హైదరాబాద్ నగర కాంక్రీట్ జంగిల్‌లో ఉన్న ఏకైక "పచ్చని శ్వాసకోశం" కేబీఆర్ పార్క్!
కొన్ని రోజుల క్రితం నేను షేర్ చేసిన శాటిలైట్ టైమ్‌లైన్ చిత్రాలు (1985-2025) చూశారు కదా? కేవలం 40 ఏళ్లలో హైదరాబాద్ పశ్చిమ ప్రాంతం ఎంత వేగంగా కాంక్రీట్ వనంగా మారిపోయిందో స్పష్టంగా అర్థమైంది. దుర్గం చెరువు చుట్టూ ఉన్న మార్పులు ఒకెత్తయితే.. ఈ కాంక్రీట్ ఉధృతి మధ్య KBR నేషనల్ పార్క్ నగరం మొత్తానికి ఒక పచ్చని రక్షణ కవచంలా శ్వాసకోశంలా నిలిచింది.
1985-2025 గూగుల్ ఎర్త్ హిస్టారికల్ ఇమేజరీ ఆధారంగా సేకరించిన ఈ 40 ఏళ్ల కాలక్రమ నివేదిక, నైరుతి హైదరాబాద్‌లోని దుర్గం చెరువు క్యాచ్‌మెంట్ ఏరియా మరియు కేబీఆర్ (KBR) పరిసర ప్రాంతాల్లో జరిగిన పర్యావరణ విధ్వంసానికి తిరుగులేని శాస్త్రీయ ఆధారం. 1985 నాటి పూర్తి సహజసిద్ధమైన జలవనరులు, పచ్చదనం, రాతి నిర్మాణాలు... కాలక్రమేణా మాదాపూర్, ఖాజాగుడ, మణికొండల వైపు విస్తరించిన కాంక్రీట్ జంగిల్ కారణంగా 2025 నాటికి ఎలా కుంచించుకుపోయాయో ఈ నివేదికలోని నిఖార్సైన అక్షాంశ రేఖాంశాల భౌగోళిక సాక్ష్యాలు స్పష్టం చేస్తున్నాయి. పర్యావరణ చట్టాలను, గ్రీన్ బఫర్ జోన్లను ధిక్కరించి జరిగిన పట్టణీకరణకు, జలవనరుల సంకోచానికి అద్దం పట్టే పూర్తి సాంకేతిక వివరాలను క్రింది ఫైల్‌లో చూడవచ్చు..
drive.google.com/file/d/1WDx…
ట్రాఫిక్ ద్వారా ఉత్పన్నమయ్యే కాలుష్య నియంత్రణ అన్న సాకుతో ఈ రక్షిత జాతీయ పార్కును మరింత ఆక్రమించడానికి ఒడి కట్టడం చట్టవిరుద్ధం మాత్రమే కాదు, పర్యావరణానికి తీవ్ర నష్టం! రోడ్లను వెడల్పు చేసే బదులు, పార్క్ చుట్టూ సమర్థవంతమైన వన్‌వే విధానాన్ని అమలు చేయడమే దీనికి ఏకైక శాస్త్రీయ ప్రత్యామ్నాయం.
ఈ నెల 19, 20 తేదీల్లో నేను హైదరాబాద్‌లో ఉండబోతున్నాను. ఇందులో భాగంగా మే 20న KBR నేషనల్ పార్క్‌ను వ్యక్తిగతంగా సందర్శిస్తున్నాను. ఈ సందర్భంగా, అక్కడ పర్యావరణ పరిరక్షణ కోసం, పార్క్ అస్తిత్వం కోసం శాస్త్రీయ ఆధారాలతో నిరంతరం పోరాటం చేస్తున్న పలువురు ప్రముఖులను, పర్యావరణ మేధావులను కలవబోతున్నాను. వారిని కలిసి క్షేత్రస్థాయి వాస్తవాలను, వివరాలను అడిగి తెలుసుకోబోతున్నాను. మన నగరం కోసం ఈ పచ్చదనాన్ని ఎలా కాపాడుకోవాలో ఆ వివరాలన్నింటినీ 20వ తేదీన ఒక ప్రెస్ మీట్ లేదా ప్రెస్ నోట్ ద్వారా మీతో పంచుకుంటాను.
మన పర్యావరణాన్ని కాపాడుకోవడం మన అందరి సమిష్టి బాధ్యత!
हैदराबाद शहर के कंक्रीट जंगल में एकमात्र "हरा-भरा फेफड़ा" (Green Lung) केबीआर (KBR) पार्क है!
कुछ दिनों पहले मेरे द्वारा साझा की गई सैटेलाइट टाइमलाइन तस्वीरों (1985-2025) को आपने देखा ही होगा? यह स्पष्ट रूप से समझ में आता है कि केवल 40 वर्षों में हैदराबाद का पश्चिमी क्षेत्र कितनी तेजी से कंक्रीट के जंगल में बदल गया है। दुर्गम चेरुवू के आसपास के बदलाव एक तरफ हैं, तो दूसरी तरफ इस बढ़ते कंक्रीट के बीच केबीआर नेशनल पार्क पूरे शहर के लिए एक हरे-भरे सुरक्षा कवच और फेफड़े की तरह अडिग खड़ा है।
🙂
यातायात (ट्रैफिक) से होने वाले प्रदूषण नियंत्रण का बहाना बनाकर इस संरक्षित राष्ट्रीय उद्यान (नेशनल पार्क) पर आगे और अतिक्रमण करने का प्रयास न केवल अवैध है, बल्कि पर्यावरण के लिए भी बेहद हानिकारक है! सड़कों को चौड़ा करने के बजाय, पार्क के चारों ओर एक प्रभावी वन-वे (एकतरफा मार्ग) प्रणाली लागू करना ही इसका एकमात्र वैज्ञानिक विकल्प है।
मैं इस महीने की 19 और 20 तारीख को हैदराबाद में रहूँगा। इसी सिलसिले में, 20 मई को मैं व्यक्तिगत रूप से केबीआर नेशनल पार्क का दौरा कर रहा हूँ। इस अवसर पर, मैं उन कई गणमान्य व्यक्तियों और पर्यावरणविदों से मिलने जा रहा हूँ जो वैज्ञानिक प्रमाणों के साथ वहां पर्यावरण संरक्षण और पार्क के अस्तित्व के लिए लगातार संघर्ष कर रहे हैं। मैं उनसे मिलकर जमीनी हकीकत और विवरणों की जानकारी लूँगा। हमारे शहर के लिए इस हरियाली को कैसे बचाया जाए, इन सभी विवरणों को मैं 20 तारीख को एक प्रेस कॉन्फ्रेंस या प्रेस नोट के माध्यम से आपके साथ साझा करूँगा।
हमारे पर्यावरण की रक्षा करना हम सभी की सामूहिक जिम्मेदारी है!
#పర్యావరణాన్ని_పరిరక్షించే_అభివృద్ధి_ప్రస్థానం కోసం అందరం కలిసి అడుగేద్దాం..
kbrnp.in #SaveKBRPark #EcoSensitiveZone #GreenLung #SaveNature #EnvironmentalProtection
#EcoAwareness #SaveEcology #SaveHyderabad #మననుడి_మననది
@revanth_anumula @TelanganaCMO @moefcc
@byadavbjp @mvrsastry @watermanofindia @IYRKRao