Official handle of Commissioner of Police, Hyderabad City. Dial 100 in case of Emergency.

Joined May 2015
1,693 Photos and videos
CP Hyderabad City Police retweeted
భారీ వర్షాల సూచన నేపథ్యంలో నగరంలోని వాటర్ లాగింగ్ ప్రాంతాలను ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించాను. జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయల్ డేవిస్, డీసీపీలు అవినాష్ కుమార్, కాజల్ గారితో కలిసి లక్డీకాపూల్, మసబ్ ట్యాంక్, పంజాగుట్ట, కేబీఆర్ పార్క్ వంటి ప్రధాన ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించాను. GHMC, హైడ్రా, జలమండలి, విద్యుత్ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాము. భారీ వర్షాలు కురిసే సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని, మ్యాన్‌హోల్స్, విద్యుత్ స్తంభాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. #HyderabadRains
17
33
165
11,668
CP Hyderabad City Police retweeted
ఏ పనికైనా ఒక పద్ధతి ఉంటుంది. కానీ, ప్రాణాలను పణంగా పెట్టి ఇలా వర్క్ ఫ్రమ్ బైక్ చేయడం చూస్తుంటే... ఆత్రం ఎక్కువైతే ప్రాణం మీదకు వస్తుంది అనే మాట అక్షరాలా నిజమనిపిస్తోంది. రోడ్డు మీద మీ ఏకాగ్రత ఒక్క క్షణం తప్పినా, అది మీ ప్రాణానికే కాదు, పక్కన వెళ్లే అమాయకుల ప్రాణాలకు కూడా ప్రమాదకరం. గుర్తుంచుకోండి... కడుపు నింపుకోవడానికి చేసే పని, కడతేర్చేలా ఉండకూడదు. దయచేసి రోడ్డుపై ఇలాంటి బాధ్యతారాహిత్యమైన పనులు మానేయండి. సురక్షితంగా ప్రయాణించి, క్షేమంగా మీ గమ్యస్థానాలకు చేరుకోండి. #RoadSafety #ResponsibleDriving #SafetyFirst
81
97
525
54,035
CP Hyderabad City Police retweeted
హోంగార్డుల కుటుంబాలకు రూ.34 లక్షల చొప్పున ప్రమాద బీమా చెక్కుల అందజేత విధి నిర్వహణలో ఉంటూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు హోంగార్డుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.34 లక్షల చొప్పున ప్రమాద బీమా చెక్కులను హైదరాబాద్‌ సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్‌ గారు అందజేశారు. బషీర్‌బాగ్‌లోని సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన ఈ చెక్కులను బాధిత కుటుంబాలకు అందించారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో పనిచేస్తున్న హోంగార్డులు సయ్యద్‌ హుస్సేన్, సింహగిరి ఇటీవల వేర్వేరు ప్రమాదాల్లో మరణించారు. సయ్యద్‌ హుస్సేన్ నీటిలో మునిగి చనిపోగా.. సింహగిరి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. హోంగార్డుల వేతన ఖాతాలకు ప్రమాద బీమా కవరేజీ ఉండటంతో.. యాక్సిస్‌ బ్యాంక్‌ వారికి ప్రమాద బీమాను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో బ్యాంక్, పోలీస్ అధికారులతో కలిసి రూ.34 లక్షల చొప్పున చెక్కులను సయ్యద్‌ హుస్సేన్ భార్య రేష్మా బేగం, సింహగిరి భార్య భవానీకి సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు అందజేశారు. @AxisBank @hydcitypolice @TelanganaCOPs #AdminPost
4
16
55
3,533
CP Hyderabad City Police retweeted
'ఇగ్నైట్' లాంటి మోసపూరిత మనీ సర్క్యులేషన్ స్కీమ్‌లలో చేరితే.. చట్టవిరుద్ధమైన వ్యాపారంలో భాగస్వాములైనట్లే లెక్క! తెలిసి కూడా ఇతరులను ఇందులో చేర్పిస్తూ.. వారి నుంచి డబ్బులు వసూలు చేసి పైస్థాయి వారికి చేరవేస్తే, నిషేధిత స్కీమ్‌లో పాల్గొన్న నేరానికి మీరే బాధ్యులు కావాల్సి ఉంటుంది. ఇలాంటి మోసాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవు! అమాయకులను బురిడీ కొట్టించే మోసగాళ్ల వలలో పడి నిలువునా మోసపోకండి. అప్రమత్తంగా ఉండండి! @TelanganaCOPs @SajjanarOffice @hydcitypolice @CPHydCity @PMOIndia @HMOIndia @FinMinIndia #MLM #ScamAlert #CyberCrime #HyderabadCityPolice #Hyderabad
Hyderabad City Police busts 'IGNITE' network; prevents potential ₹5,000 Crore fraud. In a significant move to safeguard the public from financial exploitation, the Hyderabad City Police has executed 'Operation Ignite Crackdown,' successfully arresting 6 individuals across four states—Kerala, West Bengal, Delhi, and Uttar Pradesh. The operation was aimed at dismantling the Indian network of 'IGNITE,' a rebranded entity identified as the latest continuation of the infamous QNET money circulation scheme. The authorities acted with remarkable speed, intervening just 18 days after the entity was formed in India. This swift action is estimated to have prevented a massive financial fraud amounting to Rs. 5,000 crore. Investigations by the Central Crime Station have confirmed that the scheme involves the same principals who previously operated the banned QNET and Vihaan Direct Selling networks. This marks the fourth iteration of the same deceptive business model over the past three decades: Gold Quest transitioned to QuestNet, followed by QNET, and now IGNITE. With 3 victim complaints already filed and FIRs registered, the Hyderabad City Police has sent a strong message against such predatory money circulation rackets. This proactive operation underscores the department's commitment to tracking and neutralizing fraudulent schemes before they can victimize the public on a large scale.
