టాలీవుడ్ అంటే వాళ్లకు అత్తారిల్లు లాంటిందే?
మంచి కంటెంట్ ఉంటే భాషతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్ని సొంత సినిమాల్లా అక్కున చేర్చుకున్న చరిత్ర మనది. కానీ ఇప్పుడు అదే ఉదారతను అవకాశంగా మార్చుకుంటున్నారా అన్న సందేహం కలుగుతోంది. సూర్య నటించిన ఈటీ, కంగువా, కరుప్పు, విక్రమ్ సినిమాలు తంగలాన్, వీర ధీర సూరన్, శివకార్తికేయన్ నటించిన అమరన్, ఆయలాన్, మదరాసి—అన్నీ యథాతథ టైటిల్స్‌తోనే తెలుగులో విడుదలయ్యాయి. తాజాగా మలయాళ చిత్రం పళ్లి చట్టాంబి కూడా అదే బాట. ఒకప్పుడు తెలుగు టైటిల్స్ పెట్టేవారు. ఇప్పుడు ఎందుకు కాదు?
#Tollywood #TeluguAudience #RespectLanguage #PanIndianCinema #MovieTitles #ContentIsKing