📰✨ సీతంపేటలో ప్రజల ముంగిటకే కలెక్టర్ గారు - ప్రతి ఇంటికీ ఒక పారిశ్రామికవేత్త లక్ష్యంగా ముందడుగు - ప్రజల ఆదాయం పెంపే ప్రభుత్వ ధ్యేయం - జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి గారు ✨
🤝 సీతంపేట మండల కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి గారు ప్రజల నుంచి 91 వినతులను స్వీకరించి, అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ –
👉 ప్రతి గ్రామంలోని ప్రతి కుటుంబానికి ఆదాయం పెరిగేలా ప్రణాళికలు రూపొందించాలని,
ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలన్నదే ప్రభుత్వ సంకల్పమని,
క్షేత్రస్థాయిలో కుటుంబాల అవసరాలు గుర్తించి ఉపాధి మార్గాలు చూపాలని జిల్లా కలెక్టర్ గారు సూచించారు.
దిగువ స్థాయి సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఆదేశించారు.
సీజనల్ వ్యాధుల నివారణకు ప్రతి శుక్రవారం ‘ఫ్రైడే – డ్రైడే’ను పక్కాగా అమలు చేయాలని,
దోమల నివారణ, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.
గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లల పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని
అంగన్వాడీ కేంద్రాల సేవలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, NCPD కార్డుల నమోదు–పంపిణీలో ఆలస్యం జరగకూడదని స్పష్టం చేశారు.
సంక్షేమంతో పాటు అభివృద్ధి – అదే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ గారు పేర్కొన్నారు.
#PrajaSamasyalu
#PGRS
#FridayDryDay
#IncomeGeneration
#DistrictAdministration
#ParvathipuramManyam
#salur #parvathipuram #palakonda #kurupam
#trending #viral #instagram