5
25
68
6,890
CP Hyderabad City Police retweeted
Hyderabad City Police busts 'IGNITE' network; prevents potential ₹5,000 Crore fraud. In a significant move to safeguard the public from financial exploitation, the Hyderabad City Police has executed 'Operation Ignite Crackdown,' successfully arresting 6 individuals across four states—Kerala, West Bengal, Delhi, and Uttar Pradesh. The operation was aimed at dismantling the Indian network of 'IGNITE,' a rebranded entity identified as the latest continuation of the infamous QNET money circulation scheme. The authorities acted with remarkable speed, intervening just 18 days after the entity was formed in India. This swift action is estimated to have prevented a massive financial fraud amounting to Rs. 5,000 crore. Investigations by the Central Crime Station have confirmed that the scheme involves the same principals who previously operated the banned QNET and Vihaan Direct Selling networks. This marks the fourth iteration of the same deceptive business model over the past three decades: Gold Quest transitioned to QuestNet, followed by QNET, and now IGNITE. With 3 victim complaints already filed and FIRs registered, the Hyderabad City Police has sent a strong message against such predatory money circulation rackets. This proactive operation underscores the department's commitment to tracking and neutralizing fraudulent schemes before they can victimize the public on a large scale.
10
33
120
17,403
CP Hyderabad City Police retweeted
పాత వాహనాల క్రయవిక్రయాలపై సిటీ పోలీసుల నజర్! ఆపరేషన్ కవచ్‌ తనిఖీల నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సజ్జనర్ కీలక అడ్వైజరీ నగరంలో దొంగ వాహనాల చలామణికి అడ్డుకట్ట వేయడంతో పాటు, పాత వాహనాల కొనుగోలుదారులను మోసాల నుంచి రక్షించేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇటీవల నిర్వహించిన 'ఆపరేషన్ కవచ్' ఆకస్మిక తనిఖీల్లో సెకండ్ హ్యాండ్ వాహన డీలర్లు కనీస నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా విక్రయాలు సాగిస్తున్నట్లు నిర్ధారణ కావడంతో, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు సోమవారం కీలక మార్గదర్శకాలతో కూడిన అడ్వైజరీని జారీ చేశారు. సెకండ్ హ్యాండ్ వాహనాల క్రయవిక్రయాలపై మోటార్ వాహనాల చట్టం-1988, సెంట్రల్ మోటార్ వెహికిల్స్ రూల్స్-1989, భారతీయ న్యాయ సంహిత -2023లో ఉన్న నిబంధనలను అడ్వైజరీలో ప్రధానంగా పేర్కొన్నారు. యజమాని వివరాల ధృవీకరణ లేకుండా వాహనాలను కొనుగోలు చేసినా, తక్కువ కిలోమీటర్లు తిరిగినట్లు చూపించేందుకు ఒడోమీటర్లను ట్యాంపరింగ్ చేసినా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనుగోళ్ల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. అడ్వైజరీలోని ప్రధానాంశాలు! ●డీలర్లు ఏదైనా పాత వాహనాన్ని కొనుగోలు చేసే ముందు విక్రయదారుడి గుర్తింపును పక్కాగా ధృవీకరించుకోవాలి. ఇందుకోసం విక్రేత ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి ప్రభుత్వ గుర్తింపు పత్రాల నకలును సేకరించడంతో పాటు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లో ఉన్న పేరు, చిరునామాతో వాటిని సరిపోల్చుకోవాలి. ●ఒకవేళ అసలు యజమాని కాకుండా వేరొక ప్రతినిధి ద్వారా విక్రయం జరుగుతున్నట్లయితే, చట్టబద్ధమైన పవర్ ఆఫ్ అటార్నీ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ●ఒకవేళ విక్రేత గుర్తింపు లేదా వాహన యాజమాన్య వివరాలు సంతృప్తికరంగా ధృవీకరించబడకపోతే.. అటువంటి వాహనాన్ని డీలర్లు తమ వద్దకు తీసుకోవడం గానీ, ప్రకటనలు ఇవ్వడం గానీ లేదా తిరిగి విక్రయించడం గానీ పూర్తిగా నిషేధం. ●వాహనం కొనుగోలు చేసే ముందే అది దొంగిలించబడినదా, బ్లాక్ లిస్టులో ఉందా లేదా ఏదైనా ప్రమాదానికి గురైందా అన్న విషయాన్ని వాహన్ పోర్టల్ ద్వారా నిర్ధారించుకోవాలి. ●వాహనంపై ఉన్న పెండింగ్ ట్రాఫిక్ చలానాలు, రోడ్డు పన్ను బకాయిలతో పాటు ఎటువంటి టోల్ గేట్ బకాయిలు లేకుండా చూసుకోవాలి. ఫైనాన్స్ క్లియరెన్స్ వివరాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే లావాదేవీలు జరపాలి. ●ఇతర రాష్ట్రాల వాహనాల విక్రయాలకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. వాహన్ పోర్టల్ రికార్డులలో సదరు వాహనానికి సంబంధించి ఎటువంటి ఇతర భారాలు లేవని (ఎన్‌కంబరెన్స్ ఫ్రీ), స్పష్టమైన యాజమాన్య హక్కులు (క్లియర్ టైటిల్) ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే వాహన బదిలీ లేదా డెలివరీ ప్రక్రియ చేపట్టాలి. ●వాహనాల ఓడోమీటర్ రీడింగ్‌లను మార్చడం లేదా ఇంజిన్, ఛాసిస్ నంబర్లను ట్యాంపరింగ్ చేయడం చట్టరీత్యా నేరం. తక్కువ కిలోమీటర్లు తిరిగినట్లు చూపించి కస్టమర్లను మోసం చేయడం శిక్షార్హమైన నేరం. బాధ్యులపై బిఎన్ఎస్ సెక్షన్ 318తో పాటు వినియోగదారుల ర‌క్ష‌ణ చట్టం-2019 ప్రకారం చర్యలు ఉంటాయి. ●డీలర్లు వాహనాన్ని తమ వద్దకు తీసుకున్నప్పుడు, అలాగే వేరొకరికి డెలివరీ చేసే సమయంలో ఓడోమీటర్ రీడింగ్‌ను నమోదు చేయడంతో పాటు, ఇంజిన్/ఛాసిస్ నంబర్లను ఫోటో తీసి భద్రపరచుకోవాలి. ●మోటారు వాహనాల చట్టం-1988 లోని సెక్షన్ 192A, సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్-1989 లోని రూల్ 50 నిబంధనల ప్రకారం.. వాహనంపై కంపెనీ ముద్రించిన ఇంజిన్, ఛాసిస్ నంబర్లను గానీ, ఇతర గుర్తింపు చిహ్నాలను గానీ మార్చడం, చెరపడం, ట్యాంపరింగ్ చేయడం చట్టరీత్యా నేరం. ●ఒకవేళ ఏ వాహనానికైనా ఈ గుర్తింపు నంబర్లు ట్యాంపరింగ్‌కు గురైనా లేదా అసలు లేకపోయినా.. ఆ వాహనాన్ని దొంగిలించినదిగా భావించి పోలీసులు తక్షణమే సీజ్ చేస్తారు. అంతేకాకుండా, సదరు వాహనాన్ని తమ వద్ద ఉంచుకున్న రీసెల్లర్లపై ‘భారతీయ న్యాయ సంహిత (BNS)-2023’ సెక్షన్ 317(2) కింద దొంగ సొత్తును కలిగి ఉన్నట్లుగా పరిగణించి కఠిన క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. ●కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ (MoRTH) జారీ చేసిన జీఎస్‌ఆర్ 901(ఇ) (తేదీ: 22 డిసెంబరు, 2022) నిబంధనల ప్రకారం.. సెకండ్ హ్యాండ్ వాహనాల వ్యాపారం చేసే ప్రతి వ్యక్తి లేదా సంస్థ మోటార్ వాహన నిబంధనల (CMVR-1989) రూల్ 48 కింద సంబంధిత ప్రాంతీయ రవాణా అధికారి (RTO) కార్యాలయం నుంచి తప్పనిసరిగా అధికారిక లైసెన్స్ (అథరైజేషన్ సర్టిఫికేట్) పొంది ఉండాలి. నిబంధనలు ఉల్లంఘించి, అనుమతులు లేకుండా వ్యాపారం సాగిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయి. ●డీలర్లు తమ వద్ద జరిగే ప్రతి వాహన లావాదేవీకి సంబంధించి డిజిటల్ లేదా రాతపూర్వక రూపంలో ప్రత్యేక రిజిస్టర్‌ను నిర్వహించాలి. ఈ రిజిస్టర్‌లో కొనుగోలుదారు, విక్రయదారుల పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, వారి సంతకాలతో పాటు లావాదేవీ జరిగిన తేదీ, సమయాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలి. ●అలాగే వాహనం రిజిస్ట్రేషన్ నంబరు, ఇంజిన్, ఛాసిస్ నంబర్లు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు.. తిరిగి కస్టమర్‌కు డెలివరీ ఇచ్చే సమయంలో ఉన్న ఒడోమీటర్ రీడింగ్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ●వాహనం డీలర్ వద్ద ఉన్న సమయంలో జరిగే ప్రమాదాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు లేదా ఇతర దుర్వినియోగాలకు మోటారు వాహన నిబంధనల రూల్ 55ఇ ప్రకారం డీలర్లదే పూర్తి కస్టడీ ఆధారిత బాధ్యత. ●మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 