“సికింద్రాబాద్ అస్తిత్వం కోసం జరిగే పోరాటం రాజకీయం కాదు…
ఇది తరతరాల హక్కుల కోసం జరిగే శాంతియుత ఉద్యమం.”
లష్కర్ సాధన సమితి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడటానికి 2026 జనవరి 17న నిర్వహించనున్న భారీ శాంతి ర్యాలీ సందర్భంగా, ముషీరాబాద్ నియోజకవర్గంలో సన్నాహక సమావేశం నిర్వహించబడింది.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు, లష్కర్ సాధన సమితి అధ్యక్షులు పవన్ కుమార్ గౌడ్ గారు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, నియోజకవర్గ నాయకుల తో కలిసి పాల్గొనడం జరిగింది..
సికింద్రాబాద్‌కు ప్రత్యేక కార్పొరేషన్ సాధించేవరకు అలుపెరగకుండా పోరాటం కొనసాగాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ముఠా గోపాల్ గారు స్పష్టం చేయటం జరిగింది.
ఈ శాంతి ర్యాలీని విజయవంతం చేయడానికి రాజకీయ నాయకులు, ఉద్యోగులు, వర్తకులు, వ్యాపారస్తులు, విద్యార్థులు, సబ్బండ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునివ్వడం జరిగింది.
#SecunderabadIdentity #PeacefulMovement #PeopleFirst #CollectiveVoice #UnityForRights
@KTRBRS @BRSparty @MutaGopal