సెన్సస్–2027 నిర్వహణలో అధికారులు సమన్వయంతో పనిచేయాలి – డీసీఓ భారతి హోళీకేరి గారు
రాష్ట్రంలో సెన్సస్–2027 కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేసి, ఎటువంటి పొరపాట్లు లేకుండా ప్రక్రియను పూర్తి చేయాలని డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ (డీసీఓ) భారతి హోళీకేరి గారు సూచించారు.
శుక్రవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించగా, రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఛార్జ్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీసీఓ భారతి హోళీకేరి గారు మాట్లాడుతూ సెన్సస్–2027 కార్యక్రమం దేశ ప్రణాళికా రూపకల్పనకు కీలకమని తెలిపారు. పెండింగ్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం కొనసాగుతున్న సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. డేటా నమోదు సమయంలో ఎలాంటి లోపాలు లేకుండా పర్యవేక్షణ చేయాలని, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో అవసరమైన సాంకేతిక సహాయం అందించాలని తెలిపారు.
ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల నియామకం పూర్తి చేసి వారికి శిక్షణ ఇవ్వాలని, మాన్యువల్స్, సూపర్వైజర్ కిట్స్, మ్యాప్స్ వంటి సామగ్రి పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అదనపు రిజర్వ్ సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఐడీఓసీ కార్యాలయం నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ అంకిత్ IAS మాట్లాడుతూ జిల్లాలో సెన్సస్–2027 ఏర్పాట్లు విస్తృతంగా చేపట్టామని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు.
ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల ఎంపిక, శిక్షణ, ఫీల్డ్ స్థాయి పర్యవేక్షణను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. డేటా ఖచ్చితత్వంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS సూచించారు.
ఈ సమావేశంలో సిపిఓ సంజీవరావు, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
@TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @iamkondasurekha @minister_adluri @SrihariVakiti @NDRFHQ @TelanganaCS @IPRTelangana @CPRO_TGCM
#Census2027 #SelfEnumeration #DataAccuracy #Telangana #BhadradriKothagudem #GoodGovernance #DigitalIndia