ఈ రోజు నా పుట్టినరోజును పురస్కరించుకుని బనగానపల్లెను పచ్చదనంతో నింపాలనే మహోన్నత ఆలోచనతో నా సతీమణి శ్రీమతి బీసీ ఇందిర రెడ్డి ఆధ్వర్యంలో చెట్టుతో స్నేహం - మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది.
ఈ మేరకు బనగానపల్లె క్యాంపు కార్యాలయం నుంచి స్థానిక పెట్రోల్ బంకు సర్కిల్ వరకు విద్యార్థులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలతో కలిసి నిర్వహించిన ర్యాలీలో సతీసమేతంగా పాల్గొన్నాను.
ఈ సందర్భంగా పెట్రోల్ బంకు వద్ద నిర్వహించిన హరిత బనగానపల్లె బహిరంగ సభలో కలెక్టర్ రాజకుమారి గణియా గారితో కలిసి పాల్గొన్నాను. అనంతరం బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటడం జరిగింది.
సిమెంట్ రోడ్లు, భారీ నిర్మాణాలతో కాంక్రీట్ జంగిల్ గా మారిపోయిన బనగానపల్లెను హరిత బనగానపల్లెగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో.. నా సతీమణి బీసీ ఇందిరమ్మ తన సొంత నిధులు రూ. 30 లక్షలతో కడియం నర్సరీ నుంచి తెప్పించిన 5 వేల మొక్కలను బనగానపల్లెలోని రోడ్డు డివైడర్లలో విద్యార్థులు యువతతో కలిసి నాటారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థల వంటి ప్రాంతాల్లో మొక్కలు నాటడం జరిగింది.
చెట్లను బతికించుకుందాం - పచ్చని బనగానపల్లె నిర్మిద్దాం అని స్లోగన్‌తో ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని హరిత ఉద్యమంలా కొనసాగించాలని ఈ సందర్భంగా బనగానపల్లె ప్రజలకు పిలుపు ఇస్తున్నాను.
#PlantATree
#GreenBanaganapalli
#GoGreen
#TreePlantation
#BanaganapalliGreen
#TreeForFuture
#banaganapalli