2015: Forensic labs confirmed CBN's voice bribing an MLA for a single vote. Courts let him walk.
2024: CEO Mukesh Kumar Meena runs AP elections — books YSRCP leaders, turns a blind eye to TDP violations & hands CBN a landslide on a silver platter. 🍽️
Reward? A plum cabinet post in CBN's own government. 🎁
One man. Two decades. Zero accountability.
This isn't politics — it's a masterclass in buying democracy, one vote and one officer at a time. 🎭
Forensics confirmed his voice. History confirmed his character.
@ncbn @CEOAndhra
#CBN #VoteForNote #APElections2024 #MukeshKumarMeena #DemocracyForSale
అర్ధరాత్రి కేవలం 2 గంటల సమయంలో 17,19,482 ఓట్లు వేశారు
2024 ఏపీ ఎన్నికల ఫలితాల పై అనుమానాలు
8 గంటల్లో నమోదు అవ్వాల్సిన ఓట్లు కేవలం 2 గంటల్లో ఎలా నమోదయ్యాయి?
గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెనుక కుట్ర కోణం ఉందంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్న పలు రాజకీయ విశ్లేషకులు
ఎన్నికల రోజు ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన పోలింగ్ శాతం అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా పెరగడం, కేంద్ర మరియు రాష్ట్ర ఎన్నికల సంఘాల పోలింగ్ శాతానికి పొంతన లేకపోవడం పలు సందేహాలకు దారి తీస్తుందని ఆరోపణలు
మే 13వ తేదీ 2024 నాడు సాయంత్రం 5 గంటల వరకు 68.04% పోలింగ్ నమోదైందని, ఇంకా పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూ లైన్లో వేచి ఉన్నారని ప్రకటించిన ఏపీ సీఈవో
అదే రోజు రాత్రి 8 గంటలకు పోలింగ్ శాతం 68.12% గా నమోదైందని, 11:45 గంటలకు 76.50% పోలింగ్ శాతం నమోదైందని ప్రకటన
మే 17వ తేదీన పూర్తి పోలింగ్ శాతం 80.66% నమోదైందని, పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలిపి 81.86% పోలింగ్ నమోదైందని అధికారిక ప్రకటన విడుదల చేసిన ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం
కానీ కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితా ప్రకారం ఏపీ పోలింగ్ శాతం 81.79% ఉండడం సందేహాలకు దారి తీస్తుందని ఆరోపణలు
అయితే మే 13వ తేదీన సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పోలింగ్ శాతం 0.08% మాత్రమే పెరగడం, 8 గంటల నుండి 11:45 గంటల వరకు పోలింగ్ శాతం ఒకేసారి 76.50% నికి పెరగడం, అంటే 5 గంటల నుండి 11:45 గంటల వరకు దాదాపు 8.38% పెరగడంపై తలెత్తుతున్న అనుమానాలు
రాత్రి 11:45 గంటల తర్వాత కూడా 3,500 పోలింగ్ బూత్‌లలో ఇంకా పోలింగ్ కొనసాగుతుందని, ఆ బూత్‌లలో 4.16% ఓటింగ్ నమోదైందని, దీంతో మొత్తం పోలింగ్ శాతం 80.66% నమోదైందని ప్రకటించిన ఏపీ సీఈవో
మే 14వ తేదీన ప్రెస్ మీట్ పెట్టి అర్దరాత్రి 2 గంటలకు చివరి ఓటు నమోదైందని తెలిపిన సీఈవో
సీఈవో ప్రకటించిన లెక్కల ప్రకారం పోలింగ్ రోజు రాత్రి 11:45 గంటల నుండి అర్ధరాత్రి 2 గంటల వరకు, అంటే 2 గంటల 15 నిమిషాల వ్యవధిలో, 3,500 బూత్‌లలో 17,19,482 ఓట్లు నమోదవ్వడం గమనార్హం
3,500 బూత్‌లలో 17,19,482 ఓట్లు నమోదు అవ్వాలంటే, సగటున ఒక్క బూత్‌లో 491 ఓట్లు నమోదవ్వాలి, నిమిషానికి ఒక్క ఓటు వేసినా అన్ని ఓట్లు వేయడానికి 8 గంటలు పట్టాలి కానీ 2 గంటల్లో అన్ని ఓట్లు ఎలా నమోదయ్యాయి అనేది ప్రశ్నార్థకం
ఎన్నికల సంఘం లెక్కల ఆధారంగా, రాత్రి 11:45 గంటల తర్వాత ప్రతీ పోలింగ్ బూత్ ఎదుట 100 నుండి 135 ఓటర్లు వేచి ఉండాలి, అదే నిజమైతే ఒక్క బూత్‌లో 491 ఓట్లు ఎలా నమోదయ్యాయి?
ఒకవేళ నిజంగానే 2 గంటల్లో ఒక్క బూత్‌లో 491 ఓట్లు నమోదైతే, ఒక్క నిమిషానికి 3.6 ఓట్లు నమోదవ్వాలి, అంటే ఓటర్ గుర్తింపు ధృవీకరణ లాంటి, వేలు ముద్ర వేయడం, వేలుకి ఇంక్ పెట్టడం, ఓటు వేయడం ఇవన్నీ కేవలం 20 సెకన్లలో పూర్తి అవ్వాలి, అది ఎలా సాధ్యం?
ఈ లెక్కల గురించి ఆధారాలు ఎన్నికల సంఘం వద్ద ఉన్నాయా? ఒకవేళ వారు చెప్పిన లెక్కలు నిజమైతే అర్ధరాత్రి ఓట్లు వేసిన 17,19,482 ఓటర్లు క్యూ లైన్లో వేచి ఉన్న వీడియోలు బయటపెట్టేందుకు ఎన్నికల సంఘం సిద్ధమా అని ప్రశ్నిస్తున్న విశ్లేషకులు
మే 13వ తేదీన రాత్రి 11:45 గంటలకు ఉన్న 76.50% పోలింగ్ శాతం, మే 17వ తేదీన అది ఏపీ సీఈవో పూర్తి పోలింగ్ శాతం 81.66% అని చెప్పడం, కేంద్ర ఎన్నికల సంఘం 80.66% అని ప్రకటించడంతో తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్న రాజకీయ నిపుణులు
ఇదంతా చూస్తే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా గందరగోళం నెలకొందని, భవిష్యత్తులో ఎన్నికల సంఘం ఈ అంశంపై సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్న విశ్లేషకులు