2(30) కింద అసలు యజమానికి ఉండే చట్టబద్ధమైన యాజమాన్య బాధ్యతకు ఇది పూర్తిగా భిన్నమైనది. టెస్ట్ డ్రైవ్, సర్వీసింగ్ లేదా ఇతర అవసరాల కోసం వాహనాన్ని బయటకు తీసిన ప్రతిసారీ డ్రైవర్ పేరు, లైసెన్స్ నంబర్, వెళ్లే ఉద్దేశం, ప్రయాణ సమయం, ప్రయాణించిన దూరం (మైలేజీ) వివరాలను 'ఎలక్ట్రానిక్ ట్రిప్ రిజిస్టర్' లో తప్పనిసరిగా నమోదు చేయాలి. ●డీలర్ల కస్టడీలో ఉన్నప్పుడు వాహనం ఏదైనా ప్రమాదానికి గురైనా లేదా అసాంఘిక కార్యకలాపాలకు వాడబడినా.. అసలు వాహన యజమాని (ఆర్‌సీ ఓనర్) అనవసరంగా సివిల్, క్రిమినల్ కేసులతో పాటు మోటారు ప్రమాదాల క్లెయిమ్‌ల ట్రిబ్యునల్ (MACT) వ్యాజ్యాల్లో చిక్కుకోకుండా రక్షించేందుకే ఈ నిబంధనలను తీసుకువచ్చారు. సోషల్ మీడియా లేదా ఇతర మాధ్యమాలలో వాహనాలకు సంబంధించి తప్పుడు ఫోటోలు, అవాస్తవ సమాచారంతో ప్రకటనలు ఇచ్చి వినియోగదారులను ఆకర్షించడం నేరమని సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు స్పష్టం చేశారు. ఈ నియమ నిబంధనలను ఉల్లంఘించే డీలర్ల లైసెన్సులను రద్దు చేయడంతో పాటు, వారిపై భారతీయ న్యాయ సంహిత లోని దొంగతనం (సెక్షన్ 303), దొంగిలించిన సొత్తును కలిగి ఉండటం (సెక్షన్ 317), మోసం (సెక్షన్ 318), ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం (సెక్షన్ 221/222) కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా నిరంతరం ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, ఈ ప్రక్రియకు అందరూ పూర్తిగా సహకరించాలని కోరారు.
2
8
26
5,497
CP Hyderabad City Police retweeted
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన క్యూలైన్లు, కౌంటర్లు, మినీ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును ఆయన నిశితంగా పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. సీపీతో పాటు అదనపు సీపీ లా అండ్ ఆర్డర్ శ్రీ తఫ్సీర్ ఇక్బాల్, ఐపీఎస్ గారు, జాయింట్ సీపీ ట్రాఫిక్ శ్రీ జోయల్ డేవిస్, ఐపీఎస్ గారు, గోల్కొండ డీసీపీ చంద్ర మోహన్, తదితరులు ఉన్నారు. ఏర్పాట్ల పరిశీలన అనంతరం హైదరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు మీడియాతో మాట్లాడారు.. ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి ప్రారంభం కానున్న ఈ చేపమందు పంపిణీ కోసం బత్తిన కుటుంబ సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే దాదాపు 25 వేల మందికి పైగా ప్రజలు ఈ ప్రసాదం కోసం ఇక్కడికి వ‌చ్చారు. చేప‌ప్ర‌సాద పంపిణీ ప్రశాంత‌వాతావ‌ర‌ణంలో జ‌రిగేందుకు వీలుగా దాదాపు 1000 మందితో ఇక్క‌డ బందోబ‌స్తును ఏర్పాటు చేశాం. ఎలాంటి దొంగతనాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్రైమ్ పార్టీలతో పాటు షీ టీమ్స్ , టాస్క్‌ఫోర్స్ సిబ్బంది కూడా విధుల్లో ఉంటారు. వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన వారి సౌకర్యార్థం పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా తెలుగుతో పాటు ఒరియా, కన్నడ, మరాఠీ, గుజరాతీ వంటి వివిధ భాషల్లో అనౌన్స్‌మెంట్స్ చేయ‌డం జ‌రుగుతంది. రద్దీ వల్ల స్థానిక ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా అవసరమైన మార్పులు చేశాం. అత్యవసర వైద్య సేవల కోసం ప్రత్యేకంగా మెడికల్ టీమ్స్‌ను, ఐదు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచ‌డం జ‌రిగింది. ఈ రోజు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని, స్థానికంగా ఉండే ప్రజలు రద్దీని దృష్టిలో ఉంచుకుని రేపు రావాలని కోరుతున్నాం. తగినంత మొత్తంలో చేప ప్రసాదం అందుబాటులో ఉన్నందున ప్రసాదం దొరుకుతుందో లేదోనని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎలాంటి అపోహలు, పుకార్లను నమ్మవద్ద‌ని కోరుతున్నాం. ప్రజలందరూ ప్రశాంతంగా ఉంటూ చేపప్ర‌సాద పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు స‌హ‌క‌రించాలి.
