ప్రతి పాఠశాలలో 10 శాతం విద్యార్థుల ప్రవేశాల పెరుగుదల సాధించాలి
జీరో పాఠశాలల్లో విద్యార్థుల నమోదుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి
12 మంది నుంచి 120 మందికి పెరిగిన చిన్నబోయినపల్లి పాఠశాల నమోదు ఆదర్శనీయం
పాఠశాలల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధం చేయాలి
2026-27 విద్యా సంవత్సరంలో విద్యార్థుల నమోదు పెంపు, విద్యా నాణ్యత మెరుగుదల, ఎఫ్ ఎల్ ఎన్ మిషన్, ఎఫ్ ఆర్ ఎస్ హాజరు, బడిబాట కార్యక్రమం నిర్వహణ, పాఠశాలల పునఃప్రారంభ ఏర్పాట్లపై మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు పాఠశాల, ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యాశాఖ అధికారులతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా అమలు చేయాలని, విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ మిషన్‌ను సమర్థవంతంగా అమలు చేసి విద్యార్థుల్లో ప్రాథమిక చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలను పెంపొందించాలని సూచించారు.
పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేలోపు తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుధ్యం, శానిటేషన్, విద్యుత్, ఫర్నిచర్, పరిశుభ్రత తదితర అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు సురక్షితమైన, పరిశుభ్రమైన విద్యా వాతావరణం కల్పించాలని అన్నారు.
విద్యార్థుల నమోదు పెంపు, విద్యా నాణ్యత అభివృద్ధి, పాఠశాలల సమగ్ర అభివృద్ధికి ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి ఏ సిద్ధార్థ రెడ్డి,ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కొప్పుల మల్లేశం, డి ఎమ్ హెచ్ ఓ గోపాలరావు, మున్సిపల్ కమిషనర్ సంపత్, డిఐఈఓ,అన్ని మండలాల ఎంఈఓ లు, ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
@TelanganaCMO @revanth_anumula @seethakkaMLA @TelanganaCS @IPRTelangana
#EducationSystem #EducationDevelopment
#EducationReform #EducationInnovation
#FutureOfEducation #QualityEducation
#EducationalLeadership #LearningForAll #EducationPolicy #TransformEducation #SchoolDevelopment #InclusiveEducation
#EducationForAll #FutureOfEducation