivadaPeople #GudivadaPublic #iLoveGudivada_iLoveMyHome #TDPforDevelopment #మనగుడివాడ_మనవెనిగండ్ల #BestFutureForGudivadaPublic #RamuMarkDevelopment #GudivadaDevelopment #GudivadaPeoples #RamuForPeople #మనMLAమారుతున్నగుడివాడ
#గుడివాడఅభివృద్ధి
#ప్రతీసమస్యకుపరిష్కారం
#కూటమిప్రభుత్వం
#రాముగారుఅభివృద్ధిహామీ