3
13
50
5,241
CP Hyderabad City Police retweeted
➡️ఆపరేషన్ కవచ్: 562 హోటళ్లు, లాడ్జీలలో సిటీ పోలీసుల ముమ్మర తనిఖీలు ➡️5 వేల మంది సిబ్బందితో అర్ధరాత్రి సాగిన సోదాలు ➡️క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యవేక్షించిన నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ➡️నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక ✳️హైదరాబాద్ నగర అంతర్గత భద్రతను పటిష్టం చేయడంతో పాటు, అసాంఘిక శక్తుల కదలికలను ముందస్తుగా నిరోధించే లక్ష్యంతో శుక్రవారం రాత్రి 'ఆపరేషన్ కవచ్' తనిఖీలను సిటీ పోలీసులు నిర్వహించారు. శాంతి భద్రతల పరిర‌రక్ష‌ణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ చేపట్టిన ఈ సోదాలలో సుమారు 5,000 మంది పోలీస్ సిబ్బంది పాల్గొని, మొత్తం 562 హోటళ్లు, లాడ్జీలలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. హోటల్ రిజిస్టర్లను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు, బస చేయడానికి వచ్చిన విజిటర్ల గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తున్నారా? లేదా అనే అంశాలను నిశితంగా పరిశీలించారు. అర్థరాత్రి 11 గంటల నుంచి ఒంటిగంట వరకు ఈ సోదాలు కొనసాగాయి. ✳️ఈ ఆపరేషన్‌లో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలనలో పాల్గొన్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని, అమీర్‌పేటలోని పలు లాడ్జీలను ఆయన స్వయంగా సందర్శించారు. గదుల కేటాయింపు ప్రక్రియ, విజిటర్ల వివరాల నమోదు విధానాన్ని పరిశీలించారు. లాడ్జీలలో బస చేసిన పలువురు విజిటర్లతో నేరుగా మాట్లాడి, వారు ఏ ప్రాంతం నుండి వచ్చారు, నగర సందర్శనకు గల కారణాలు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ✳️ఈ ముమ్మర తనిఖీలలో భాగంగా కమిషనరేట్ పరిధిలోని 7 జోన్లలో మొత్తం 562 హోటళ్లు, లాడ్జీల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. జోన్ల వారీగా తనిఖీలు జరిగిన లాడ్జీలు, హోటళ్ల వివరాలు చూస్తే... అత్యధికంగా ఖైరతాబాద్‌లో 119, శంషాబాద్‌లో 92, జూబ్లీహిల్స్, గోల్కొండలలో 86 చొప్పున, సికింద్రాబాద్‌లో 82, రాజేంద్రనగర్‌లో 53, చార్మినార్ జోన్‌లో 44 చోట్ల ఈ ఆపరేషన్ కొనసాగింది. ఈ సోదాలలో లా అండ్ ఆర్డర్ పోలీసులు సమన్వయంతో వ్యవహరించి, హోటళ్ల రికార్డులను, గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ✳️ఈ తనిఖీల నేపథ్యంలో హోటళ్లు, లాడ్జీల నిర్వాహకులు విధిగా నిబంధనలు పాటించాలని నగర సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే ఈ తనిఖీల ముఖ్య ఉద్దేశమని తెలుపుతూ, లాడ్జీకి వచ్చే ప్రతి ఒక్కరి నుండి గుర్తింపు కార్డుల ఒరిజనల్ ప్రతిని పరిశీలించి, దాని స్పష్టమైన నకలును సేకరించాలని ఆదేశించారు. రిజిస్టర్లలో విజిటర్ల పూర్తి సమాచారం, ఫోన్ నంబర్లు, చెక్ ఇన్ , చెక్ అవుట్ సమయాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అసంపూర్ణ లేదా తప్పుడు సమాచారంతో గదులను కేటాయించరాదన్నారు. ✳️మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ గదులను ఇవ్వొద్దని, గుర్తింపు కార్డుల్లో ఉన్న వయసును దృవీకరించుకోవాలన్నారు. పెరుగుతున్న సాంకేతికతకు అనుగుణంగా త్వరలోనే నూతన డిజిటల్ విజిటర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టే దిశగా సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. భద్రతా నిఘాను బలోపేతం చేయడానికి హోటల్ పరిసరాలలో, ముఖ్యంగా ఎంట్రీ, ఎగ్జిట్, రిసెప్షన్ ఏరియాలు స్పష్టంగా కనిపించేలా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ప్రతి ఒక్క కెమెరా నిరంతరాయంగా పనిచేసేలా చూసుకోవాలని సూచించారు. ✳️ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తించినా లేదా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే సూచనలు కనిపించినా వెంటనే డయల్ 100కి గానీ, స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. నిబంధనలను బేఖాతరు చేసే నిర్వాహకులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు. ✳️ఈ తనిఖీల్లో అదనపు సీపీ క్రైమ్స్ శ్రీ శ్రీనివాసులు, ఐపీఎస్, అదనపు సీపీ లా అండ్ ఆర్డర్ తఫ్షీర్ ఇక్బాల్, ఐపీఎస్, జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయల్ డేవిస్, ఐపీఎస్, జాయింట్ సీపీ లా అండ్ ఆర్డర్ నార్త్ జోన్ శ్రీమతి శ్వేత, ఐపీఎస్, డీసీపీ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ శ్రీ వెంకటేశ్వర్లు, ఐపీఎస్, డీసీపీ క్రైమ్స్ శ్రీ చైతన్య కుమార్, ఐపీఎస్ తో పాటు అన్ని జోన్ల డీసీపీలు శ్రీ కిరణ్ ఖరే, ఐపీఎస్, శ్రీమతి శిల్పవల్లి, ఐపీఎస్, శ్రీ శ్రీనివాస్, ఐపీఎస్, శ్రీ చంద్ర మోహన్, శ్రీ రమణా రెడ్డి, శ్రీ రాజేష్, డీసీపీ సైబర్ క్రైమ్స్ శ్రీ అరవింద్ బాబు, డీసీపీ విమెన్ సేఫ్టీ వింగ్ శ్రీమతి లావణ్య నాయక్ జాదవ్, అదనపు డీసీపీలు, ఏసీపీలు, తదితరులు పాల్గొన్నారు. పీఆర్వో, హైదరాబాద్ సిటీ పోలీస్
41
43
208
63,017
CP Hyderabad City Police retweeted
నగరంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా గురువారం రాత్రి హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో 'ఆపరేషన్ కవచ్' పేరిట ముమ్మర వాహన తనిఖీలు చేపట్టాము. జూబ్లీహిల్స్-వెంకటగిరి, మధురానగర్-కృష్ణకాంత్ పార్క్, బోరబండ-పిలీ దర్గా, సనత్‌నగర్, అమీర్‌పేట్-సత్యం థియేటర్, తదితర ప్రాంతాల్లో స్వయంగా నేనే క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలను పరిశీలించాను. ఈ ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా కమిషనరేట్ వ్యాప్తంగా మేము మొత్తం 12,098 వాహనాలను (8,802 ద్విచక్ర వాహనాలు, 1,693 ఫోర్ వీలర్స్, 1,623 ఆటోలు) తనిఖీ చేశాము. ఇందులో సరిగ్గా లేని నంబర్ ప్లేట్లు గల 1,406 వాహనాలను, అసలు నంబర్ ప్లేట్ లేని 1,132 వాహనాలను, నకిలీ నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న 69 వాహనాలను గుర్తించాము. నిబంధనలు ఉల్లంఘించిన మొత్తం 2,149 వాహనాలను (2,046 ద్విచక్ర వాహనాలు, 52 ఫోర్ వీలర్స్, 51 ఆటోలు) స్వాధీనం చేసుకున్నాము. నెంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్, నకిలీ లేదా అసలు నెంబర్ ప్లేట్లు లేకపోవడాన్ని కేవలం సాధారణ ట్రాఫిక్ ఉల్లంఘనగా మేము పరిగణించబోము. ఇది సమాజ భద్రతకు పెను ముప్పుగా మారడంతో పాటు, అమాయకులను ఇబ్బందుల్లోకి నెడుతోంది. అందుకే నిబంధనలు ఉల్లంఘించే వారిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేస్తాము. రాబోయే రోజుల్లో అన్ని రకాల వాహనాలపై ఈ తనిఖీలు కొనసాగుతాయి. వాహనదారులు ఎల్లప్పుడూ సరైన పత్రాలను తమతో ఉంచుకోవాలి. నగర శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలంతా పోలీసులకు సహకరించాలని కోరుతున్నాం. #OperationKavach
50
34
207
22,951
CP Hyderabad City Police retweeted
ట్రాఫిక్ అలర్ట్! అమీర్‌పేటలోని శ్రీనివాసనగర్ వెస్ట్, మెట్రో పిల్లర్ నంబర్ A1043 సమీపంలో ఉన్న కెఎస్సార్ ఫ్యాషన్స్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. అత్యవసర సహాయక చర్యల కారణంగా, అమీర్‌పేట నుండి ఎస్సార్ నగర్ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది, దీనివల్ల ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు ఈ మార్గంలో ప్రయాణించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. విధుల్లో ఉన్న ట్రాఫిక్, అత్యవసర సిబ్బందికి సహకరించాలని కోరుతున్నాం. @HYDTP @hydcitypolice @CPHydCity @TelanganaCOPs
5
20
97
19,140
CP Hyderabad City Police retweeted
శాస్త్రీయ దర్యాప్తును ప్రోత్సహిస్తూ, బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా @hydcitypolice 'ఎక్సలెన్స్ అవార్డ్స్'ను ప్రారంభించింది. ✅ బెస్ట్ ఇన్వెస్టిగేషన్ కేటగిరీలో 14 మందికి.. ✅ బెస్ట్ పర్ఫార్మెన్స్ కేటగిరీలో 18 మందికి.. మొత్తం 32 మంది పోలీస్ అధికారులకు తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో పురస్కారాలు అందజేశాం. సమాజంలో ఆదర్శంగా నిలిచిన ఆరుగురిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించి.. సన్మానించాం. ఇకపై ప్రతి ఏటా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తాం.
11
22
147
10,133
CP Hyderabad City Police retweeted
FAKE NEWS ALERT 🚨 సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ సందేశం పూర్తిగా అవాస్తవం. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు కొందరు ఆకతాయిలు చేస్తున్న తప్పుడు ప్రచారం ఇది. వాట్సాప్ కాల్స్ రికార్డ్ అవుతున్నాయన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. ఇదే విషయమై గతంలో పలుమార్లు అప్రమత్తం చేశాం. అయిన కొందరు ఉద్దేశపూర్వకంగా షేర్ చేస్తున్నారు. బాధ్యతగల పౌరులుగా ఇటువంటి ఫేక్ వార్తలను నమ్మకండి, షేర్ చేయకండి. తప్పుడు వార్తలు వ్యాప్తి చేసే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. #FakeNewsAlert
9
30
83
9,266
CP Hyderabad City Police retweeted
హైదరాబాద్ పేట్ల బురుజులోని సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలలో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాను. సుదీర్ఘమైన, చారిత్రాత్మకమైన పోరాటం ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభ సందర్భంలో, ఉద్యమ అమరవీరులందరికీ హైదరాబాద్ సిటీ పోలీస్ తరపున ఘన నివాళులు అర్పించాను. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ, వారు కలలుగన్న ఆశయాల సాధన కోసం మనమంతా నిరంతరం కృషి చేయాలి. #TelanganaFormationDay
6
27
76
5,389
CP Hyderabad City Police retweeted
Hyderabad City Police is successfully exposing the multi-state tentacles of cybercrime through #OperationOctopus. Moving beyond individual fraudsters, we are striking at the very infrastructure that sustains them. Over the decade, cybercrime has evolved from isolated incidents into a sophisticated ecosystem. To counter this, our teams have neutralised vast networks supplying ‘mule accounts’ and deactivated thousands of ‘ghost SIM cards’ across India. We are also holding financial institutions accountable for KYC lapses and negligence. We have engaged with all concerned stakeholders to apprise them of these issues and are confident of a positive response and proactive action in this regard. Our mission is clear: to ensure a safe digital space for every citizen through relentless action. @EconomicTimes @Shilparanipeta
7
24
45
4,972
CP Hyderabad City Police retweeted
May 29
#WATCH | Hyderabad, Telangana: Police Commissioner VC Sajjanar says, "There was a brutal murder of senior advocate Khaja Moizuddin on the 23rd when he was coming out of his house to go swimming at 5:45 in the morning. Two people came in a Scorpio, intentionally hit him, and injured him. Soon after the injury, he was shifted to Mahavir Hospital, and later on to a private hospital where he succumbed to the injuries. Acting on a complaint, Nampally police registered a case... and started our investigation. We have arrested seven people: Mujahid Alam Khan, Mahboob Alam Khan, Kishan, and four others who are involved in this offence..." He adds, "There's a decade-long battle between Khaja Moizuddin, Mahboob Alam Khan and Mujahid Alam Khan for the administration, control, and financial management of waqf properties of Malakpet and Lakdikapul... We have seized the Scorpio and also Rs 10 lakhs, and Rs 10,000 was paid to commit this offence, and also mobile phones for this, for this, in the use of this offence. These seven accused will be produced, and they will be sent to judicial custody. We will again take them into police custody and interrogate them to unearth the entire conspiracy. We still have to interrogate these people. As of now, about three people are absconding, we are feeling. But we have to still unearth, have to find out who the people are who are again involved in the entire conspiracy..."
May 29
#WATCH | Hyderabad, Telangana: Nampally Police have arrested Telangana Congress leader Mujahid Alam Khan and his father in connection with the murder of senior advocate and Waqf Board panel lawyer Khaja Moizuddin. The police seized money from the group. According to police, Mujahid Alam Khan and his father allegedly hired a gang to kill the advocate. The group ran over Khaja Moizuddin with a car as he was getting into his vehicle outside his house in the Nampally police station limits in Hyderabad. “We have arrested all the accused, including Mujahid Alam Khan and his father, who gave the contract killing order,” a police official said
5
29
88
30,686
CP Hyderabad City Police retweeted
VIDEO | Hyderabad, Telangana: “Hyderabad Police has arrested seven persons in connection with advocate Moizuddin’s murder case,” says Commissioner VC Sajjanar. (Full video available on PTI Videos - ptivideos.com)
3
15
56
8,223
CP Hyderabad City Police retweeted
సాంకేతికత పురోగతికి బాటలు వేయాలి, కానీ నేడు ఏఐ రూపంలో అది సైబర్ నేరగాళ్ల చేతిలో ప్రమాదకరమైన కోరలు విప్పుతోంది. డీప్ ఫేక్స్, వాయిస్ క్లోనింగ్ వంటి మాయాజాలంతో నిజానిజాల మధ్య వ్యత్యాసం కనుక్కోలేనంతగా మోసాలు పెరిగిపోతున్న తరుణంలో అప్రమత్తత అత్యంత అవసరం. ఈ డిజిటల్ సవాళ్లను ధీటుగా ఎదుర్కోవాలంటే అత్యాధునిక రక్షణ వ్యవస్థలతో పాటు ప్రతి ఒక్కరిలోనూ డిజిటల్ విజ్ఞత పెరగాలి. సాంకేతికత ఎంత వేగంగా దూసుకుపోయినా, మన విజ్ఞతతో కూడిన నిఘా మాత్రమే మనల్ని సురక్షితంగా ఉంచుతుందని గుర్తుంచుకోవాలి. 👇 eenadu.net/telugu-news/vyaky… @eenadulivenews #ArtificialIntelligence #AI #DeepFake #CyberCrimeAwareness
6
16
47
4,559
CP Hyderabad City Police retweeted
బక్రీద్ పండుగ.. గొర్రెల, మేకల అమ్మకందారులూ తస్మాత్ జాగ్రత్త!! బక్రీద్ పండుగ సమీపిస్తున్న తరుణంలో నగరంలోని గొర్రెలు, మేకల సంతలు కొనుగోలుదారుల రద్దీతో సందడిగా మారాయి. అయితే, ఇదే అదనుగా భావిస్తున్న కొందరు కేటుగాళ్లు డిజిటల్ చెల్లింపుల పేరిట అమాయక వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు తెగబడుతున్నారు. ముఖ్యంగా ఫేక్ ఫోన్ పే వంటి నకిలీ మొబైల్ అప్లికేషన్లను సృష్టించి, నగదు చెల్లించినట్లుగా స్క్రీన్‌పై చూపిస్తూ వ్యాపారులను నమ్మిస్తున్నారు. సంతల్లో ఉండే విపరీతమైన హడావుడిని ఆసరాగా చేసుకుని, తమ బ్యాంక్ ఖాతాల్లోకి నిజంగానే నగదు జమ అయ్యిందో లేదో సరిచూసుకోని వ్యాపారులకు ఈ కేటుగాళ్లు టోకరా వేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ కమిషనరేట్ కంచన్‌బాగ్, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇలాంటి రెండు మోసాలు వెలుగులోకి వచ్చాయి. కంచన్‌బాగ్ ప్రాంతంలో ఆరుగురు వ్యక్తులు మూడు బైక్‌లపై వచ్చి, ఒక వ్యాపారితో బేరం కుదుర్చుకుని రూ. 68 వేలు చెల్లించినట్లు నకిలీ యాప్‌ ద్వారా స్క్రీన్ చూపించి జీవాలను తీసుకెళ్లిపోయారు. అదేవిధంగా రాజేంద్రనగర్‌లోనూ నలుగురు వ్యక్తులు రూ. 48 వేల విలువైన గొర్రెలను కొనుగోలు చేసి, ఇదే తరహాలో నకిలీ పేమెంట్ యాప్‌తో మోసగించారు. బాధితులు ఆలస్యంగా తమ బ్యాంక్ ఖాతాలను తనిఖీ చేసుకోగా, పైసలు జమ కాలేదని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గొర్రెలు, మేకల విక్రయదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా ఆన్‌లైన్ ద్వారా నగదు పంపినప్పుడు, కేవలం కొనుగోలుదారుడి ఫోన్‌లో కనిపించే స్క్రీన్ షాట్‌ను లేదా పేమెంట్ సక్సెస్ అనే మెసేజ్‌ను చూసి నమ్మవద్దు. మీ స్వంత మొబైల్‌కు వచ్చే బ్యాంక్ అధికారిక ఎస్‌ఎమ్ఎస్ చూసుకోండి లేదా నేరుగా మీ బ్యాంకింగ్ యాప్ తెరిచి బ్యాలెన్స్ పెరిగిందో లేదో స్వయంగా నిర్ధారించుకున్న తర్వాతే జీవాలను అప్పగించండి. వీలైనంత వరకు పెద్ద మొత్తంలో లావాదేవీలు చేసేటప్పుడు నగదు రూపంలో తీసుకోవడమే ఉత్తమం ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తించినా లేదా మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించినా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డయల్ 100 కు కాల్ చేయండి లేదా మా పోలీసు అధికారులకు సమాచారం అందించండి.
6
48
119
24,666
CP Hyderabad City Police retweeted
హైదరాబాద్ రామకృష్ణ మఠ్ లో 'సంస్కార్-2026' సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నాను. ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరిసే ఈ కేంద్రంలో 1000 మంది స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించడం ఒక అద్భుతమైన అనుభవం. ఈ సమ్మర్ క్యాంప్ లో అతితక్కువ కాలంలోనే ఆ చిన్నారులు సాధించిన బహుముఖ ప్రావీణ్యం, ప్రదర్శించిన నైపుణ్యం చూస్తుంటే ఆశ్చర్యం వేసింది. ఇక్కడ వారు అలవరచుకున్న క్రమశిక్షణే వారి ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది కావాలని.. స్వామి వివేకానందుని బోధనల స్ఫూర్తితో ఈ చిన్నారులు రేపటి భారతదేశాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తారని ఆశిస్తున్నాను.
10
35
269
13,361